Illu Illalu Pillalu October 2 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- వల్లికి ఒక్కరోజు గడువు- మామతో అన్నదమ్ముల శోభనం ముచ్చట్లు
Illu Illalu Pillalu Serial October 2nd Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే అక్టోబర్ 2వ ఎపిసోడ్‌లో అంతా భోజనం చేస్తుంటారు. నర్మద వచ్చి శ్రీవల్లి బండారం బయటపెట్టాలని చూస్తుంది. కానీ, రామరాజు నర్మద గురించి పొగిడుతాడు. అంతా నర్మదను తినమంటారు. రామరాజు మాటలకు నర్మద కరిగిపోతుంది.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్‌తో దూరంగా ఉండటం ఎంత నరకంగా ఉందో చెబుతుంది ప్రేమ. తిరిగి నా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాను. మళ్లీ నా ఊపిరి తిరిగొచ్చినట్లుందని ప్రేమ సంతోషంగా అంటుంది. ప్రేమను వెనుక నుంచి ధీరజ్ హగ్ చేసుకుంటాడు. ఈసారి కొత్త ప్రయాణమే అని ప్రేమ అంటుంది.

దెయ్యంలా పట్టుకుంటాను
ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు. మళ్లీ మీ పుట్టింటికి తుర్రుమనొచ్చు అని ధీరజ్ అంటాడు. నేను నిన్ను దెయ్యంలా పట్టుకుని వేలాడుతాను. ఇప్పుడు బంధం మరింత గట్టిపడిందని ధీరజ్ గుండెలపై వాలిపోతుంది ప్రేమ. ధీరజ్ పాదాలపై తన కాళ్లు పెట్టి అటు ఇటు నడుస్తుంది ప్రేమ. మరోవైపు శ్రీవల్లి కుట్రల గురించి ఆలోచిస్తుంది నర్మద.
నీ బండారం బయటపెట్టే టైమ్ వచ్చేసిందని నర్మద అనుకుంటుంది. ఇంకోవైపు శ్రీవల్లి కూడా వణికిపోతుంటుంది. ఇంతలో వేదవతి గట్టిగా అరుస్తుంది. భోజనం వడ్డిద్దాం రా అని పిలుస్తుంది. ఇంట్లో అందరూ వస్తారు. చందు, ధీరజ్, తిరుపతి సీక్రెట్‌గా ముచ్చట్లు పెడతారు. ముగ్గురు తర్వాత తింటామంటారు. నీ గవర్నమెంట్ కోడలు ఏదని రామరాజు నర్మద పేరు తీస్తాడు.
దాంతో శ్రీవల్లి ఉలిక్కిపడుతుంది. అంతలోనే నర్మద వస్తుంది. నా పాలిట యమధర్మరాజులా వస్తుందని వల్లి భయపడుతుంది. సాగర్‌ను ఒక వేలు పట్టుకోమ్మంటుంది నర్మద. సాగర్ పట్టుకుంటాడు. ఇప్పుడే వల్లి బండారం బయటపెట్టాలని వెళ్తుంది. రామరాజుతో ఓ విషయం చెప్పాలని నర్మద అంటుంటే.. ఏది లేదని. కూర్చుని తినమని ప్రేమ అడుగుతుంది. వేదవతి ఆర్డర్ వేస్తుంది.
గుర్తుండిపోయేలా సెల్ఫీ
దాంతో చేసేదేం లేక తినడానికి కూర్చుంటుంది నర్మద. వల్లిని కూడా అందరు కూర్చోమంటారు. చందు, సాగర్, ధీరజ్, తిరుపతి అందరికి వడ్డిస్తారు. ఇది చాలా స్పెషల్ మూమెంట్, గుర్తుండిపోయేలా సెల్ఫీ తీసుకుందామని అమూల్య అంటుంది. ఈ ఆనందం అంతా నీవల్లే అని నర్మదను పొగుడుతాడు రామరాజు. ఎలాంటి గొడవలు, కలహాలు లేకుండా నా వాళ్లు ఇలా సంతోషంగా ఉండాలనేదే నా కోరిక అని రామరాజు అంటాడు.
అలా నర్మద నిజం చెప్పకుండా రామరాజు ఆపుతాడు. భోజనం పూర్తవుతుంది. రామరాజు మాటల గురించే నర్మద ఆలోచిస్తుంది. నిజం చెప్పేందుకు సతమతం అవుతుంది నర్మద. ఇప్పుడు కుటుంబాన్ని బాధపెట్టాలా. ఎలా బయటపెట్టాలని రామరాజు మాటలకు నర్మద కరిగిపోతుంది. ఇంతలో శ్రీవల్లి ఏడుస్తూ వస్తుంది. చేసిన తప్పులకు పశ్చాత్తాపం పడుతున్నా. లోపల నుంచి కన్నీళ్లు వస్తున్నాయని వల్లి అంటుంది.
నీ నాటకాలు నా దగ్గర కాదు. ప్లేట్‌తో కొడతానంటుంది నర్మద. మావయ్య గారి ముందు బయటపెట్టొద్దని బతిమిలాడుకుంటుంది శ్రీవల్లి. మరి దమ్ముంటే బయటపెట్టు నేనే వెళ్లిపోతానని ఛాలెంజ్ చేశావుగా. అప్పుడేమైందని నర్మద అంటుంది. కావాలంటే ధీరజ్, ప్రేమల కాళ్లు పట్టుకుని బతిమిలాడతాను. నువ్వు ఈ కుటుంబం ముక్కలు కాకుండా చూడు. మావయ్య గురించి, చందు బావ గురించి ఒక్కసారి ఆలోచించు అని వల్లి అంటుంది.
అన్నదమ్ములతో మామ మందు సిట్టింగ్
దాంతో నర్మద ఆలోచిస్తుంది. వర్కౌట్ అయ్యేలా ఉందని సైకోలా నవ్వుతుంది వల్లి. నేను మారిపోతాను అని వల్లి అంటుంది. ఈ రాత్రికి ప్రశాంతంగా పడుకో రేపు చూసుకుందాం అని నర్మద ఒక్కరోజు గడువు ఇచ్చి వెళ్లిపోతుంది. అంటే వల్లి డ్రామా వర్కౌట్ కాదు. మరోవైపు ముగ్గురు అన్నదమ్ములు, తిరుపతితో కలిసి మందు సిట్టింగ్ వేస్తాడు. ధీరజ్, ప్రేమ కలవడానికి కారణం నేను అని తిరుపతి చెబుతాడు.
సుకన్యకు నాకు పెళ్లి చేయడం వల్లే మీరిద్దరు కలుసుకోడానికి బాటలు పడ్డాయని తిరుపతి అంటాడు. కాదంటే గుక్కపట్టి ఏడుస్తావుగా సరే అని ధీరజ్ అంటాడు. మీకు శోభనం కాలేదటగా అని తిరుపతి అడిగితే.. మరి నీ సంగతి ఏంటని ధీరజ్ అడుగుతాడు. దాంతో తిరుపతి ఏడుస్తాడు. అందరు మన పెళ్లిని ఒప్పుకుంటేకానీ దగ్గరికి రానివట్లేదు. కనీసం ముట్టుకోనివ్వట్లేదని తిరుపతి అంటాడు.
శోభనం ముచ్చట్లు
అయితే జీవితకాలం నీకు ఏడుపు తప్పదు. నీ పెళ్లిని అందరూ ఒప్పుకోవడం జీవితంలో జరగదని సాగర్ అంటాడు. అలా మామ తిరుపతితో అన్నదమ్ములు శోభనం ముచ్చట్లు పెడతారు. చందు తెగ తాగుతాడు. నాన్న గెలిచాడు. ఆ భద్రావతి వాళ్లపై గెలిచాడు. వాళ్ల నోరు మూసుకునేలా చేశాడురా నాన్న అని చందు సంతోషంగా తాగుతు ఉంటాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


