Illu Illalu Pillalu August 10 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ప్రేమను గుడికి రప్పించడానికి విశ్వ డ్రామా స్టార్ట్ చేస్తాడు. ధీరజ్ నన్ను నానా మాటలు అన్నాడని విశ్వ చెప్తాడు. మీ చెల్లెలు కచ్చితంగా గుడికి రాదని ఎగతాళి చేశాడు. గుడిలో మీ ఆయన్ని చూడగానే ప్రేమను ఆపుకోలేక ధీరజ్ అని వెళ్లి హగ్ చేసుకుంటావంటానని ప్రేమను విశ్వ రెచ్చగొడతాడు.
విశ్వ ప్లాన్ సక్సెస్

ప్రేమ అని ధీరజ్ అనగానే ఐస్ క్రీమ్ లా నీ మనసు కరిగిపోతుందంటా అని విశ్వ తన ప్లాన్ ప్రకారం మాటలు చెప్తాడు. విశ్వ మాటలతో ప్రేమ రెచ్చిపోతుంది. నేను కూడా గుడికి వస్తున్నా అన్నయ్య అని ప్రేమ రెడీ అవుతుంది. ధీరజ్ ఎక్స్ ట్రాలు చేస్తున్నాడు. అవన్నీ పగటి కలలు అని తెలిసొచ్చేలా చేస్తానని ప్రేమ అంటుంది. తన ప్లాన్ సక్సెస్ అయినందుకు విశ్వ తెగ ఖుషీ అయిపోతాడు. ప్రేమను, ధీరజ్ ను కలిపేందుకు ఫస్ట్ స్టెప్ పడిందని అనుకుంటాడు.
రెచ్చగొట్టేలా సేనాపతి
రామరాజు, భద్రావతి కుటుంబాలు గుడి దగ్గర ఎదురుపడతాయి. ధీరజ్ ను చూసి ప్రేమ ముఖం తిప్పుకుంటుంది. విశ్వ ఏమో అమూల్య ముందు బిల్డప్ కొడతాడు. శ్రీవల్లి ఏమో ప్రేమకు ఎక్కడ నిజం తెలిసిపోతుందేమోనని తెగ టెన్షన్ పడుతుంది. గుడికి దేవుడి కోసం వచ్చారా? లేకపోతే దొంగ పెళ్లిళ్లు చేద్దామని వచ్చారా? అని సేనాపతి రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. తన కొడుకులను రామరాజు ఆపుతాడు.
ధీరజ్ చేతుల్లో ప్రేమ
విశ్వ కావాలనే ప్రేమ కాలుకు తన కాలు అడ్డం పెడతాడు. దీంతో ప్రేమ వెళ్లి ధీరజ్ చేతుల్లో పడుతుంది. ఆ సీన్ అదిరిపోతుంది. ప్రేమ అదేంటే, అలా పడిపోయావని భద్రావతి అడుగుతుంది. మొగుడికి దూరంగా ఉండలేకపోతుందేమో. చూసేసరికి ప్రేమతో పడిపోయిందని నర్మద అంటుంది. నేనే చేశానని విశ్వ అనేసరికి అమూల్య స్మైల్ ఇస్తుంది.
వల్లి టెన్షన్
{{/usCountry}}విశ్వ కావాలనే ప్రేమ కాలుకు తన కాలు అడ్డం పెడతాడు. దీంతో ప్రేమ వెళ్లి ధీరజ్ చేతుల్లో పడుతుంది. ఆ సీన్ అదిరిపోతుంది. ప్రేమ అదేంటే, అలా పడిపోయావని భద్రావతి అడుగుతుంది. మొగుడికి దూరంగా ఉండలేకపోతుందేమో. చూసేసరికి ప్రేమతో పడిపోయిందని నర్మద అంటుంది. నేనే చేశానని విశ్వ అనేసరికి అమూల్య స్మైల్ ఇస్తుంది.
వల్లి టెన్షన్
{{/usCountry}}గుడిలో భద్రావతిని శ్రీవల్లి పక్కకు తీసుకెళ్తుంది. కొంపలు కూలిపోయేలా ఉన్నాయి. ఏదో ఒక మాయ చేసి ధీరజ్, ప్రేమను ఒకటి చేసేందుకు వీళ్లు గుడికి వచ్చారు. మా అత్తయ్య అమాయకురాలు కాదు. ధీరజ్, ప్రేమను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు. ప్రేమ వాళ్ల మాటలు నమ్మిందంటే, ఎప్పటికీ మిమ్మల్ని నమ్మదు. మీ ఇంటికి రాదని భద్రావతిని బల్లక్కాయ్ రెచ్చగొడుతుంది.
ఇప్పుడు సహనంగా ఉండాలి. వాళ్ల ప్లాన్ అమలు కాకుండా చేయాలి. ప్రేమ మనసు మార్చడానికి ప్రయత్నిస్తారు. ప్రేమను ఒంటరిగా కలిసి, మాట్లాడాలని చూస్తారు. మనం ప్రేమను, వాళ్లను కలవనివ్వకుండా చేస్తే చాలు. అప్పుడు వాళ్ల ప్లాన్ ఫెయిల్ అవుతుందని బల్లక్కాయ్ చెప్పడంతో భద్రావతి సరేనంటుంది.
ప్రేమ దగ్గరకు నర్మద
అందరూ దేవుడికి మొక్కుకుంటారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇక ప్రేమతో మాట్లాడటం ఎలా అని నర్మద, వేదవతి అవకాశం కోసం చూస్తారు. భద్రావతి, సేనాపతి పక్కకు వెళ్లడంతో ప్రేమతో మాట్లాడమని నర్మదకు వేదవతి చెప్తుంది. ప్రేమ పక్కకు నర్మద వెళ్లగానే.. భద్రావతి వచ్చి విడగొడుతుంది. దేవుడు అటు వైపు కనిపించడం లేదు, అందుకే ఇటు వైపు వచ్చానని నర్మద అంటుంది.
భర్త పేరు చెప్పిన ధీరజ్
నువ్వు అటు వైపు కదా మరి ఇటు వైపు ఎందుకు వచ్చావని భద్రావతి అడుగుతుంది. దేవుడిని ఏమైనా ఇంటి నుంచి తెచ్చారా? అని నర్మద కౌంటర్ వేస్తుంది. అక్క ఇక్కడే ఉండని అని అత్తకు ప్రేమ చెప్తుంది. పూజారి వచ్చి భర్త పేరు చెప్పమంటే ప్రేమ ఆలోచిస్తుంది. నా ఒక్క దాని పేరు మీదే అర్చన చేయించండని అంటుంది.
అర్చన కోసం భర్త పేరు చెప్పకపోవడం అశుభం అని పూజారి చెప్పినా ప్రేమ వినదు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.