...
...
Next Story

Illu Illalu Pillalu August 11 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. మూర్ఖంగా ప్రేమ- ధీరజ్ గుండె బద్దలు-రామరాజుకు దారుణ అవమానం

Illu Illalu Pillalu August 11 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్టు 11 ఎపిసోడ్ లో కథ రసవత్తరంగా సాగుతుంది. భర్త పేరు చెప్పకుండా, కుంకుమ పెట్టించుకోకుండా ప్రేమ మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. రామరాజును సేనాపతి, భద్రావతి దారుణంగా అవమానిస్తారు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

Published on: Aug 11, 2026, 07:56:19 IST
Advertisement

Illu Illalu Pillalu August 11 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ రోజు ఎపిసోడ్ లో.. భర్తకు అశుభం అని పూజారి చెప్పినా కూడా అర్చన కోసం ధీరజ్ పేరును ప్రేమ చెప్పదు. దీంతో ధీరజ్ గుండె ముక్కలువుతోంది. రామరాజు ఫ్యామిలీ అంతా షాక్ లో మునిగిపోతారు. అప్పుడే భద్రావతి డ్రామా స్టార్ట్ చేస్తుంది. భర్త పేరు చెప్పకపోవడం మంచిది కాదని భద్రావతి అంటుంది.

భర్త పేరు చెప్పని ప్రేమ

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

భర్తకు మంచిది కాదని చెప్పినా కూడా ఎందుకు మొండిగా ఉంటున్నావని ప్రేమను వేదవతి అడుగుతుంది. నేను పెళ్లాన్ని కాదని మీ అబ్బాయి చెప్పాడు కదా. మరి అతనే కాదన్నప్పుడు నేనెందుకు చెప్పాలని ప్రేమ అంటుంది. పూజారి అడిగితే ఇంటి పేరు, గోత్ర నామాలు లేవని రామరాజు చెప్తాడు. నేను ఒక అనాథగా జీవితాన్ని మొదలుపెట్టానంటాడు.

బల్లక్కాయ్ సంతోషం

మధ్యలో భద్రావతి కలగజేసుకొని రామరాజు కుటుంబాన్ని బాధపెట్టేలా మాట్లాడుతుంది. మంచిగా మాట్లాడుతూనే గుండె నొప్పించేలా మాటలు అంటుంది. ప్రేమతో నా గురించి ఎట్టా సెప్తారో చూస్తానని శ్రీవల్లి అనుకుంటుంది. గుడి బయటకు సుక్కును తీసుకెళ్లి తెగ సంతోషంగా ఫీల్ అవుతుంది బల్లక్కాయ్.

నర్మదను పంపించేస్తే

మనం అనుకున్న పని ఎలాంటి ఆటంకం లేకుండా జరిగితే ఆ ఫీలే వేరు సుకన్య అని గాల్లో తేలినట్లుందే అని శ్రీవల్లి పాట పాడుతుంది. అత్తయ్యోల్ల ప్లాన్ చెడగొట్టాను కదా. వాళ్లు ఇక్కడికి వచ్చింది ప్రేమ, ధీరజ్ ను కలిపేందుకే అనే భద్రావతికి చెప్పా. వాళ్లు ఎన్ని ప్లాన్ లు వేసినా ప్రేమ, ధీరజ్ ను కలపలేరు. మరో ప్లాన్ వేసి నర్మదను కూడా బయటకు పంపించేస్తే నా మాటే శాశనం అవుతుందని వల్లి సంబరపడిపోతుంది.

రామరాజును అవమానించేలా

ఏం బతుకురా మీది? నువ్వు మా చెల్లిని తీసుకెళ్లావు. నీ కొడుకు నా మేనకోడలిని చేసుకున్నాడు. నీకు తెలియకుండానే నీ పెళ్లాం నీ కొడుకుకు పెళ్లి చేసిందంటే కుటుంబంలో నీ విలువ ఏంటో తెలియట్లేదా? నిన్ను ఒంటరి వాడిని చేస్తా రామరాజు. నువ్వు, నీ కుటుంబం ఎలాంటి వాళ్లో తెలుసుకొని నా మేనకోడలు ఇంటికి తిరిగి వచ్చిందని రామరాజును బాధపెట్టేలా భద్రావతి మాట్లాడుతుంది.

వేదవతి అనుమానం

మరోవైపు ప్రేమతో ఎలా మాట్లాడాలని నర్మద, వేదవతి, అమూల్య, ధీరజ్ ఆలోచిస్తారు. నువ్వు ప్రేమతో మాట్లాడుతుంటే మా అక్క టక్కుమని ఎలా వచ్చిందే? ప్రేమతో మాట్లాడటం ఎలా? అని వేదవతి అడుగుతుంది. గుడి నుంచి వెళ్లిపోయే లోపు ఛాన్స్ దొరుకుతుందని ధీరజ్ చెప్తాడు. కొంపదీసి ప్రేమతో మాట్లాడదామనే విషయం మా అక్కకు తెలిసిపోయిందా అని వేదవతి అనుమానపడుతుంది.

అప్పుడే రామరాజు వచ్చి ఏం చేస్తున్నారని అడుగుతాడు. కుంకుమార్చన జరుగుతుంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? వెళ్దాం అని తీసుకెళ్తాడు.

వల్లి టెన్షన్

అమ్మవారికి పూజారి కుంకుమార్చన చేస్తుంటే ప్రేమతో మాట్లాడేందుకు ధీరజ్ ట్రై చేస్తాడు. అది చూసి వల్లి, భద్రావతి టెన్షన్ పడతారు. పూజ త్వరగా కంప్లీట్ చేయమని పూజారికి భద్రావతి చెప్తుంది. కానీ సేనాపతి అడ్డుకుంటాడు. ఎవరికో భయపడటం ఏంటని అంటాడు. భర్తలతో సింధూరం పెట్టించుకొని ఆశీర్వాదం తీసుకోమని పూజారి చెప్తాడు.

మూర్ఖంగా ప్రేమ

ప్రేమ మాత్రం మొండిగానే ఉంటుంది. పూజారి ఎంత చెప్పినా ప్రేమ వినదు. ధీరజ్ తో కుంకుమ బొట్టు పెట్టించుకునేందుకు ఒప్పుకోదు. భర్త ఆరోగ్యానికి, అయుష్షుకు మంచిదని చెప్తున్నా ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావని ప్రేమను వేదవతి అడుగుతుంది. నేను భార్యనే కాదని చెప్పినప్పుడు ఏ హక్కుతో బొట్టు పెట్టించుకోవాలని ప్రేమ తిరిగి ప్రశ్నిస్తుంది. అక్కడి నుంచి ప్రేమ, ఆ తర్వాత ధీరజ్ వెళ్లిపోతారు.

ఇది లవ్వే కదా

మాట్లాడాలని విశ్వకు అమూల్య సైగ చేస్తుంది. విశ్వ సిగ్గుతో మెలికలు తిరుగుతాడు. ఇన్ని రోజులూ నేను నీ వెంట పడ్డా పట్టించుకోలేదు. ఇప్పుడు సైగలు చేస్తున్నావంటే అది లవ్వే కదా అని విశ్వ అంటాడు. మాటిమాటికి ప్రేమ అనకు, చిరాగ్గా ఉందని అమూల్య కోప్పడుతుంది. ప్రేమ వదిన నాకు ఒంటరిగా దొరికేలా చేయమని విశ్వకు అమూల్య చెప్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe