Illu Illalu Pillalu September 4 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ‘బావిలో బల్లి’ కథ చెప్పి శ్రీవల్లి, భాగ్యం అండ్ కోకు చెమటలు పట్టిస్తుంది నర్మద. ఏం చేయాలో తెలియక కథలు చెప్తున్నావా సెల్లాయ్ అని పైకి గంభీరంగా అడుగుతుంది బల్లక్కాయ్.
శ్రీవల్లి టెన్షన్

అక్కా, నువ్వు సినిమాల్లో యాక్టింగ్ చేసి ఉంటే పక్కా నంది వచ్చేది. ఎంత బాగా నటిస్తున్నావ్? నువ్వు మంచిదానివని నమ్మించేందుకు బావిలో దూకావు. ప్రేమ, ధీరజ్ ను విడగొట్టావ్. రైస్ మిల్ లో డబ్బులు కొట్టేసి, తిరుపతి బాబాయిని ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేశావు. ఆ నింద భద్రావతిపై పడేలా చేశావంటూ జరిగిందంతా నర్మద చెప్పేసరికి శ్రీవల్లి గుటకలు మింగుతుంది.
బల్లక్కాయ్ కాళ్లబేరం
నువ్వు చేసిన వెధవ పని బయటపడితే నీ బతుకు బస్టాండ్ అనే లాజిక్ ఎలా మర్చిపోయావ్ అని నర్మద బెదిరిస్తుంది. దీంతో బల్లక్కాయ్ కాళ్లబేరానికి వస్తుంది. నువ్వు ఏం చెప్తే అది చెస్తానంటూ కాళ్లు పట్టుకుంటుంది. కానీ ఇలా రిక్వెస్ట్ చేస్తాననుకున్నావా చెల్లి? నేను ఏ తప్పు చేయలేదు. నేను చేయను కూడా. నిజం నిరూపణ కావాలంటే సాక్ష్యాలు కావాలని వల్లి బిల్డప్ కొడుతుంది.
నర్మద వార్నింగ్
నిజం నిప్పులాంటిది అక్క. చేయి కాలుతుంది. ఇవన్నీ నిజాలని నిరూపిస్తే ఏం చేస్తావని నర్మద అడుగుతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోతానని వల్లి ట్విస్ట్ ఇస్తుంది. నువ్వు ఎలాగో ఓడిపోతావ్ కదా. అప్పుడు నేను పెట్టే షరతు ఎలా ఉంటుందో ఆలోచించుకో అని వల్లి కౌంటర్ వేస్తుంది. బయటకు వెళ్లి బతికేందుకు రెడీగా ఉండమని వార్నింగ్ ఇచ్చి నర్మద వెళ్లిపోతుంది.
ఈ నర్మద పట్టపగలే చుక్కలు చూపించింది. నువ్వెందుకు ఛాలెంజ్ చేశావని వల్లిని భాగ్యం అడుగుతుంది. నర్మద గెలవదు. మనం భయపడి నోరు జారుతామని అనుకుంటుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండని తల్లిదండ్రులకు, సుక్కుకు వల్లి చెప్తుంది.
భద్రావతి ఫైర్
{{/usCountry}}ఈ నర్మద పట్టపగలే చుక్కలు చూపించింది. నువ్వెందుకు ఛాలెంజ్ చేశావని వల్లిని భాగ్యం అడుగుతుంది. నర్మద గెలవదు. మనం భయపడి నోరు జారుతామని అనుకుంటుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండని తల్లిదండ్రులకు, సుక్కుకు వల్లి చెప్తుంది.
భద్రావతి ఫైర్
{{/usCountry}}మరోవైపు తిరుపతి పెళ్లి సంబంధం చెడగొట్టారని భద్రావతి ఫైర్ అవుతుంది. వాళ్లు ఎవరో కనిపెట్టాలని సేనాపతికి భద్రావతి చెప్తుంది. అది కచ్చితంగా ధీరజ్ పనే. ఇన్నాళ్లు వాళ్లు చేయలేని పని మనం చేస్తున్నామని ఓర్వలేక చెడగొడుతున్నారని సేనాపతి అంటాడు. వాడితో పాటు ఓ అమ్మాయి కూడా ఉందంటా. వాడితో వెళ్లిని అమ్మాయి ఎవరై ఉంటుందని భద్రావతి అనేసరికి విశ్వ, ప్రేమ ఫ్యూజుల్ ఔట్ అయిపోతాయి.
వాడితో వెళ్లిన ఆ అమ్మాయి ఎవరో నీకు మాత్రమే తెలుసు ప్రేమ. ఎవరో చెప్పు అని ప్రేమను భద్రావతి అడుగుతుంది. అత్త నాకు తెలుసు. పెద్దక్క నర్మదనే అని విశ్వ మధ్యలో వచ్చి చెప్తాడు. దీంతో విశ్వ చెంపపై కొడుతుంది భద్రావతి. కచ్చితంగా నర్మదనే. కానీ ఆ అమ్మాయిని వరుసలు కలిపి మాట్లాడావని కొట్టానని భద్రావతి ఫైర్ అవుతుంది.
రామరాజు కుటుంబానికి బుద్ధి చెప్తా. నా తమ్ముడి పెళ్లి ఎవరితో, ఎలా చేయాలో నాకు తెలుసని భద్రావతి ఊగిపోయి లోపలికి వెళ్లిపోతుంది. అత్త సంగతి తెలిసి కూడా పెద్దక్క అన్నావేంటీ అని విశ్వను చూసి ప్రేమ నవ్వుకుంటుంది.
దొంగచాటుగా వల్లి
ఇటు రామరాజు ఇంట్లో నర్మద, వేదవతి, ధీరజ్ ఒకే గదిలోకి వెళ్లడం వల్లి చూస్తుంది. కిటికీ దగ్గరకు వెళ్లి వాళ్ల మాటలను దొంగచాటుగా బల్లక్కాయ్ వింటుంది. ఆ వల్లి అమాయకంగా కనిపించే అనకొండ. మన మెడకే చుట్టుకొని, మనల్నే మింగేస్తుందని నర్మద అంటుంది. ఇప్పుడు తను పూర్తిగా మారిపోయింది కదా. పైగా అన్నయ్య కోసం బావిలో దూకిందని ధీరజ్ చెప్తాడు.
నిజానిజాలు తెలియకుండా ఒకరిని నిందించడం తప్పు నర్మద అని వేదవతి అంటుంది. తనమీద నాకు అనుమానం పోలేదు. ఒక్క తీగ దొరికితే డొంకంతా లాగుతానని నర్మద చెప్తుంది. దొరికినప్పుడు చూసుకుందామని వేదవతి, ధీరజ్ వెళ్లిపోతారు. ఈ వల్లి రంగులు మార్చే ఊసరవెళ్లి, పట్టుకోవడం నీ తరం కాదని బల్లక్కాయ్ అనుకుంటుంది.
తిరుపతి హ్యాపీ
పెళ్లి సంబంధాన్ని చెడగొట్టినందుకు ధీరజ్, ప్రేమకు తిరుపతి థ్యాంక్స్ చెప్తాడు. మీరిద్దరు కలిసి ఉంటే ఏదైనా సాధించగలరని తిరుపతి అంటాడు. దీంతో ప్రేమ, ధీరజ్ మళ్లీ ఒకరిని ఒకరు మాటలు అనుకుంటారు. పెళ్లి సంబంధాన్ని చెడగొట్టేందుకు వెళ్లినప్పుడు నీ గురించి ఏం చెప్పాడో తెలుసా బాబాయి అని ప్రేమ చెప్పబోతుంటే ధీరజ్ నోరు మూస్తాడు. ప్రేమ కొరుకుతుంది.
అప్పుడే వేదవతి, నర్మద బయటకు వచ్చి ఏమైందని అడుగుతారు. పెళ్లి సంబంధం అంటూ నోరు జారబోతున్న తిరుపతిని ధీరజ్ ఆపుతాడు. ఏరా, తిరిగి ఇంటికి రావాలని లేదా? అక్కగా నిన్ను అనే హక్కు లేదా. నేను మాటవరుసకు డబ్బులు తీశావా అని అడిగానని వేదవతి అంటుంది. పాతికేళ్లు నీ దగ్గరే పెరిగా కదా అక్క. నేను డబ్బులు తీస్తానా అని ఫీల్ అయిపోయి తిరుపతి లోపలికి వెళ్లిపోతాడు.
విశ్వ వీడియో కాల్
నైట్ చదువుకుంటున్న అమూల్యకు విశ్వ వీడియో కాల్ చేస్తాడు. అర్జెంట్ గా ఓ విషయం చెప్పాలి. అది మార్నింగ్ చెప్తా. రేపు సినిమాకు టికెట్లు తీస్తానని విశ్వ అంటాడు. చెప్పు తెగుతుందని తెగ తిట్టేస్తుంది అమూల్య. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.