Illu Illalu Pillalu September 10 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. గుడిలో ఎంగేజ్మెంట్ అని తిరుపతిని సేనాపతి బలవంతంగా తీసుకెళ్తాడు. బాబాయికి గుడిలో సడెన్ గా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశార్రా అని ధీరజ్ తో ప్రేమ చెప్తుంది.
తిరుపతికి ఎంగేజ్మెంట్

మరోవైపు రామరాజు కూడా రైస్ మిల్ కు వస్తానని చందుతో అంటాడు. రైస్ మిల్ లో డబ్బులు పోతుంటే మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తాడు. అప్పుడే అమ్మా అంటూ అరుస్తూ ధీరజ్ లోపలికి వెళ్తాడు. కానీ వేదవతి ఉండదు. ఏమైందని రామరాజు అడిగితే.. తిరుపతి మామాకు గుడిలో ఎంగేజ్మెంట్ అంటా అని ధీరజ్ చెప్తాడు.
పెళ్లి మంచిదే
దీనికేనా ఇంత కంగారు పడుతున్నావ్. భద్రావతి కోపంతో చేసినా కూడా తిరుపతికి పెళ్లి అయి మంచి జీవితం ఏర్పడుతుంది. నేను కూడా వాడికి పెళ్లి చేయాలనుకున్నా. కానీ రెండు కుటుంబాలు కలిసిన తర్వాతే చేసుకుంటానన్నాడు. పిలవకపోయినా మన కుటుంబం మొత్తం వాడి పెళ్లికి వెళ్దాం. ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు అని చిన్నోడికి చెప్పి రామరాజు వెళ్లిపోతాడు.
బల్లక్కాయ్ డ్రామా
సుక్కు విషయంలో భాగ్యం కుట్ర చేసినట్లు అనిపిస్తోంది. తిరుపతికి భద్రావతి మంచి సంబంధమే చూసి ఉంటుందని ధీరజ్ తో నర్మద అంటుంది. అప్పుడే మా కుటుంబంపై నిందలు వేస్తారేంటీ అని శ్రీవల్లి మధ్యలోకి వస్తుంది. తిరుపతి ఏమైనా చిన్నపిల్లోడా? సుకన్య ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి తిరుపతి ఆమె వెనుకాల పడ్డాడని వల్లి తెగ డ్రామా ఆడేస్తుంది.
మాది అమాయక కుటుంబం, మేం మంచోళ్లం అంటూ వల్లి మొసలి కన్నీరు కారుస్తుంది. ఇక సుక్కుతో తిరుపతి బాబాయికి పెళ్లి కాకపోవడమే మంచిదని ధీరజ్ కు నర్మద చెప్తుంది. ఏడుస్తూ వెళ్లిన వల్లి గది లోపలికి వెళ్లగానే సైకోలా నవ్వుతుంది. తల్లి భాగ్యానికి కాల్ చేసి గుడిలో తిరుపతికి ఎంగేజ్మెంట్ ప్లాన్ చేశారనే విషయాన్ని చెప్తుంది.
రెచ్చగొట్టిన సుక్కు
{{/usCountry}}మాది అమాయక కుటుంబం, మేం మంచోళ్లం అంటూ వల్లి మొసలి కన్నీరు కారుస్తుంది. ఇక సుక్కుతో తిరుపతి బాబాయికి పెళ్లి కాకపోవడమే మంచిదని ధీరజ్ కు నర్మద చెప్తుంది. ఏడుస్తూ వెళ్లిన వల్లి గది లోపలికి వెళ్లగానే సైకోలా నవ్వుతుంది. తల్లి భాగ్యానికి కాల్ చేసి గుడిలో తిరుపతికి ఎంగేజ్మెంట్ ప్లాన్ చేశారనే విషయాన్ని చెప్తుంది.
రెచ్చగొట్టిన సుక్కు
{{/usCountry}}భద్రావతి ఎవరికి తెలియకుండా సడెన్ గా ఫిక్సింగ్ చేసేసిందని బల్లక్కాయ్ చెప్పేసరికి భాగ్యం, సుక్కు షాక్ అవుతారు. అయితే ధీరజ్ కు ఫోన్ చేసి తాను చెప్పినట్లు చెప్పమని వల్లి మరో కుట్ర స్టార్ట్ చేస్తుంది. వెంటనే ధీరజ్ కు కాల్ చేసిన సుక్కు.. తిరుపతితో పెళ్లి కాకపోతే చచ్చిపోతానని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. మా చిన్నళ్లుడు దేవుడినైనా ఎదురించి మన పెళ్లి చేస్తాడని మీ మామ చెప్పాడని ధీరజ్ ను సుక్కు రెచ్చగొడుతుంది.
పెళ్లి చేయాలని
నేను పోతాను. ఆ వెంటనే తిరుపతి కూడా బాధతో చచ్చిపోతాడు. మా ఇద్దరి చావుకు కారణం నువ్వే అవుతావు. ఎందుకంటే మా పెళ్లి చేస్తానని మాటిచ్చావ్ కదా అని సుక్కు డ్రామా ఆడుతుంది. దీంతో కచ్చితంగా ఈ రోజే మీ పెళ్లి చేస్తానని ధీరజ్ ఏం ఆలోచించకుండా మాటిస్తాడు. కానీ రెండు కుటుంబాల మధ్య గొడవకు కారణం అవుతావేమో ఆలోచించుకోరా అని మళ్లీ ధీరజ్ అనుకుంటాడు. కానీ చివరకు పెళ్లి చేయాల్సిందేనని అనుకుంటాడు. దీంతో బల్లక్కాయ్ ఆటలో పావులుగా ధీరజ్, ప్రేమ మారిపోతారు.
ప్రేమ బిల్డప్
ఇక ప్రేమ ఏమో కళ్లకు అద్దాలు పెట్టుకొని తెగ బిల్డప్ గా బయటకు వస్తుంది. ఎవరో అనుకొని దగ్గరకు వెళ్లిన ధీరజ్.. తీరా ప్రేమ అని తెలిశాక జడుసుకుంటాడు. తిరుపతి, సుక్కుకు పెళ్లి చేయడం తప్ప మరో ఆప్షన్ లేదని ధీరజ్, ప్రేమ అనుకుంటారు. వీళ్లను నర్మద చూస్తుంది. అక్కకు చెప్తామని ప్రేమ అంటే.. వద్దని ధీరజ్ అంటాడు.
నర్మదకు డౌట్
మీ లవ్ బర్డ్స్ మధ్య ఏం జరుగుతుంది? మీరు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? అని నర్మద అడుగుతుంది. కలిసిపోవడాలు ఏం లేదు వదిన. కోచింగ్ సెంటర్లో డ్రాప్ చేయమని అడుగుతుంది. కానీ నడుచుకుంటూ వెళ్లమన్నానని ధీరజ్ కార్లో వెళ్లిపోతాడు. తన బండి మీద డ్రాప్ చేస్తానని నర్మద అంటుంది. కానీ నువ్వు డ్రాప్ చేస్తే మీ మరిది అవమానిస్తాడని ప్రేమ తెగ యాక్టింగ్ చేస్తుంది.
ప్రేమ భారీ డైలాగ్ లకు నర్మదకు డౌట్ వస్తుంది. పెళ్లికి రెడీ అవుతున్నట్లు ప్రేమ రెడీ అయింది. వీళ్లను ఫాలో అవుదామని నర్మద అనుకుంటుంది. ప్రేమ నడుచుకుంటూ వెళ్లి ధీరజ్ కారు ఎక్కడం నర్మద చూస్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.