Illu Illalu Pillalu November 28 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- వల్లికి అన్నం తినిపించిన రామరాజు - రౌడీని కట్టేసిన ధీరజ్

Illu Illalu Pillalu Serial November 28th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నవంబర్ 28వ ఎపిసోడ్‌లో కోర్టుకెళ్లిన చందుకు లాయర్ కేసు వాయిదా పడిందని చెబుతాడు. దాంతో కోపంతో ఊగిపోతూ వల్లి దగ్గరికి వస్తాడు. చందును చూసిన అంజలి ఫాలో అవుతూ వస్తుంది. శ్రీవల్లికి రామరాజు అన్నం తినిపిస్తుంటాడు.

Published on: Nov 28, 2026, 09:10:01 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో నర్మద వీడియో కాల్ మాట్లాడుతుంది. కేసు వాయిదా గురించి టెన్షన్ లేదని, దాని తర్వాత చందు బావ ఎలా రియాక్షన్ ఎలా ఉంటుందో, ఎలాంటి రచ్చ చేస్తాడో అని భయంగా ఉందని అంటుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నవంబర్ 28వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నవంబర్ 28వ ఎపిసోడ్

వాళ్ల సైడ్ నుంచి మెడికల్ సర్టిఫికెట్ పెట్టారు

అది మేము చూసుకుంటామని రామరాజు అంటాడు. మరుసటి రోజు ఉదయం కోర్టుకు చందు వెళ్తాడు. లాయర్‌ను కలుస్తాడు. వాళ్ల సైడ్ నుంచి మెడికల్ సర్టిఫికెట్ సబ్‌మిట్ చేశారు. ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడిందని లాయర్ చెబుతాడు. అలా ఎలా చేస్తారు. వాళ్లదంతా డ్రామాల బ్యాచ్. ఇదంతా నాటకం అని చందు కోపంగా అంటాడు.

ఇలాంటి కేసులో తొందరపడితే పని జరగదు అని లాయర్ అంటాడు. దొంగ సర్టిఫికెట్లు పెట్టి వాయిదా తీసుకుని తప్పించుకుంటుందా. విడాకులపై సంతకం ఎందుకు పెట్టదో నేను చూస్తాను అని ఆవేశంగా బయలుదేరుతాడు చందు. మరోవైపు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కేసు పెట్టాల్సిన అవసరం లేదు. కారు దానంతట అదే వస్తుందని ప్రేమతో అంటాడు ధీరజ్.

దాంతో ప్రేమ భయపడుతుంది. ట్రావెల్ ఆఫీస్ డోర్ ఓపెన్ చేయమంటాడు ధీరజ్. ప్రేమ దండం పెట్టుకుని డోర్ ఓపెన్ చేస్తుంది. అందులో రౌడీ కుర్చీలో కట్టేసి ఉంటాడు. వాన్ని చూసి ప్రేమ దెయ్యం అని భయపడుతుంది. మన దగ్గర కారు తీసుకున్న రౌడీగాడు అని ధీరజ్ చెబుతాడు. ఇంతలో మిగతా రౌడీలు వస్తారు. అన్నన్న.. కారు తీసుకో అన్నా.. కారుకు ఏం డ్యామేజ్ కాలేదు. మా అన్నను వదిలేయన్నా అని బతిమిలాడుకుంటాడు రౌడీ.

రౌడీని కొట్టి కట్టేసిన ధీరజ్

వాన్ని ఒక్కటి కొట్టి మెయిన్ రౌడీ కట్లు విప్పేసి బయటకు పంపిస్తాడు. ఇదే మీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి నా జోలికి వస్తే పేగులు తీస్తానని ధీరజ్ వార్నింగ్ ఇస్తాడు. రేయ్ రాత్రి తాగి ఉన్న కాబట్టి నా పెళ్లాం ముందే కొట్టి తీసుకొచ్చావ్‌రా. చెప్తా నీ పని. నిన్ను మాత్రం వదలనురా. నా పెళ్లాం ముందే నా పరువు తీస్తావా అని రౌడీ అంటాడు.

రేయ్ నిన్ను నాలుగు ఎక్కువ కొట్టమందే నీ పెళ్లాంరా.. నువ్వు మంచి మనిషిగా మారాలని కోరుకుంటుంది. ఇకనైనా మారు. లేదంటే చంపేస్తాను అని ధీరజ్ అంటాడు. నీ అంతు చూస్తానురా అని రౌడీ వెళ్లిపోతాడు. ధీరజ్ చేసిన పనికి నీకెందుకురా ధూలపనులు, పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇస్తే అయిపోయేదిగా అని ప్రేమ అంటుంది.

మనం కంప్లైంట్ ఇస్తే వాడు కారు అమ్మేస్తాడు. అప్పుడు పోలీసులు ఏం చేస్తారు అని ధీరజ్ అంటాడు. రోజురోజుకు ఇంత వయోలెంట్‌గా తయరావుతున్నావేంట్రా అని కోపంగా వెళ్తుంది ప్రేమ. మరోవైపు చందు కోపంగా బైక్‌పై వెళ్తుండటం అంజలి చూస్తుంది. కోర్టుకు వెళ్తానని ఎటు వెళ్తున్నాడని అంజలి ఫాలో అవుతుంది. మరోవైపు శ్రీవల్లికి రామరాజు అన్నం తినిపిస్తాడు.

వల్లికి తండ్రిలా మామ

వల్లి చాలంటే.. ఇంకా నాలుగే ముద్దలు అని రామరాజు అంటాడు. ఇప్పుడు పెట్టే ముద్ద నీ భర్త ముద్ద అని రామరాజు పెడతాడు. వల్లి తింటూ ఉంటుంది. అమ్మడు నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. తల్లిదండ్రులుగా మేము నీకు ఎప్పుడు మంచిచెడు చెప్పలేదు. గొప్పగా పెంచలేదు. ఆ లోట్లన్నీ తీర్చడానికి దేవుడు నీకు మావయ్య, అత్తయ్య రూపంలో అమ్మనాన్నలను ఇచ్చాడని ఇడ్లీ బాబాయ్ అంటాడు.

బావగారు నిజంగా మీరు దేవుడు అని దండం పెడతాడు ఇడ్లీ బాబాయ్. వల్లి నాకు పెద్ద కోడలు. అంటే పెద్ద కోడలు అని రామరాజు అంటాడు. ఇంతలో చందు వచ్చి అన్నం ప్లేట్ విసిరేస్తాడు. చందుపై కోప్పడతాడు రామరాజు. మెడికల్ సర్టిఫికెట్ తెప్పించి కేసు వాయిదా వేయించావ్. ఆరోగ్యం బాగాలేకపోతే దున్నపోతులా ఎలా తింటున్నావే. నోరు తెరిస్తే అబద్ధాలు ఛీ.. ఏం బతుకే నీది అని చందు అంటాడు.

నేను కేసు వాయిదా వేయించడం ఏంటీ. నాకేం తెలియదు బా.. అని వల్లి అంటుంది. ఆ పని చేసింది వల్లి కాదు నేను. కోర్టు వాయిదా పడేందుకు కారణం నేను అని రామరాజు నిజం చెబుతాడు. మీకు ఏం పిచ్చి పట్టింది నాన్న కొడుకుని కాదని ఇలాంటి మోసగత్తెకు సపోర్ట్ చేస్తున్నారు. ఒక్కసారి మీ మాట విన్నందుకు నా జీవితం ఇలా అయింది. మళ్లీ నా జీవితం నాశనం చేయకు నాన్న అని చందు అంటాడు.

నీ బిడ్డకోసమైనా తగ్గరా..

దీన్ని నాకు మళ్లీ జత చేస్తే మీరు బతికుండగానే నన్ను చంపినట్లు నాన్న అని చందు అంటాడు. కోపంతో కాకుండా ప్రశాంతంగా ఆలోచించురా. వల్లి తప్పులు చేసింది తెలుసుకుంది. ఇప్పుడు పశ్చాత్తాపపడుతుంది. వల్లి కడుపులో పెరుగుతుంది నీ బడ్డే కదరా. బిడ్డకోసం కొంచెమైనా తగ్గలేవా అని రామరాజు అడుగుతాడు. ఆ మాటలన్ని అంజలి వింటుంది.

బిడ్డ గురించి ఆలోచించి ఇన్ని పాపాలు చేసిన దుర్మార్గురాలిని నేను క్షమించలేను. ఈ విషయంలో మా ఇద్దరి మధ్యలోకి నువ్వు రాకపోవడమే మంచిది నాన్న అని చందు అంటాడు. వస్తానురా.. కచ్చితంగా వస్తాను ఆగ్రహంతో అంటాడు రామరాజు. ఓవైపు నా కోడలి జీవితం, ఇంకోవైపు నా కొడుకు జీవితం. ఇద్దరి జీవితాలు చక్కబెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది అని రామరాజు అంటాడు.

మీరు నా జీవితాన్ని చక్కబెట్టట్లేదు. నాశనం చేస్తున్నారు అని చందు అంటాడు. రేయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. నేను అనుభవంతో మాట్లాడుతున్నా అని చందుతో రామరాజు గొడవ పడతాడు. మావయ్య వద్దు. నా వల్ల మీరిద్దరు గొడవ పడొద్దు. నా విషయంలో బావను బాధపెట్టొద్దు అని శ్రీవల్లి అంటుంది. వల్లిని చందు కోపంగా ఒక్కసారిగా చూస్తాడు.

అంజలిని చూసి డౌట్ పడిన వల్లి

వల్లి దడుసుకుంటుంది. చందు కోపంగా వెళ్తాడు. అంజలి గేట్ పక్కన దాక్కుంటుంది. అంజలిని గేటు దగ్గర శ్రీవల్లి చూస్తుంది. వల్లి చూడటం చూసి కంగారుగా వెళ్లిపోతుంది అంజలి. తనెందుకు వచ్చింది. పదే పదే నాకెందుకు తారసపడుతుంది అని వల్లి ఆలోచిస్తుంది. వాడి మాటలు, కోపాన్ని పట్టించుకోకు. వాన్ని ఏదో విధంగా దారిలో పెడతానని రామరాజు చెప్పి వెళ్లిపోతాడు.

మరోవైపు సాగర్ కోపంగా వస్తాడు. నీ కోడలు నన్ను లంచగొండిని చేసింది. నా పరువు బజారుకు ఈడ్చింది. ఇప్పుడు నేను ఏ జాబ్‌కి వెళ్లిన నేను లంచాలు తీసుకుని దొరికిపోయిన దొంగ వెధవ. పొమ్మని నా మొహంపై డోర్లు వేస్తున్నారు కోపంతో ఊగిపోతాడు సాగర్. నువ్వు చేసిన తప్పులనుంచి మారాలని ఇలా చేసిందని వేదవతి అంటుంది.

మీరంతా ఒక్కటే అని కోపంగా వెళ్లిపోతాడు సాగర్. అసలు ఈ కుటుంబానికి ఎవరి దిష్టి తగిలిందో అని వేదవతి అనుకుంటుంది. మరోవైపు ప్రేమ కోసం వెతుక్కుంటూ రెస్టారెంట్‌కి వెళ్తాడు ధీరజ్. అక్కడ బోలెడన్నీ ఐస్‌క్రీమ్స్ తింటుంటుంది ప్రేమ. నిన్ను రాక్షసి అనొద్దే.. కుంభకర్ణ అనాలి. కుంభకర్ణురాలివి. కోపం వస్తే పుట్టింటికి వెళ్తారు. ఇన్ని ఐస్‌క్రీమ్స్ కడుపులో ఎలా పట్టాయే అని ధీరజ్ అంటాడు.

తిట్టేందుకే వచ్చావ్

నీకు నా మీద ప్రేమ లేదు. ఇప్పుడు కూడా తిట్టేందుకే వచ్చావ్. ఇంకోసారి అలా మాట్లాడితే చంపేస్తాను అని కోప్పడతాడు ధీరజ్. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.