...
...
Next Story

Illu Illalu Pillalu April 9 Episode: చందును చంపబోయి కూతురి ప్రాణాల మీదకు.. కూలబడిపోయిన సేనాపతి.. ప్రేమ కాలుకు ఫ్రాక్చర్

Illu Illalu Pillalu April 9 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఏప్రిల్ 9 ఎపిసోడ్ లో ప్రేమను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. తనవల్లే ఇది జరిగిందని ధీరజ్ బాధతో కుమిలిపోతాడు. ప్రేమ యాక్సిడెంట్ విషయం తెలిసి సేనాపతి కూలబడిపోతాడు.

Published on: Apr 9, 2026, 07:56:20 IST
Advertisement

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమకు యాక్సిడెంట్ తో కథ మలుపు తిరిగింది. చందును చంపించడం కోసం సేనాపతి వేసిన కుట్రకు తన కూతురే బలి కావాల్సి వచ్చింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 9 ఎపిసోడ్ లో చూసేద్దాం.

హాస్పిటల్ లో ప్రేమ

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

చందు బావ వైపు లారీ దూసుకురావడం ప్రేమ చూస్తుంది. బావ అని పిలిచినా చందుకు వినిపించదు. వెంటనే ప్రేమ పరుగెత్తుకెళ్లి చందును పక్కకు లాగేస్తుంది. అప్పుడు లారీ ప్రేమను ఢీ కొడుతుంది. అది చూసి ధీరజ్ పరుగెత్తుకుంటూ వెళ్తాడు. ప్రేమను హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తారు.

ధీరజ్ ఎమోషనల్

ధీరజ్ బాధతో కుమిలిపోతుంటాడు. ప్రేమకు ఏం జరుగుతుందోననే కంగారుతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. చందును హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతాడు. ప్రేమ పట్ల తాను కఠినంగా వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుంటు ఇంకా బాధపడతాడు. రామరాజు ఫ్యామిలీ అందరూ హాస్పిటల్ కు వస్తారు.

ప్రేమకు యాక్సిడెంట్ కావడం ఏంటని రామరాజు అడుగుతాడు. తనను కాపాడబోయి ప్రేమ తన ప్రాణాల మీదకు తెచ్చుకుందని చందు జరిగిన విషయాన్ని చెప్తాడు. ప్రేమకు ఏమైనా అయితే నా వల్లే ఇలా జరిగిందనే బాధ లైఫ్ లాంగ్ వెంటాడుతుందని చందు బాధపడతాడు. ప్రేమకు ఏం కాదని ధీరజ్ కు అందరూ ధైర్యం చెప్తారు.

యాక్సిడెంట్ కారణం

కానీ ధీరజ్ పక్కకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అతణ్ని ఓదార్చాలని నర్మద వెళ్తుంది. కళ్ల ముందు చూస్తూ కూడా నా ప్రేమన కాపాడుకోలేకపోయిన వదిన అని ధీరజ్ ఏడ్చేస్తాడు. ప్రేమకు ఇలా జరగడానికి కారణం నేనే వదిన. కాలేజీ దగ్గర డ్రాప్ చేయమని అడిగింది. కానీ కోపంతో వెళ్లలేదు. అంతా నా వల్లే అని ధీరజ్ చెంపపై కొట్టుకుంటాడు. ప్రేమకు ఏమైనా అయితే తట్టుకోలేనంటాడు.

శ్రీవల్లి కోపం

డమ్మీ యాక్సిడెంట్ చేయాలని చెప్తే ఆ డ్రైవర్ ఎందుకు అంత ఫాస్ట్ గా వచ్చాడు. మనకు తెలియకుండా ఏందో జరిగిందని భాగ్యం డౌట్ పడుతుంది.

కూలబడ్డ సేనాపతి

ఆ లారీ డ్రైవర్ సేనాపతికి ఫోన్ చేస్తాడు. ఒక అమ్మాయిని గుద్దేశానని డ్రైవర్ చెప్పడంతో సేనాపతి సీరియస్ అవుతాడు. ప్రేమకు యాక్సిడెంట్ అయిందని తిరుపతి కాల్ చేసి చెప్పడంతో రేవతి, భద్రావతి, జానకి టెన్షన్ పడతారు. ఈ విషయం సేనాపతికి చెప్పడంతో అతని మైండ్ బ్లాక్ అయిపోతుంది. గుండె పట్టుకుని కింద కూలబడిపోతాడు.

కాలుకు ఫ్యాక్చర్

మరోవైపు హాస్పిటల్లో ప్రేమను చూసేందుకు రఘురాం ఫ్యామిలీ లోపలికి వెళ్తుంది. నాకు ఏం కాలేదు మామయ్య, ఏం టెన్షన్ పడకండని ప్రేమ అంటుంది. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా చిన్న చిన్న దెబ్బలతో బయటపడిందని, కాలుకు ఫ్రాక్చర్ అయిందని డాక్టర్ చెప్తుంది.

సేనాపతి క్షమాపణ

ప్రేమకు ఎలా ఉందోనని ప్రాణం పోతుందని రేవతి అంటుంది. హాస్పిటల్ కు వెళ్దామని బయటకు వస్తారు. అప్పుడే కార్లో ప్రేమను తీసుకుని వస్తారు. అది చూసి సేనాపతి, రేవతి వాళ్లు దగ్గరకు వస్తారు. ప్రేమకు ఎలా ఉందని అడుగుతారు. నాకేం కాలేదని నాన్నకు ప్రేమ చెప్తుంది.

నన్ను క్షమించమ్మా అని సేనాపతి అంటాడు. వాడెవడో యాక్సిడెంట్ చేస్తే మీరేందుకు క్షమాపణ అడుగుతాన్నారని ప్రేమ అనడంతో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe