Illu Illalu Pillalu Serial: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కు తెలుగు ఆడియన్స్ నుంచి మంచి క్రేజ్ దక్కుతోంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ లో ట్విస్టులు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. తాజాగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ స్టోరీలో భద్రావతికి బల్లక్కాయ్ షాక్ ఇవ్వబోతున్నట్లు కనిపిస్తోంది.
భద్రావతి కుట్ర

శ్రీవల్లి బండారం బయటపడటంతో ఆమెను రామరాజు ఫ్యామిలీ గెంటేసింది. భర్త చందు అయితే బల్లక్కాయ్ పై కోపంతో రగిలిపోతున్నాడు. ఈ క్రమంలో పుట్టింటికి వెళ్లిన బల్లక్కాయ్ రివేంజ్ కోసం ఎదురు చూసింది. అదే సమయంలో దొరికిందే ఛాన్స్ అని భద్రావతి రంగంలోకి దిగింది. బల్లక్కాయ్ తో కలిసి కుట్ర చేసింది.
రామరాజుపై పోలీస్ కేసు
తన శత్రువు రామరాజుపై పోలీస్ కేసు పెట్టించాలని భద్రావతి అనుకుంది. అందుకే బల్లక్కాయ్ ను మాయ మాటలతో తన కంట్రోల్ లోకి తీసుకుంది. మరోవైపు కన్నింగ్ శ్రీవల్లి కూడా ముందూ వెనుకా ఆలోచించకుండా భద్రావతి మాటలు విని రామరాజు, వేదవతి, చందుపై గృహ హింస కేసు పెట్టింది. తన భర్తతో పాటు అత్తామామలను సెల్ లోకి పంపించింది.
రంగంలోకి నర్మద
రామరాజు కుటుంబానికి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసే నర్మద మరోసారి రంగంలోకి దిగింది. కేసు వాపసు తీసుకోమ్మని బల్లక్కాయ్ ను బెదిరించింది. అయినా శ్రీవల్లి వినలేదు. దీంతో నర్మద తన లాజిక్ తో బల్లక్కాయ్ ను కొట్టింది. కేసు ఇలాగే కొనసాగితే ఈ జన్మలో శ్రీవల్లి తన అత్తారింట్లో అడుగుపెట్టలేదని నర్మద అర్థమయ్యేలా చెప్పింది.
భద్రావతికి షాక్
నర్మద మాటలతో బల్లక్కాయ్ కు అసలు విషయం బోధపడినట్లే కనిపించింది. అందుకే తన భర్త, అత్తామామలపై పెట్టిన కేసును వెనక్కి తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అదే గనుకు నిజమైతే భద్రావతికి దిమ్మతిరిగే షాక్ తగలడం ఖాయం. ఎందుకు బల్లక్కాయ్ ను రెచ్చగొట్టి భద్రావతే పోలీసు కేసు పెట్టించింది.
{{/usCountry}}నర్మద మాటలతో బల్లక్కాయ్ కు అసలు విషయం బోధపడినట్లే కనిపించింది. అందుకే తన భర్త, అత్తామామలపై పెట్టిన కేసును వెనక్కి తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అదే గనుకు నిజమైతే భద్రావతికి దిమ్మతిరిగే షాక్ తగలడం ఖాయం. ఎందుకు బల్లక్కాయ్ ను రెచ్చగొట్టి భద్రావతే పోలీసు కేసు పెట్టించింది.
{{/usCountry}}రామరాజుకు ఈ కేసులో బెయిల్ రావడం కష్టమని, అతను జైలుకు వెళ్లడం ఖాయమని భద్రావతి చంకలు గుద్దుకుంటుంది. ఈ టైమ్ లో బల్లక్కాయ్ కేసు వాపసు తీసుకుంటే భద్రావతికి మామూలు షాక్ తగలదని చెప్పొచ్చు.
నెక్స్ట్ ఏంటీ?
రామరాజు, వేదవతి, చందుపై పెట్టిన కేసును వాపస్ తీసుకునేందుకు సిద్ధమైనట్లు వల్లి కనిపించింది. మరి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నెక్స్ట్ ఏం జరగబోతుంది? కేసు వాపసు తీసుకున్న తర్వాత వల్లిని క్షమించి రామరాజు ఇంటికి తీసుకెళ్తారా? లేకపోతే కేసు పెట్టినందుకు ఇంకా కఠినంగా వ్యవహరిస్తారా? అన్నది రాబోయే ఎపిసోడ్లలో చూడాలి.