Illu Illalu Pillalu April 21 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో చందును వశీకరణ తాయెత్తుతో లొంగదీసుకోవాలని భాగ్యం, ఇడ్లీ బాబాయ్, శ్రీవల్లి ప్లాన్ వేస్తారు. మరోవైపు భార్యపై సాగర్ సీరియస్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 21 ఎపిసోడ్ లో చూసేయండి.
నర్మద వర్సెస్ సాగర్

భోజనం చేద్దామని నర్మద పిలిస్తే సాగర్ వద్దంటాడు. సేటు మీద కోపం తనమీద ఎందుకు చూపిస్తున్నావని భర్తను నర్మద అడుగుతుంది. అప్పు ఇచ్చిన వ్యక్తిని రిక్వెస్ట్ చేసి, టైమ్ ఇవ్వమని అడగాలి కానీ డబ్బులు మోహం మీద కొడతావా? అని నర్మద అడుగుతుంది. ఇంట్రెస్ట్ కట్టడం ఒక్క రోజు లేట్ అయితే మీ మామయ్యకు చెప్పి పరువు తీస్తాడా? అని సాగర్ అంటాడు.
దొంగను అని
నెల రోజుల్లో రూ.20 లక్షలు కట్టమంటే ఎలా? అని నర్మద అడుగుతుంది. మా ఆఫీస్ నుంచి లోన్ ట్రై చేశా కానీ, నువ్వు డబ్బులిచ్చి జాబ్ కొనుక్కున్న విషయం అందరికీ తెలిసిపోయింది. నా లోన్ రిజెక్ట్ అయిందని నర్మద చెప్తుంది. అందరికి నేను దొంగను అయిపోయానని సాగర్ సీరియస్ అవుతాడు.
నర్మద ముద్దు
డబ్బు సంగతి చూసుకుంటానని చెప్పిన నర్మద.. సాగర్ చేతిని పట్టుకుంటుంది. జ్వరం ఉండటంతో ట్యాబ్లెట్ వేసుకోమని అడిగితే సాగర్ వేసుకోనంటాడు. సాగర్ నుదుటిపై ముద్దు పెట్టిన నర్మద నోట్లో ట్యాబ్లెట్ వేస్తుంది. నా భర్తకు కష్టం వస్తే చూస్తూ ఊరుకుంటానా అని నర్మద చెప్పేసరికి సాగర్ ఎమోషనల్ అవుతాడు.
రామరాజు ఇంటికి
చందు వశీకరణం కోసం బాబా ఇచ్చిన తాయెత్తును కట్టేందుకు రాత్రి దొంగల్లా భాగ్యం, ఆనంద్ రావు, శ్రీవల్లి కలిసి రామరాజు ఇంటికి వస్తారు. అయితే చందు రైస్ మిల్ లోనే పడుకుంటాడు. ఇంట్లో చందు బెడ్ మీద తిరుపతి పడుకుంటాడు. బయట తాయెత్తు పట్టుకుని ఇడ్లీ బాబాయ్ బిల్డప్ ఇస్తాడు. ఇది కట్టడానికి ఆరితేరిన గజదొంగ గంగులు నేనున్నాను కదా అని అంటాడు.
తిరుపతికి తాయెత్తు
{{/usCountry}}చందు వశీకరణం కోసం బాబా ఇచ్చిన తాయెత్తును కట్టేందుకు రాత్రి దొంగల్లా భాగ్యం, ఆనంద్ రావు, శ్రీవల్లి కలిసి రామరాజు ఇంటికి వస్తారు. అయితే చందు రైస్ మిల్ లోనే పడుకుంటాడు. ఇంట్లో చందు బెడ్ మీద తిరుపతి పడుకుంటాడు. బయట తాయెత్తు పట్టుకుని ఇడ్లీ బాబాయ్ బిల్డప్ ఇస్తాడు. ఇది కట్టడానికి ఆరితేరిన గజదొంగ గంగులు నేనున్నాను కదా అని అంటాడు.
తిరుపతికి తాయెత్తు
{{/usCountry}}తాయెత్తు తీసుకుని ఇడ్లీ బాబాయ్ గదిలోకి వెళ్తాడు. చీకట్లో ఏం కనిపించడం లేదని పాక్కుంటూ వెళ్తాడు. మంచం కోడును పట్టుకుని అల్లుడి కాలు అనుకుంటాడు. ఆ తర్వాత పైకి లేచి అల్లుడు అనుకుని తిరుపతి కాలుకు ఇడ్లీ బాబాయ్ తాయెత్తు కడతాడు. ఇడ్లీ బాబాయ్ బయటకు వెళ్లి సూపర్ సక్సెస్ అని పొంగిపోతాడు. ఇటు తిరుపతి ఒక్కసారిగా లేచి బయటకు వెళ్తాడు.
ఇడ్లీ బాబాయ్ కోసం
అల్లుడు గారు వచ్చేస్తున్నారని కూతురు, భార్యకు గొప్పగా చెప్తాడు ఇడ్లీ బాబాయ్. కానీ ఎక్కడ నా లకలక, ఎక్కడ నా వశీకరణ అనుకుంటూ తిరుపతి బయటకు వస్తాడు. అది చూసి వల్లి, భాగ్యం షాక్ అవుతారు. నన్ను వదిలి ఎక్కడికి వెళ్లిపోతావంటూ తిరుపతి వస్తాడు. తాయెత్తు వీడికి కట్టేశానని ఇడ్లీ అంటాడు. తిరుపతి పరుగెత్తుకుంటూ వచ్చి ఇడ్లీ బాబాయ్ ను హగ్ చేసుకుంటాడు.
దుప్పటి కప్పి
విడిపించుకున్న ఇడ్లీ బాబాయ్, భాగ్యం, వల్లి కలిసి రామరాజు ఇంట్లో దాక్కుంటారు. వీళ్లను ప్రేమ, నర్మద, ధీరజ్ చూస్తారు. వీళ్లను ఒక ఆటాడుకుందామని అనుకుంటారు. ముగ్గురిపై దుప్పటి కప్పి కుమ్మేస్తారు. తప్పించుకున్న భాగ్యం, ఇడ్లీ, వల్లి బయటకు పరుగెత్తుతారు.
ధీరజ్ ఫైర్
వశీకరణం అంటూ ఈ చిల్లర వేషాలు ఏంటి భాగ్యం అని నర్మద అడుగుతుంది. నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది, నీ కారణంగా కూతురి కాపురం కోల్పోయింది. ఇప్పుడు కూడా మోసపు దారిలోనే భర్త దగ్గరకు నీ కూతురిని పంపించాలని చూశావని ప్రేమ కూడా సీరియస్ అవుతుంది. నా బాధను అర్థం చేసుకోండడి చెల్లాయిలు అని శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తుంది. మా నాన్నను పిలుస్తాను, మర్యాదగా నడవండని ధీరజ్ వాళ్లకు పంపించేస్తాడు.
చందు బాధ
పొద్దున ఇంటికిి వచ్చిన చందు.. వల్లిని తలుచుకుంటూ బాధపడుతుంటాడు. అది చూసి నర్మద, ప్రేమ ఫీల్ అవుతారు. చందు బావతో మాట్లాడి ఆ బల్లిని ఇంటికి తీసుకురమ్మని చెప్దామని నర్మదతో ప్రేమ అంటుంది. పెద్దోడితో మాట్లాడేందుకు నా దగ్గర కాఫీ ఐడియా ఉందని ధీరజ్ ఏదో చెప్తాడు. నర్మద వెళ్లి కాఫీ తీసుకొచ్చి చందుకు ఇస్తుంది.
బావ కాఫీ ఎలా ఉందని నర్మద అడుగుతుంది. బాగుందని చందు అంటే, వల్లి అక్క అయితే కాఫీ ఇంకా బాగా పెడుతుందని ప్రేమ అంటుంది. ఆ మాట వినగానే ఆ దెయ్యం గురించి మాట్లాడొద్దని చెప్పాను కదా అని చందు అనడంతో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ముగుస్తుంది.