చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.
Karthika Deepam 2: దర్శకుడిగా మారిన కార్తీక దీపం 2 సూరజ్- ఓ టార్చర్ ప్రేమ టీజర్ రిలీజ్- హీరోగా సీనియర్ నటుడు మనవడు!
Karthika Deepam 2 Srikar Krishna Oo Torture Prema Teaser Launch: కార్తీక దీపం 2 సీరియల్లో సూరజ్ పాత్రతో అలరిస్తోన్న నటుడు శ్రీకర్ కృష్ణ దర్శకుడిగా మారారు. ఆయన నిర్మాతగా, దర్శకుడిగా తెరకెక్కిస్తున్న ఓ టార్చర్ ప్రేమ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఆ విశేషాలు చూద్దాం.
Karthika Deepam 2 Srikar Krishna Oo Torture Prema Teaser Launch: తెలుగు బుల్లితెర నటుడు దర్శకుడిగా మారారు. కార్తీక దీపం 2 సీరియల్ సెకండ్ హీరో (సూరజ్ పాత్ర) శ్రీకర్ కృష్ణ డైరెక్టర్‌గా సరికొత్త అవతారం ఎత్తారు. శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకర్ కృష్ణ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం “ఓ టార్చర్ ప్రేమ”.

ఓ టార్చర్ ప్రేమ టీజర్ రిలీజ్
ఈ సినిమాలో సీనియర్ నటుడు మాదాల రంగారావు మనవడు మాదాల రవి అబ్బాయి సన్నీ మాదాల హీరోగా, మౌనిక వీర్ హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈరోజు (నవంబర్ 27) హైదరాబాద్‌లో "ఓ టార్చర్ ప్రేమ" టీజర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎడిటర్ ప్రతీక్ నూటి మాట్లాడుతూ.. "ఒక పది మంది స్నేహితులం కలిసి ఈ సినిమాను ఏడాది పాటు కష్టపడి చేశాం. ఒక బ్యూటిఫుల్ మూవీ చేశామనే సంతోషం మా అందరిలో ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని మేమంతా నమ్ముతున్నాం" అని అన్నారు.
ట్రైలర్ అంతకంటే బాగుంటుంది
మ్యూజిక్ డైరెక్టర్ ఇషాక్ వలీ మాట్లాడుతూ.. "ఈ సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ శ్రీకర్‌కు థ్యాంక్స్. టీజర్ ఎంత బాగుందో మా మూవీ ట్రైలర్ అంతకంటే బాగుంటుంది. మా చిత్రాన్ని థియేటర్స్‌లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా" అని కోరారు.
సినిమాటోగ్రాఫర్ సామి మాట్లాడుతూ.. "ఒక మంచి ప్రేమ కథా చిత్రమిది. ఈ సినిమాను కంప్లీట్‌గా థియేటర్స్‌లో మీరు ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి ఫ్రెష్ కంటెంట్ ఉన్న సినిమాను మన ఆడియెన్స్ హిట్ చేస్తారనే నమ్మకం ఉంది" అని ఆశాభావం వ్యక్తం చేస్తారు.
మానస క్యారెక్టర్ చేస్తున్నా
హీరోయిన్ మౌనిక వీర్ మాట్లాడుతూ.. "ఈ చిత్రంలో మానస అనే క్యారెక్టర్ చేస్తున్నాను. నేను ఇలాంటి వేదిక మీద నిల్చొని మాట్లాడేందుకు ఆరేళ్లు పట్టింది. నాకు ఈ సినిమాతో ఎంతోమంది స్నేహితులు లభించారు" అని అన్నారు.
"ఈ సినిమాలో అవకాశం ఇచ్చి మా అందరికీ సపోర్ట్‌గా నిలబడ్డారు శ్రీకర్ కృష్ణ. ఆయన టీమ్ లోని ప్రతి ఒక్కరినీ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. అన్ని ఏజ్ గ్రూప్ ఆడియెన్స్ మా సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తారు. డిసెంబర్ 11న మా మూవీని చూసి సక్సెస్ చేయండి" అని హీరోయిన్ మౌనిక వీర్ కోరారు.
ఎలాంటి వల్గారిటీ లేని బ్యూటిఫుల్ మూవీ
డైరెక్టర్, ప్రొడ్యూసర్ శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ.. "మేమంతా కొత్త వాళ్లం కలిసి ఈ సినిమా కోసం కష్టపడి పనిచేశాం. మాకు ఎవరి సపోర్ట్ లేదు. అయినా మేము బాధపడటం లేదు. ఒక మంచి సినిమా చేసి మీ ముందుకు తీసుకొస్తున్నామని గర్వపడుతున్నా" అని అన్నారు.
"మా సినిమా పాటల్ని టీ సిరీస్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేసింది. మా మూవీని మైత్రీ డిస్ట్రిబ్యూషన్స్ వంటి ప్రెస్టీజియస్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఎలాంటి వల్గారిటీ లేని బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది. అందరూ ఎంజాయ్ చేసే కామెడీ మా మూవీలో ఉంటుంది. ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఈ సినిమా అంత ప్యూర్‌గా ఉంటుంది. ఈ జర్నీలో సపోర్ట్‌గా నిలిచిన నా టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్" అని కార్తీక దీపం 2 సూరజ్ తెలిపారు.

E-Paper
