...
...
Next Story

Illu Illalu Pillalu August 12 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. హైడ్రామా- చిరిగిన ప్రేమ జాకెట్- ధీర‌జ్‌ను కొట్టిన రామరాజు

Illu Illalu Pillalu August 12 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్టు 12 ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగుతుంది. ధీరజ్ తలకు గాయమైనా ప్రేమ అతని దగ్గరకు వెళ్లదు. ప్రేమకు చైన్ ఇవ్వాలని ధీరజ్ చేయి పట్టుకోబోతే జాకెట్ చిరుగుతుంది. దీంతో గుడిలో హైడ్రామా జరుగుతుంది. పూర్తి ఎపిసోడ్ వివరాలు చూసేయండి.

Published on: Aug 12, 2026, 08:02:24 IST
Advertisement

Illu Illalu Pillalu August 12 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ప్రేమ వదినను నాకు ఒంటరిగా దొరికేలా చేయ్. అమ్మమ్మ బర్త్ డేను అడ్డుపెట్టుకొని మీరంతా ఆస్కార్ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేసి కళ్యాణ్ విషయం అన్నయ్యతో చెప్పించేలా డ్రామా చేశారని విశ్వతో అమూల్య అంటుంది.

అన్నయ్య, వదినను కలిపేలా

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

బర్త్ డే రోజు ఎలా అయితే అన్నయ్య, వదినను విడదీశారో.. ఇప్పుడు గుడిలో బండారం బయటపెట్టి అన్నయ్య, వదినను కలిపి ఇంటికి తీసుకెళ్తామని విశ్వతో అమూల్య అంటుంది.

కుమిలిపోతున్న ధీరజ్

మరోవైపు ప్రేమ తన పట్ల కఠినంగా వ్యవహరించడంతో ధీరజ్ కుమిలిపోతూ బయటకు నడుచుకుంటూ వెళ్తాడు. నేను నిన్ను అంతలా ప్రేమించానే, మరి ఒక్క రోజులోనే ఆ ప్రేమంతా ఇంత ద్వేషంగా మారిపోయింది ప్రేమ. నేనే ప్రాణం అన్నావ్. ఒకేసారి నేను ఏమి కానివాడిని అయిపోయానా అని అనుకుంటాడు ధీరజ్.

ప్రేమ బాధ

పూజలో నీ పేరు చెప్పనందుకు, నీతో బొట్టు పెట్టించుకుని ఆశీర్వాదం తీసుకోనందుకు నాలో నేను ఎంత బాధను మోస్తున్నానో నాకు తెలుసు. నేను ఎవరితోనో లేచిపోయానని అందరి ముందు నవ్వులపాలు చేసిన బాధ నా మనసును చంపేస్తోందని ప్రేమ అనుకుంటుంది.

ధీరజ్ తలకు గాయం

అప్పుడే గుడిలో ఓ పెద్దాయనకు కళ్లు తిరగడం చూసి ధీరజ్ పరుగెత్తుకుంటూ వెళ్లి పడిపోకుండా పట్టుకుంటాడు. ఆ పెద్దాయనకు జాగ్రత్తలు చెప్పి పంపిస్తాడు. అప్పుడే అరిటాకు పందిరి ధీరజ్ పై కూలుతుంది. అది చూసి రామరాజు ఫ్యామిలీ కంగారు పడుతుంది. ధీరజ్ కు దెబ్బతగిలిందని ప్రేమ కూడా బాధపడుతుంది. కానీ దగ్గరకు వెళ్లకుండా ఆగిపోతుంది.

ధీరజ్ దగ్గరకు వెళ్లకుండా గుడి లోపలికి వెళ్లి భర్త పేరు చెప్పి అర్చన చేయిస్తుంది ప్రేమ. ధీరజ్ పేరు చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశా. వాడికేం కాకూడదు అని ఆ అమ్మవారికి ప్రేమ మొక్కుకుంటుంది. బయటకొచ్చిన ప్రేమతో మాట్లాడేందుకు ధీరజ్ దగ్గరకు వెళ్తాడు. కానీ ప్రేమ పట్టించుకోకుంటే వెళ్తే ధీరజ్ చేయి పట్టుకుంటాడు.

పట్టించుకోని ప్రేమ

ప్రేమ ఐయామ్ సారీ. నా మాటలు నీకు ఎంత బాధ కలిగించాయో అర్థం చేసుకోగలను. కానీ నాకు ఎంత కోపం వస్తే అలా మాట్లాడానో అర్థం చేసుకో అని ధీరజ్ చెప్తాడు. నువ్వు ఆ మాట అనకుండా ఉంటే నువ్వు ఏం చెప్పినా వినేదాన్ని అని ప్రేమ అంటుంది. అప్పుడే వచ్చిన నర్మద, వేదవతి కూడా మేం చెప్పేది వినమని ప్రేమను రిక్వెస్ట్ చేస్తారు.

చిరిగిన జాకెట్

మా అమ్మ పుట్టిన రోజు వంక పెట్టుకొని అని వేదవతి చెప్తుంటే ప్రేమ వినదు. ఆ గొడవ గుర్తు చేయకమని ప్రేమ ఏడుస్తుంది. నువ్వు బాధపడకు, అర్థం చేసుకునే రోజు కోసం ఎదురు చూస్తుంటానని ధీరజ్ అంటాడు. నాన్న తెచ్చిన చైన్ ఇవ్వబోతుంటే ప్రేమ వద్దని వెళ్తుంది. ధీరజ్ చేయి పట్టేసరికి ప్రేమ జాకెట్ చిరుగుతుంది. ధీరజ్ ను రామరాజు లాగిపెట్టి కొడతాడు.

బల్లక్కాయ్ సైకో ఆనందం

ఎక్కడున్నామో, ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా నీకు అని ధీరజ్ పై రామరాజు సీరియస్ అవుతాడు. ఈ దెబ్బతో ధీరజ్, ప్రేమ శాశ్వతంగా విడిపోయినట్లేనని బల్లక్కాయ్ సైకో ఆనందం పొందుతుంది. గుడిలో మాట్లాడటం ఇష్టం లేదంటే వదిలేయాలి. మొన్న నీ మాటలతో బాధపెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేశావ్. ఇప్పుడేమో ఇలా. ఒక భర్తలా, కనీసం ఒక మనిషిలా ప్రవర్తిస్తున్నావా అని ధీరజ్ ను రామరాజు తిడతాడు.

భద్రావతి మొసలి కన్నీరు

దొరికిందే ఛాన్స్ అని మొసలి కన్నీరు కారుస్తూ భద్రావతి మాటలతో ఇంకా ప్రేమను బాధపడేలా చేస్తుంది. మొన్న ఎవరితోనే లేచిపోయిందని అన్నాడు. ఇప్పుడు జాకెట్ చించేశాడు. మీరు దాన్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని భద్రావతి అంటుంది. దీంతో ధీరజ్ కు చిర్రెత్తుకొస్తోంది. ఇంకా ఆపుతావా? తను బాధలో ఉంటే ఓదార్చా. భయంతో ఉంటే ధైర్యం చెప్పా. నీకు నేనున్నానని భరోసా ఇచ్చా. అందరికంటే ఎక్కువ ప్రేమించానని ధీరజ్ చెప్తాడు.

ధీరజ్ రిక్వెస్ట్

నా ప్రాణంగా ప్రేమించిన భార్యను ఎందుకు బాధపెడతా? తనకు సర్దిచెప్పి నాతో పాటు తీసుకెళ్లడానికి వచ్చా. దయచేసి ఎవరూ మధ్యలోకి రాకండి. ప్రేమ నీకు బాధ కలిగినందుకు వందసార్లు క్షమాపణ చెప్తా. ద్వేషంతో కాకుండా ఇంతకుముందులా కలిసి ఉందామని ధీరజ్ రిక్వెస్ట్ చేస్తాడు. భద్రావతి ఏమో మంచిదానిలా నటిస్తూ భర్త, అత్తారిల్లు కావాలంటే వెళ్లిపో అని ప్రేమతో అంటుంది.

వీడు నాకు వద్దంటూ

ప్రేమ నీకు చాలా విషయాలు చెప్పాలి. నువ్వు కొందరి గురించి తెలుసుకోవాలి. ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం పదా అని వేదవతి అంటుంది. మాట మాట పెరిగి గొడవ జరిగింది. దూరం పెంచుకుంటూ పోతే మనసుల మధ్య కూడా దూరం పెరుగుతుంది. మీరు అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని రామరాజు కూడా అంటాడు.

మీ అందరి మీద నాకు ఎలాంటి కోపం లేదు. కానీ వీడు నాకు వద్దని ప్రేమ తెగేసి చెప్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe