Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో వల్లి చెప్పిన మాటలు విని చందును కొట్టి నానా మాటలు అంటాడు రామరాజు. పిల్లలు పుట్టలేదన్న విషయంలో నిన్ను వాడు కొట్టాడా, మానసికంగా హింసించాడా అని శ్రీవల్లిని వేదవతి అడుగుతుంది.
వల్లిని కొట్టిన వేదవతి

అది అంటూ వల్లి సాగదీస్తుంటే ఒక్కటి లాగిపెట్టికొడుతుంది వేదవతి. దాంతో రామరాజు ఫైర్ అవుతాడు. మీకు దీని గురించి తెలియదు అని రామరాజుతో అంటుంది. వేదవతి. నీ గురించి తెలిసినప్పుడే, నీ మోసాలు బయటపడ్డప్పుడే నిన్ను పుట్టింట్లో వదిలేసి వద్దామనుకున్నాను. కానీ, నువ్వు చచ్చిపోతానని బావిలో దూకావ్. నీ నిజస్వరూపం గురించి ఆయనకు చెబుతానంటే చచ్చిపోతాను అన్నావ్. ఇంకో తప్పు చేయను బుద్ధిగా ఉంటాను అన్నావ్. అందుకే నిన్ను రానిచ్చాను అని వేదవది అంటుంది.
కానీ, చివరికి నా కొడుకు మీద నిందలు వేస్తావా అని వల్లిని ఎడాపెడా కొడుతుంది వేదవతి. రామరాజు ఆపితే.. ఇది మీరు అనుకుంటున్నట్లుగా ఉత్తమురాలు కాదు అని ఇంకా కొడుతుంది వేదవతి. వల్లి బావిలో ఎందుకు దూకింది. ఏ విషయం నాకు చెబితే చచ్చిపోతానంది. తను చేసిన మోసాలు కుట్రలు ఏంటీ అని నిలదీస్తాడు రామరాజు.
ఏం లేదు ఇంతటితో ఈ విషయం వదిలేయండి అని వేదవతి అంటుంది. నా వెనుక ఇంత జరుగుతుంటే తెలుసుకోకుండా ఎలా ఉంటాను. అందరు కలిసి నన్ను పిచ్చోన్ని చేస్తున్నారా. నాకు మీరిచ్చే గౌరవం ఇదేనా. ఏరా పెద్దోడా అని రామరాజు అంటాడు. దాంతో రామరాజును నాన్నా అంటూ గట్టిగా హత్తుకుంటాడు చందు. రేయ్ పెద్దోడా ఎందుకు ఏడుస్తున్నావురా. అంతలా ఏడ్చే బాధ ఏముందిరా అని రామరాజు అడుగుతాడు.
శివయ్య విషాన్ని మోసినట్లు
ఆ శివయ్య గొంతులో విషాన్ని మోసాడు. నేను ఇక్కడ (గుండెల్లో) ప్రతిక్షణం ప్రాణం పోతున్నంత నరకాన్ని మోసాను. నిజం తెలిస్తే తట్టుకోలేవని, ఇప్పటికే చావు చివరిదాకా వెళ్లొచ్చిన మీరు ఏమైపోతారో అని నాలోనేనే చచ్చిపోయాను. నాన్న నా జీవితం బాలేదు. నువ్వు అనుకున్నంత అందంగా లేదు. నువ్వు నాకివ్వాలనుకున్న లైఫ్ లేదు నాన్న అని చందు తన బాధను చెప్పుకుంటాడు.
{{/usCountry}}ఆ శివయ్య గొంతులో విషాన్ని మోసాడు. నేను ఇక్కడ (గుండెల్లో) ప్రతిక్షణం ప్రాణం పోతున్నంత నరకాన్ని మోసాను. నిజం తెలిస్తే తట్టుకోలేవని, ఇప్పటికే చావు చివరిదాకా వెళ్లొచ్చిన మీరు ఏమైపోతారో అని నాలోనేనే చచ్చిపోయాను. నాన్న నా జీవితం బాలేదు. నువ్వు అనుకున్నంత అందంగా లేదు. నువ్వు నాకివ్వాలనుకున్న లైఫ్ లేదు నాన్న అని చందు తన బాధను చెప్పుకుంటాడు.
{{/usCountry}}నాకు కావాల్సిన అమ్మాయి దొరికిందని సంతోషించావ్. కానీ, నువ్వు మోసపోయావ్ నాన్న.. లేదు మోసం చేశారు. నమ్మించి మోసం చేశారు అని చందు అంటాడు. బావ ప్లీజ్ బావ. నేను మావయ్యతో తర్వాత మాట్లాడతాను. జరిగింది అర్థమయ్యేలా చెబుతాను. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయ్ బావ అని వల్లి ఏడుస్తూ అంటుంది.
ఏం చెబుతావ్ వింటే అబద్ధాలు చెబుతావ్. నమ్మితే మోసం చేస్తావ్ అంతేగా అని చందు కోప్పడుతాడు. నాన్న కేవలం మీకోసమే ఇది చేసిన తప్పులన్నీ క్షమించాను. మిమ్మల్ని మోసం చేశానని చచ్చిపోతున్నా. ఇక నా వల్ల కాదు. ఇక్కడున్న నరకాన్ని, బాధను తెంచేసుకుంటాను అని చందు అంటే.. వల్లి ప్లీజ్ బావ అంటుంది. దాంతో వల్లి పీక పట్టుకుంటాడు చందు.
పెళ్లి నుంచి తల్లి దాకా
అంతా షాక్ అవుతారు. ఇది వాళ్ల అమ్మ బాబు కలిసి మన కుటుంబాన్ని నాశనం చేశారు. ఎదురింటి శత్రువులనైనా నమ్మొచ్చు గానీ వీళ్లను నమ్మరాదు. తేనేపూసిన కత్తులు వీళ్లు. వీళ్లు చేసిన ఒక్కటి కూడా వదలకుండా చెబుతాను. వీళ్లది ఫైనాన్స్ బిజినెస్ కాదు నాన్న. సైకిల్ మీద వీళ్ల నాన్న ఇడ్లీలు అమ్ముతాడు. ఇది ఎమ్ఏ ఇంగ్లీష్ అని చెప్పారుగా.
దీని మొహనికి పదో తరగతి కూడా పాస్ కాలేదు నాన్నా.. పెళ్లి ఖర్చులకు కూడా నాతో రూ. 10 లక్షలు అప్పు చేసి తీసుకున్నారు. ఆరోజు సేటు వచ్చి అడిగాడుగా. అది వీళ్లకోసం చేసిందే నాన్న. మీ మంచితనాన్ని చూసుకుని దారుణంగా మోసం చేశారు. వీళ్ల అమ్మకు కాలు విరిగిందంటే పుట్టింట్లో వదిలేసి వచ్చాగా. వీళ్ల కుట్రలు తెలిసే వదిలేసి వచ్చానని అని చందు చెబుతాడు.
నాకేం అర్థం కావట్లేదురా. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదురా. తనమీద కోపంతో ఇలా మాత్రం చెప్పకురా అని రామరాజు అంటాడు. లేదు మావయ్య అంతా నిజాలే. మా అందరికి తెలుసు. మీకోసమే చెప్పలేదు. ఇంట్లో అడుగుపెట్టడానికి తల్లి అనే ఎమోషన్‌తో ఆడుకుంది. నెల తప్పానని, తల్లి కాబోతున్నానని అబద్ధం చెప్పింది అని నర్మద అంటుంది.
అమూల్యకు సలహా
దాంతో వల్లిని చూస్తూ అసహ్యించుకుంటాడు రామరాజు. నెలతప్పిందని చెబితేనే ఇంటికి తీసుకొచ్చాను. మనందరిని పిచ్చోళ్లను చేసి ఆడుకుందని వేదవతి అంటుంది. నిజం బయటపడుతుందని ఆటో గుద్దించి హాస్పిటల్‌కి వెళ్లారు. స్లీపర్‌తో డాక్టర్ వేషం వేయించి అబార్షన్ అయినట్లు నాటకం ఆడారు. నర్మద వదిన మీద నిందలు వేశారు. మనముందు నిందలు వేశారు అని ధీరజ్ చెబుతాడు.
ఇంతేకాదు మావయ్య ఆరోజు ఈవిడకు కేజీలకు కేజీలు బంగారం పెట్టారన్నారుగా. కానీ అవి రోల్డ్ గోల్డ్ నగలు. నాకిచ్చిన నగల్లో తన నగలు పెట్టి మా ఇంటికి పంపించింది అని ప్రేమ చెబుతుంది. విశ్వను ప్రేమించమని అమూల్యకు సలహా ఇచ్చింది. విశ్వ తీసుకెళ్లేలా చేసిందే తను నాన్న అని ధీరజ్ చెబుతాడు. ధీరజ్, ప్రేమలు విడిపోడానికి కారణం కూడా తనే అని నర్మద జరిగింది చెబుతుంది.
భద్రావతితో ఈవిడగారు ఫోన్‌లో మాట్లాడింది నేను నిరూపిస్తాను అని సిమ్ చూపిస్తుంది నర్మద. ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయాను అని వల్లి అనుకుంటుంది. ఈ నెంబర్‌తో కాల్ చేస్తాను. ఎవరు మాట్లాడతారో వినండి అని కాల్ చేస్తుంది నర్మద. ఎందుకు ఫోన్ చేశావ్. మా తమ్ముడి మీదకు ఆ సుక్కును ఉసిగొలిపావ్. మళ్లీ ఏం ప్లాన్ చేశావ్ అని భద్రావతి మాట్లాడుతుంది.
రామరాజుకు గుండెపోటు
నువ్వు ఆ ఇంట్లో ఉంటే రామరాజుగాడి మీద పగ తీర్చుకునేందుకు పనికి వస్తావని నిన్ను భరిస్తున్నాను. లేదంటే నీ అంతు ఎప్పుడో చూసేదాన్ని. ఇంకోసారి ఫోన్ చేశావంటే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి మరి భద్రావతి కాల్ కట్ చేస్తుంది. ఆరోజు తిరుపతి బాబాయ్‌ని భద్రావతి ఇక్కడి నుంచి లాక్కెళ్లడానికి కారణం కూడా తనే అని నర్మద చెబుతుంది.
అన్ని విన్న రామరాజుకు కళ్లు బైర్లు కమ్ముతాయి. గుండెపట్టుకుని కూలిపోతాడు రామరాజు. అంతా కంగారుపడతారు. రామరాజుకు నీళ్లు తాగిస్తారు. వల్లి దగ్గరికి వస్తే రావద్దమ్మా అని రామరాజు అంటాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.