Illu Illalu Pillalu Serial Latest Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు తాజా ఎపిసోడ్‌లో శ్రీవల్లి ఆడుతున్న నాటకాలు పూర్తిగా బయటపడటంతో రామరాజు కుటుంబం సహనం నశించింది. "నీ గురించి తెలిసి కూడా మా కొంపను కూల్చుకోలేం. బయటకు నడు" అని వేదవతి గట్టిగా అరుస్తుంది.
బతిమిలాడిన వల్లి

నర్మద, ప్రేమ, ధీరజ్, సాగర్‌లను క్షమించమని, మావయ్యకు నచ్చజెప్పమని బతిమిలాడుకుంటుంది శ్రీవల్లి. శ్రీవల్లి నర్మద, ప్రేమల కాళ్లావేళ్లా పడి క్షమించమని ప్రాధేయపడినా ఎవరూ కనికరించరు. అలాగే నాటకాలు ఆడుతుందని భావించిన వేదవతి, కామాక్షి, నర్మద, ప్రేమలకు సహనం నశించి వల్లిని, భాగ్యం కుటుంబాన్ని బయటకు గెంటేస్తారు.
ఇదే గొడవలో రామరాజు కుటుంబం నాశనమైపోతుందని భాగ్యం శాపనార్థాలు పెడుతుంది. దాంతో "నా కుటుంబం జోలికి వస్తే ఊరుకోను" అని నర్మద చెంపదెబ్బ కొట్టి మరి భాగ్యానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. అదే కోపంలో భాగ్యం కుటుంబాన్ని నర్మద, వేదవతి ఫ్యామిలీ గేటు బయటకు గెంటేస్తారు. ఇకపై శ్రీవల్లితో తనకు ఎలాంటి సంబంధం లేదని చందు తేల్చి చెబుతాడు.
చూసుకుంటాం చూసుకుంటాం. సమాధానం ఇస్తాం అంటూ ఏదోటి చేస్తాను అన్నట్లుగా భాగ్యం వార్నింగ్ ఇచ్చి వల్లిని బలవంతంగా లాక్కెళ్తుంది. శ్రీవల్లి వెళ్లిన తర్వాత ఇంట్లో అందరూ దిగాలుగా కూర్చుంటారు. సుకన్య అందరికీ టీ ఇవ్వడానికి ప్రయత్నించగా నువ్వు వల్లిలాగే డ్రామాలు చేస్తావని ప్రేమ కోప్పడుతుంది. మోసగాళ్ల పక్కన చేరి సుక్కు కూడా నాటకాలు ఆడిందని మండిపడుతుంది.
సుకన్యకు వార్నింగ్
తిరుపతి బాబాయ్‌పై ఉన్న గౌరవాన్ని మనసులో ఉంచుకుని నర్మద జోక్యం చేసుకుంటుంది. ఇంట్లో ఉండాలంటే పద్ధతిగా నడుచుకోవాలని సుకన్యను హెచ్చరిస్తుంది నర్మద. ఇకపై ఈ ఇంట్లో శ్రీవల్లి పేరు ఎవరూ ఎత్తకూడదని చందు స్పష్టం చేస్తాడు. ఇంటికి వెళ్లిన శ్రీవల్లి కోపం నరానరాలకూ పాకింది. భాగ్యం తీసుకొచ్చిన అన్నం ప్లేట్‌ను విసిరికొడుతూ తన కాపురం ముక్కలు కావడానికి కన్నవాళ్లే కారణమని శ్రీవల్లి నిలదీస్తుంది.
{{/usCountry}}తిరుపతి బాబాయ్‌పై ఉన్న గౌరవాన్ని మనసులో ఉంచుకుని నర్మద జోక్యం చేసుకుంటుంది. ఇంట్లో ఉండాలంటే పద్ధతిగా నడుచుకోవాలని సుకన్యను హెచ్చరిస్తుంది నర్మద. ఇకపై ఈ ఇంట్లో శ్రీవల్లి పేరు ఎవరూ ఎత్తకూడదని చందు స్పష్టం చేస్తాడు. ఇంటికి వెళ్లిన శ్రీవల్లి కోపం నరానరాలకూ పాకింది. భాగ్యం తీసుకొచ్చిన అన్నం ప్లేట్‌ను విసిరికొడుతూ తన కాపురం ముక్కలు కావడానికి కన్నవాళ్లే కారణమని శ్రీవల్లి నిలదీస్తుంది.
{{/usCountry}}క్షమించమని వేడుకునేందుకు మావయ్య రామరాజుకు ఫోన్ చేయగా, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడు. ఆ ఫోన్ కాల్‌ను వేదవతి కట్ చేస్తుంది. రామరాజు కుటుంబంలో మళ్లీ అడుగుపెట్టే అవకాశం లేకపోవడంతో శ్రీవల్లి తీవ్ర నిరాశకు గురవుతుంది. ఆవేశం తట్టుకోలేక కర్ర తీసుకుని తల్లి భాగ్యం, తండ్రి ఇడ్లీ బాబాయ్‌లపై దాడికి దిగుతుంది.
గోడలపై వల్లి ప్రేమ రాతలు
ఎంతో ప్రేమించిన బావ చందుకు దూరమైపోయానని వల్లి కుమిలిపోతుంది. ఇంటి గోడలపై వల్లి లవ్స్ చందు, వల్లి డై ఫర్ చందు (చందుకోసం వల్లి చస్తుంది) అని శ్రీవల్లి రాతలు రాస్తుంది. చందు పేరుపై తలపెట్టి ఏడుస్తుంటుంది వల్లి.
కూతురు బాధ చూడలేకపోతారు తల్లిదండ్రులు. ఏదోటి చేయాలని కన్నింగ్ ప్లాన్ వేస్తుంది భాగ్యం. వల్లిని తిరిగి అత్తింటికి పంపించేందుకు రామరాజు కుటుంబాన్ని నిందించాలనుకుంటుంది. దానికి ఏం చేస్తావని ఇడ్లీ బాబాయ్ అడుగుతాడు.
మనల్నీ, నా కూతురును అవమానించి గెంటేసినందుకు ఆ రామరాజు కుటుంబంపై, నర్మద, ప్రేమ, వేదవతిలపై పగ తీర్చుకుంటాను. మన అమ్మడిని ఆ చందు చిత్ర హింసలు పెడుతున్నాడని పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. రామరాజు కుటుంబంపై గృహ హింస కేసు పెడతానని భాగ్యం అంటుంది. దానికి ఇడ్లీ బాబాయ్ మైండ్ బ్లాక్ అవుతుంది.
భాగ్యం కన్నింగ్ ప్లాన్
ఇప్పటికే మనమీద వాళ్లు పీకల్లోతి కోపంలో ఉన్నారు. ఇప్పుడు ఇలా కేసు పెడితే ఇంకా ఊరుకుంటారా అని ఇడ్లీ బాబాయ్ అంటాడు. ఏదైతే అది అయింది. మన కూతురుని ఆ ఇంటికి పంపించాలంటే ఇదే దారి అని భాగ్యం స్కెచ్ వేస్తుందని సమాచారం.