Illu Illalu Pillalu Serial: సీరియల్ లో ఎమోషన్స్ తో పాటు ట్విస్టులు ఉంటేనే మజా. ఇప్పుడు స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఇలాంటి కిక్కే ఇస్తుంది. అందుకే తెలుగు ఆడియన్స్ ఈ సీరియల్ ను ఆదరిస్తున్నారు. ఎప్పటికప్పుడూ కొత్త ట్విస్టులతో సీరియల్ అదరగొడుతోంది.
అంజలి ఎంట్రీ

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో అంజలి ఎంట్రీతో కథ మరింత ఊపందకుంది. చందు మాజీ ప్రేయసి అంజలి రావడంతో స్టోరీలో ట్విస్ట్ వేరే లెవల్ కు చేరుకుంది. గతంలో తన తండ్రికి ప్రేమ విషయం చెప్పలేక అంజలిని చందు దూరం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు బల్లక్కాయ్ విషయంలో రామరాజును చందు నిందిస్తున్నాడు.
కల కాదని
చందు, అంజలి మళ్లీ కలుస్తారా? అనే క్యూరియాసిటీ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఫ్యాన్స్ కు కలుగుతోంది. అందుకు తగ్గట్లే మేకర్స్ రీసెంట్ గా ఇద్దరినీ కలిపి చూపించారు. కానీ ఫుల్ గా తాగేసిన చందు ఏమో అంజలి తన కలలోకి వచ్చిందని, అదంతా భ్రమ అని అనుకుంటున్నాడు. అంజలి కూడా ఈ విషయాన్ని చందుకు చెప్పాలనుకోవడం లేదు.
చందుకు నిజం తెలుస్తుందా?
అయితే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో అంజలి రీ ఎంట్రీకి కారణం చందును కలవడమే. అంజలిని చందు చూడాలనే మేకర్స్ ఈ కొత్త ట్విస్ట్ ప్లాన్ చేశారు. ఇప్పటికే వల్లికి విడాకులు ఇస్తానని చందు తెగేసి చెప్తున్నాడు. ఎవరు నచ్చజెప్పాలని చూసినా చందు వినడం లేదు. ఈ నేపథ్యంలో అంజలిని చందు కలిస్తే స్టోరీ ఇంకా ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఉత్కంఠ కలిగిస్తుంది.
ఈ నేపథ్యంలో అంజలిని చందు కలుస్తాడా? తన పాత ప్రేమను తిరిగి గుర్తు చేసుకుంటాడా? చందును అంజలి యాక్సెప్ట్ చేస్తుందా? మధ్యలో బల్లక్కాయ్ బలైపోతుందా? అనే ప్రశ్నలు సీరియల్ ఆడియన్స్ కు వస్తున్నాయి.
బల్లక్కాయ్ లో మార్పు
{{/usCountry}}ఈ నేపథ్యంలో అంజలిని చందు కలుస్తాడా? తన పాత ప్రేమను తిరిగి గుర్తు చేసుకుంటాడా? చందును అంజలి యాక్సెప్ట్ చేస్తుందా? మధ్యలో బల్లక్కాయ్ బలైపోతుందా? అనే ప్రశ్నలు సీరియల్ ఆడియన్స్ కు వస్తున్నాయి.
బల్లక్కాయ్ లో మార్పు
{{/usCountry}}మరోవైపు తన అత్తారింట్లో ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసిన బల్లక్కాయ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లే కనిపిస్తోంది. చందు ఛీ కొట్టినా, రామరాజు ఫ్యామిలీ దూరం పెట్టినా కూడా క్షమించాలని వల్లి రిక్వెస్ట్ చేస్తూనే ఉంది. ఆ రోజు కోసం ఎంతో ఓపికతో వెయిట్ చేస్తోంది. దీంతో వల్లి నిజంగానే మారిపోయిందనే ఫీల్ కలుగుతోంది. మరి మారిన వల్లి.. చందు, అంజలి ప్రేమ గురించి తెలుసుకుంటే ఎలా రియాక్టవుతుందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.
నెక్స్ట్ ఏంటీ?
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ధీరజ్ ట్రావెల్ ఏజెన్సీ స్టార్ట్ చేశాడు. దాన్ని అడ్డుకోవాలనుకున్న భద్రావతి రౌడీలను రామరాజు ఫ్యామిలీ చితక్కొట్టింది. మరి ధీరజ్ కు షాకిచ్చేలా భద్రావతి ఇంకేదైనా కొత్త కుట్ర పన్నుతుందా? వల్లి విడాకుల విషయంలో చందు మనసు ఏమైనా మారుతుందా? అనేది రాబోయే ఎపిసోడ్లలో చూడాలి.