Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో వేలం పాటలో 12 లక్షల ట్రావెల్ ఏజెన్సీని రూ. 30 లక్షలకు పాడినట్లు ధీరజ్ తిడుతుంది. తన నగలు అమ్మి ఆ డబ్బులు కడతానంటుంది ప్రేమ. అవి నగలు కాదు నాగుపాములు. ఇంకోసారి మీ అత్త పెళ్లాం నగలు అమ్ముకున్నాడని ఊరంతా ఫ్లెక్సీలు వేయిస్తుందని ధీరజ్ అంటాడు.
సేటు 20 లక్షల డిమాండ్

ఇంతలో రామరాజు, చందు వస్తారు. వేలంపాట గురించి చెబితే ప్రేమకే రామరాజు సపోర్ట్ చేస్తాడు. ధీరజ్ డబ్బు గురించి ఇబ్బంది పడుతున్నాడని వేదవతి చెబితే నేను లేనా. సర్దుబాటు చేయలేనా అని రామరాజు అంటాడు. బయట ఎక్కడైనా చూసుకుంటానని వద్దంటాడు ధీరజ్. ఇంతలో సాగర్‌కి డబ్బు ఇచ్చిన సేటు ఇంటికి వస్తాడు.
నెల నెల ఇంట్రెస్ట్ కడుతున్నాగా ఎందుకొచ్చారని సాగర్ అడుగుతాడు. 4, 5 నెలల నుంచి వడ్డీ మాత్రమే కడుతున్నావ్. అసలు కట్టట్లేదు అని సేట్జీ అంటాడు. నర్మద షాప్‌కి వచ్చి మాట్లాడతాననంటే.. రూ. 10 లక్షలు విలువ చేసే బంగారం షాపులో ఉంటే ఏదైనా రైడ్ జరిగితే మాకు సమస్య అవుతుందని, అందుకే రామరాజుతో మాట్లాడి తేల్చుకుందామని వచ్చానని సేట్ జీ అంటాడు.
డబ్బులు తీసుకుంది నేను, నగలు ఇచ్చింది నేను. మా నాన్నను ఎందుకు అడుగుతున్నారు. మీ మొహానా 20 లక్షలు కొట్టి నా స్తోమత నిరూపించుకుంటా. ఇంకోసారి మా నాన్నను డబ్బులు అడిగితే మర్యాదగా ఉండదు. ఒకవేళ ఆయన కడతానన్నా నేను ఒప్పుకోను. కట్టినా విసిరిపడేస్తాను. నేను అప్పు చేసిన డబ్బును మా నాన్న ఎందుకు కడతాడు. నాకు రోషం ఉందని సాగర్ అంటాడు.
50 లక్షలు కట్టాలంటే ఏదైనా అమ్మాలి
ముందు సేట్ ఇంటికి రాకుండా డబ్బులు కట్టమని రామరాజు అంటాడు. నాలుగు రోజుల్లో నీ 20 లక్షలు కడతానని సాగర్ ఛాలెంజ్ చేస్తాడు. కట్టకుంటే అప్పుడు చెబుతానని సేటు వెళ్లిపోతాడు. ధీరజ్ బాబుకు 30 లక్షలు, సాగర్ బాబుకి 20 లక్షలు కట్టాలంటే ఏదొక ఆస్తి అమ్మడం తప్పా ఎక్కడి నుంచి వస్తాయని సుకన్య ఐడియా ఇస్తుంది.
{{/usCountry}}ముందు సేట్ ఇంటికి రాకుండా డబ్బులు కట్టమని రామరాజు అంటాడు. నాలుగు రోజుల్లో నీ 20 లక్షలు కడతానని సాగర్ ఛాలెంజ్ చేస్తాడు. కట్టకుంటే అప్పుడు చెబుతానని సేటు వెళ్లిపోతాడు. ధీరజ్ బాబుకు 30 లక్షలు, సాగర్ బాబుకి 20 లక్షలు కట్టాలంటే ఏదొక ఆస్తి అమ్మడం తప్పా ఎక్కడి నుంచి వస్తాయని సుకన్య ఐడియా ఇస్తుంది.
{{/usCountry}}తిరుపతి మొట్టికాయ వేసి వారిస్తాడు. నీ ఆస్తిలో ఏదోటి అమ్మేసి కడదామని వేదవతి అంటుంది. అమ్మో అంటూ సుకన్య వెళ్లిపోతుంది. మరోవైపు విశ్వ, అమూల్య బైక్‌పై వెళ్తారు. బండ బజ్జీగా ఎక్కడికిరా. బైక్ ఆపు అని అమూల్య అంటుంది. విశ్వ ఆపుతాడు. అనవసరంగా నీకు చనువు ఇచ్చి తప్పు చేశాను. నన్ను ట్రాప్ చేశావని తిడుతుంది అమూల్య.
నేను తప్పు ఉద్దేశంతో తీసుకురాలేదే అని విశ్వ అంటాడు. ఇంతలో ఓ తల్లి పాప వస్తారు. అమూల్య నుంచి కాపాడారని విశ్వ అంటాడు. ఈ డబ్బుని నీ చేతులతో వీళ్లకి ఇవ్వమని చెప్పి ఇప్పిస్తాడు విశ్వ. నా బిడ్డ ప్రాణాలు కాపాడుతున్నారు. మీరిద్దరు జీవితాంతం సుఖంగా ఉండాలని దీవిస్తుంది ఆ తల్లి. ఇదంతా విశ్వనే అని అమూల్య చెబుతుంటే విశ్వ ఆపుతాడు.
పాప సర్జరీకి అమూల్యతో డబ్బు
పాప సర్జరీ అయ్యాక బాగా చదివించండని విశ్వ అంటాడు. మీకు చాలా మంచి భర్త దొరికాడమ్మా. చాలా అదృష్టవంతురాలివి అని ఆ తల్లి వెళ్లిపోతుంది. విశ్వ, అమూల్య గొడవపడతారు. తర్వాత ఇద్దరు సారీ చెప్పుకుంటారు. పాప ఆపరేషన్‌కు డబ్బు సాయం చేయాలనుకుంటే నువ్వే చేయొచ్చుగా. నాతో బలవంతంగా ఇప్పించావ్ అని అమూల్య అడుగుతుంది.
సహాయం చేస్తే పుణ్యం వస్తుందంటారుగా. అది నీకే రావాలని. నువ్వు తప్పా నాకు ఎవరున్నారని విశ్వ అంటాడు. ఆ మాటలకు ప్రేమతో కరిగిపోతుంది అమూల్య. మరోవైపు డాక్యుమెంట్స్ చూస్తుంటాడు రామరాజు. వేదవతి వచ్చి మీకేమైనా ఎగ్జామ్ ఉందా ఏంటీ. అమూల్య కంటే ఎక్కువ చదువుతున్నారని అంటుంది.
అవును నాకు ఎన్నడు రాని పరీక్ష వచ్చింది. ఇప్పటివరకు స్థలం అమ్మే పరిస్థితి రాలేదు. కానీ, ఇప్పుడొచ్చింది. ఊరి చివర ఉన్న స్థలాన్ని అమ్మేయాలనుకుంటున్నా అని రామరాజు అంటాడు. అంత అవసరం ఏమొచ్చిందని వేదవతి అడిగితే.. సుకన్య అమాయకంగా అందో తెలియదు కానీ.. నడిపోడి 20 లక్షలు, చిన్నోడి 30 లక్షలు ఎలా సర్దుబాటు అవుతాయని రామరాజు అంటాడు.
స్థలం అమ్మనున్న రామరాజు
50 లక్షలకు స్థలం అమ్మడం తప్పా ఇంకోదారి కనిపించట్లేదని రామరాజు అంటాడు. కానీ, చిన్నోడు తీసుకుంటాడా అని వేదవతి అంటే.. నేను వాడి బాబుని. వాడికంటే మొండోడిని అని రామరాజు అంటాడు. మరోవైపు గవ్వలు వేస్తూ తిరుపతి తల బాదుకుంటాడు. అది చూసి సుకన్య నీకు అప్పుడే పోయిందా తిరు.. తిరు అని ఏడుస్తుంది.
నాది పోయింది అనకు. రకరకాలుగా అనిపిస్తుందని తిరుపతి అంటాడు. నీకు బుర్ర పోయిందని, గాల్లో లెక్కలు వేస్తున్నావ్, తల గోక్కుంటున్నావ్, గాల్లో మాట్లాడుకుంటున్నావ్. బుర్రపోవడమేగా అని సుకన్య అంటుంది. 50 లక్షలు ఎలా సర్దుతారని ఆలోచిస్తున్నా అని తిరుపతి అంటాడు.
నా దగ్గర ఐడియా ఉంది. ఇక్కడుంటే నువ్వు బికారివి, ఆ ఇంట్లో ఉంటే కుబేరుడివి. మనం ఆ ఇంట్లోకి వెళ్దాం. అప్పుడు నీ వాటా నీ చేతికి వస్తుంది. దాంతో నీ అల్లుళ్ల డబ్బు సమస్య తీర్చొచ్చు అని సుకన్య ఐడియా ఇస్తుంది. నాలుగు ఎకరాలు అమ్మావనుకో వెండితెరపై హీరోయిన్గా వెలిగిపోతానంటుంది. వాటా అడిగితే భద్రావతి అక్క గొయ్యి తీసి కప్పెడుతుందని తిరుపతి అంటాడు.
15 లక్షలు ఎక్కడైనా తెస్తాను
మరుసటి రోజు ఉదయం తండ్రి అన్న మాటలు గుర్తు చేసుకుని డబ్బులు లెక్కపెడతాడు సాగర్. ఇంత డబ్బు ఎక్కడిది అని నర్మద అడుగుతుంది. శాలరీలో కొంత కొంత తీసి దాచానంటాడు సాగర్. నీ జీతంలో ఎక్కడ మిగులుతాయని గొడవ పడుతుంది నర్మద. ఈ రెండు లక్షలు నేను దాచుకున్నవి. బ్యాంకులో 3 లక్షలు ఉన్నాయి. మీ మావయ్య నన్ను చేతగాని వాడిలా చూస్తున్నాడుగా. ఇంకో 15 లక్షలు ఎలాగైనా సెట్ చేసి ఆ సేటు మొహంపై కొడతానని సాగర్ అంటాడు.
4 రోజుల్లో 15 లక్షలు ఎలా తీసుకొస్తావు. ఏదైనా తప్పు చేస్తే ఊరుకోను అని నర్మద అడుగుతుంది. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరో ఒకరు సహాయం చేస్తారు. నువ్వు అనుమానించడం తప్పా ఏం చేయవని సాగర్ వెళ్లిపోతాడు. సాగర్ ఏదో చేయబోతున్నాడని అనుమానిస్తుంది నర్మద. మరోవైపు వస్తాడు నా రాజు అంటూ పాట పాడుకుంటూ ఉంటుంది ప్రేమ.
ధీరజ్ వస్తే వచ్చావా నాధ అని ప్రేమగా మాట్లాడుతుంది. 30 లక్షల దెబ్బకి క్రాక్ వచ్చిందా అని ధీరజ్ అంటాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.