...
...
Next Story

Illu Illalu Pillalu October 10 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- వల్లితో తెగదెంపులు, భాగ్యం శాపాలు-అసమర్థ తండ్రిగా రామరాజు

Illu Illalu Pillalu Serial October 10th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే అక్టోబర్ 10వ ఎపిసోడ్‌లో నర్మద, ప్రేమ, ధీరజ్, సాగర్‌లను వేడుకుంటుంది వల్లి. ఎవ్వరు వినరు. భాగ్యం కుటుంబాన్ని బయటకు గెంటేస్తారు. భాగ్యం శాపనార్థాలు పెడితే నర్మద లాగిపెట్టి కొడుతుంది. తల్లిదండ్రులను చితకబాదుతుంది వల్లి.

Published on: Oct 10, 2026, 08:45:52 IST
Advertisement

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో నీ గురించి తెలిసి కూడా మా కొంపను కూల్చుకోలేం. మా పిల్లల జీవితాలను పణంగా పెట్టలేం. నోరు మూసుకుని బయటకు నడు అని కోప్పడుతుంది వేదవతి. నర్మద, ప్రేమతో మీ విషయంలో నేను చేసింది తప్పే నన్ను క్షమించండి. మీరైనా మావయ్యకు చెప్పండి అని ప్రాధేయపడుతుంది శ్రీవల్లి.

మంచితనాన్ని చేతకానీ తనంగా

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అక్టోబర్ 10వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అక్టోబర్ 10వ ఎపిసోడ్

నిన్ను తోడబుట్టిదానిలాగా చూశాం కాబట్టే ఇంతకుముందు ఏది మావయ్యకు చెప్పలేదు. కానీ నువ్వు మా మంచితనాన్ని చేతకానీతనంగా చూశావ్ అని నర్మద అంటుంది. అబద్ధాలతో పెళ్లి చేసుకున్నాకా ఇకనైనా మారమని చెప్పాం. కొత్త వల్లిని చూస్తారని చెప్పి చివరికి నా కాపురానికే ఎసరు పెట్టావ్ అని తిడుతుంది ప్రేమ. ధీరజ్, సాగర్‌ను కూడా వేడుకుంటుంది.

ఎవరు వినరు. ఇంకా డ్రామాలు ఆడతావేంటే అని కోపంగా అన్న కామాక్షి తల్లితో గెంటేద్దామంటుంది. శ్రీవల్లిని కామాక్షి, వేదవతి ఇద్దరు పట్టుకుని బయటకు గెంటేస్తారు. భాగ్యం, ఇడ్లు బాబాయ్‌ని కూడా గెంటేస్తారు. రామరాజు ఇంట్లోనే ఉంటారు. అందరూ కలిసి నా కూతురుని గెంటేస్తారా. కాపురం కూల్చుతారా. మీ కుటుంబం నాశనం అవుతుందని శాపనార్థాలు పెడుతుంది భాగ్యం.

నా కుటుంబాన్ని అంటావా అని భాగ్యంను లాగిపెట్టి కొడుతుంది నర్మద. నా కుటుంబం జోలికి వస్తే ఊరుకోను అని నర్మద వార్నింగ్ ఇస్తుంది. భాగ్యం ఫ్యామిలీ మొత్తాన్ని గెంటేస్తారు. అసలు నీ కూతురు కాపురం ముక్కలు కావడానికి కారణం నువ్వే. నువ్వు అస్సలు తల్లివేనా అని నర్మద అంటుంది. పదా అమ్మడు అని భాగ్యం అంటే.. నేను ఇక్కడే ఉంటానని వల్లి ఏడుస్తుంది.

భాగ్యం వార్నింగ్

అంతా లోపలికి వెళ్తారు. ఇంట్లో దిగాలుగా కూర్చుంటారు. సుకన్య అందరికి టీ ఇస్తుంది. నర్మదకు ఇస్తే నీ మొహం మీద కొట్టమంటావా అని అంటుంది. ఇప్పుడు టీ ఏంటని సుకన్యపై తిరుపతి కోప్పడతాడు. ఆ వల్లి దగ్గర నేర్చుకుని ఉంటుంది. ఎక్కడ ఎలా ఏ నాటకం వేయాలి. ఎవరిని కూల్ చేయాలనేదే దీని నాటకాలు అని ప్రేమ కోప్పడుతుంది.

టీ బాగుందని చందు మెచ్చుకుంటాడు. భార్యను ఇంట్లోంచి పంపించినందుకు బాధగా లేదారా అని తిరుపతి అంటాడు. అది రాబందు. చివరికి పాపం పండి శిక్షపడింది అని చందు అంటాడు. ముందే బావకు నాకు చెప్పి ఉంటే ఇక్కడిదాకా వచ్చేది కాదుగా. బావ బుద్ది చెప్పి లైన్‌లో పెట్టేవాడుగా అని తిరుపతి అంటాడు. నా భార్య గారు నా దగ్గర కూడా దాస్తారు అని సాగర్ అంటాడు.

మన కుటుంబానికి ఇది పెద్ద దెబ్బ

నా కూడా తెలియదని ధీరజ్ అంటాడు. పెళ్లి మండపంలో నాకు అక్క చెప్పిందని ప్రేమ అంటుంది. అందుకే ఒప్పుకున్నావా అని ధీరజ్ అంటాడు. చివరికి నేనే బయటపెట్టాను అని చందు అంటాడు. పెట్టి ఏం చేశావ్. మావయ్య గారు ఎంత బాధపడుతున్నారో చూడండి. అటు వల్లి జీవితం ఇటు నీ జీవితం ప్రశ్నార్థకరంగా మారింది. ఇది మన కుటుంబానికి పెద్ద దెబ్బ. కోలుకోడానికి టైమ్ పడుతుందని నర్మద అంటుంది.

చూశావా సాగర్. అది నర్మదంటే. నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చింది కోడలిని కాదురా. ప్రతిక్షణం ఇంటికోసం ఆలోచించే పెద్ద కొడుకును అని చందు అంటాడు. అన్నయ్య చెప్పేదేంటంటే వదిన ఏం చేసిన ఇంటి క్షేమం కోసమే చేస్తుంది. మొగుడు అనే ఇగోకు పోయి నీకు చెప్పలేదని చిందులు వేయకని అని ధీరజ్ అంటాడు.

నా పెళ్లాం మీద అరవడానికి నాకు రైట్స్ లేవన్నమాట. నన్నెప్పుడు మీరు వేరుగా చూశారుగా అని సాగర్ సరదాగా అంటాడు. వల్లి పోయినందుకు బాధపకండని, ఇక తన పేరు వినిపించకూడదు అని చందు అంటాడు. కాపురం పాడుచేసుకుంటావా. బావతో అక్కతో నేను మాట్లాడతాను తిరుపతి అంటాడు. వాళ్ల గురించి మామకు ఇంకా అర్థం కానట్టుందని ధీరజ్ అంటాడు.

దొంగలముఠా మనిషి నీ పక్కనే ఉంది

నిజమేరా వాళ్లు చేసిన ఘోరాలను నమ్మలేకపోతున్నాను అని తిరుపతి అంటాడు. దొంగలముఠాలో మనిషిని నీ పక్కనే పెట్టుకుని నమ్మలేకపోతున్నా అంటావేంటీ బాబాయ్ అని ప్రేమ అంటుంది. నాకేం తెలియదని సుకన్య అంటే.. ప్రేమ కోప్పడి మీదకు వెళ్తుంది. దీనిని కూడా గెంటేయాల్సిందని అంటుంది. దాంతో వాళ్ల సైడ్ ఉన్నప్పుడు తప్పలేదు. ఇప్పుడు మీ సైడ్. మీలో ఒకదానిని సుకన్య అంటుంది.

మమ్మల్ని ముంచకుంటే చాలని ధీరజ్ అంటాడు. కచ్చితంగా వాళ్లతో కలిసి ముంచేస్తుందని ప్రేమ అంటుంది. చూడు తిరు. నేను ఇంట్లో ఉండను. పదా మనం వెళ్దామని సుకన్య అంటుంది. సుకన్య తింగరిది. వాళ్ల మాటలు విని చేసింది. వదిలేయమ్మ అని తిరుపతి అంటాడు. ప్రేమ వదిలేయ్. ఇప్పటికి జరిగింది చాలు. తిరుపతి బాబాయ్ అంటే ఇంట్లో గౌరవం ఉంది. అందుకే నిన్ను ఏమనట్లేదు. జాగ్రత్తగా ఉండమని నర్మద వార్నింగ్ ఇస్తుంది.

ఇక ప్రశాంతంగా పడుకుంటాను అని చందు వెళ్లిపోతాడు. చందు, ధీరజ్‌కి వల్లి కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు. అమ్మడు అనం తినే అని భాగ్యం వస్తుంది. కోపంతో చూస్తుంది వల్లి. అన్నం ప్లేట్ విసిరికొడుతుంది. మీ కారణంగా నా కాపురం ముక్కలు ముక్కలైపోయింది. సిగ్గులేకుండా అన్నం పట్టుకొచ్చారా అని వల్లి అంటుంది. టైమ్ చూసుకుని దెబ్బకొట్టడం ఈ భాగ్యం స్టైల్ అని భాగ్యం అంటుంది.

భాగ్యం, ఇడ్లీ బాబాయ్‌ని చితకబాదిన వల్లి

పనికిమాలిని డైలాగులు చెబితే తల్లిదండ్రులని కూడా చూడకుండా సంపేత్తాను అని వార్నింగ్ ఇస్తుంది శ్రీవల్లి. ఏం చేయాలో నాకు ఆలోచన ఉంది. నేను సెట్ చేస్తాను అని భాగ్యం అంటుంది. ఏంటీ సెట్ చేసేది. మావయ్యకు ఫోన్ చేసి ఏడ్చి వేడుకుంటే కరిగిపోతారు. నేను మావయ్యకు ఫోన్ చేస్తాను అని కాల్ చేస్తుంది వల్లి. మరోవైపు రామరాజు బాధతో కుమిలిపోతుంటాడు.

వల్లి కాల్ చేయడం చూసి ఫోన్ పక్కకు పెడతాడు. ఇంతలో వేదవతి వచ్చి చూస్తుంది. కట్ చేస్తుంది. దేవుడాలాంటి మావయ్య గారు కూడా కాల్ కట్ చేస్తున్నారు. ఇక నన్ను ఆ ఇంట్లో అడుగుపెట్టనివ్వరు. నా జీవితం ఇలా అవ్వడానిక కారణం మీరు అని తల్లిదండ్రులను కర్రతో చితకబాదుతుంది శ్రీవల్లి. రామరాజును తినమని వేదవతి అంటే.. తినాలని లేదని అంటాడు.

మోసం చేసింది అది. అలాంటి మోసగత్తె గురించి ఎందుకుండి బాధ అని వేదవతి అంటుంది. నేను చందు గురించి తల్లడిల్లి పోతున్నాను. మీరు అనుకుంటున్నట్లు నా జీవితం లేదు నాన్న అని వాడు అన్నప్పుడు మీ వల్లే నా జీవితం ఇలా అయిపోయింది నాన్న అని నన్ను అన్నట్లుగా నాకు అనిపించింది బుజ్జమ్మ. నువ్వు చేసిన పెళ్లి వల్లే నా జీవితం ఇలా అయిందని నా అసమర్థతను వాడు గుర్తుచేసినట్లుగా అనిపించిందని రామరాజు.

చేతకాని తండ్రిగా మిగిలిపోయా

పెద్దోడు అలా ఎప్పటికి అనుకోడని వేదవతి అంటుంది. కానీ, పెద్దకొడుకు జీవితం ఇలా అయిపోయిందన్న బాధ మనసులోనుంచి ఎలా తీసేయను. ఇది ప్రతిక్షణం నన్ను వేధిస్తూనే ఉంటుంది కదా. సరిగా ఎంక్వైరీ చేయకుండా పెళ్లి చేసినందుకు వాడి దృష్టిలో నేను చేతకాని తండ్రినే కదా అని రామరాజు ఏడుస్తాడు. వాళ్లు తీయగా అబద్ధాలు చెప్పారు. పెద్ద ఇల్లు చూపించారు. మోసం చేస్తారని ఎవరనుకుంటారని వేదవతి ఓదారుస్తుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks