Illu Illalu Pillalu August 25 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. లంచంతో న‌ర్మ‌ద‌కు దొరికిన సాగ‌ర్‌-ముగ్ధ‌తో ధీర‌జ్‌ షికారు

Illu Illalu Pillalu August 25 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్టు 25 ఎపిసోడ్ లో అక్క వేదవతికి సుక్కుతో తిరుపతి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాడు. మరోవైపు ముగ్ధతో ధీరజ్ ను చూసి ప్రేమ ఫైర్ అవుతుంది. లంచం తీసుకుంటూ నర్మదకు దొరికిన సాగర్ పచ్చి అబద్ధం చెప్తాడు.

Published on: Aug 25, 2026, 07:52:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu August 25 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. సుకన్యను బైక్ పై తీసుకెళ్తూ ‘మేఘాలలో తేలిపొమ్మన్నది’ అంటూ హుషారుగా సాంగ్ పాడతాడు తిరుపతి. మనం ఇలా బైక్ పై వెళ్లడం మీ వాళ్లు చూస్తే నీ తొక్క తీస్తారని సుక్కు అంటుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

వేదవతిని చూసి

అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని, భయపెట్టి మన ప్రేమను ఎవరూ ఆపలేరని తిరుపతి అరుస్తాడు. బైక్ పై స్టంట్స్ చేస్తూ వెళ్తాడు. ఎదురుగా చీపురు కట్టలు పట్టుకుని నిలబడ్డ అక్క వేదవతిని చూసి భయపడి బైక్ కిందపడేస్తాడు. సుక్కును లేపి దెబ్బలు తగిలాయా? అని అడుగుతాడు తిరుపతి.

సుక్కుకు వార్నింగ్

నా తమ్ముడినే గుప్పిట్లో పెట్టుకుంటావా? అని సుక్కును చీపురుతో బాదేస్తుంది వేదవతి. సుక్కుకు 104 జ్వరం అంటా. హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు ఎవరు లేకపోతే నేనే తీసుకెళ్తున్నా అని తిరుపతి అబద్ధం చెప్తాడు. నువ్వు పెద్ద కథ నడుపుతున్నావని తిరుపతిని కొడుతుంది వేదవతి. ఇంకోసారి నా తమ్ముడితో కనిపించావంటే కాళ్లు విరగ్గొడతానని సుక్కుకు వేదవతి వార్నింగ్ ఇస్తుంది.

ఆలోచనలో ప్రేమ

మరోవైపు అకాడమీ నుంచి వస్తూ నర్మద, విశ్వ మాటలను ప్రేమ గుర్తు చేసుకుంటుంది. అప్పుడే ఇద్దరు లవర్స్ గొడవ పడటం ప్రేమ చూస్తుంది. వాళ్లు సారీ చెప్పుకొని కాంప్రమైజ్ అవుతారు. దీంతో ధీరజ్ ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానా అని ప్రేమ ఆలోచనలో పడుతుంది.

ముగ్ధతో ధీరజ్

వెంటనే ధీరజ్ కు ప్రేమ కాల్ చేస్తుంది. కానీ ముగ్ధతో స్కూటీపై వెళ్తూ ధీరజ్ పంచ్ లు వేస్తాడు. వాళ్లను చూసి ప్రేమ షాక్ అవుతుంది. వాళ్లనే లిఫ్ట్ అడుగుతుంది. స్కూటీ ఆపిన ముగ్ధ.. సారీ ట్రిపుల్ రైడ్ నాట్ అలోవ్డ్ అని చెప్తుంది. ప్రేమకు చిర్రెత్తుకొస్తుంది. ధీరజ్, ముగ్ధపై ఫైర్ అవుతుంది ప్రేమ. నేను ఇష్టం లేకపోయినా తన బండి ఎక్కానని ధీరజ్ చెప్తాడు.

అమాయకంగా ముఖం పెడితే చంపేస్తా. అయిష్టంగా బండి ఎక్కితే అమ్మాయిలాగా రెండు కాళ్లు సైడ్ పెట్టుకుని కూర్చుంటావ్. అంతే కానీ ఇలా అటో కాలు, ఇటో కాలు వేసుకొని కూర్చోవు అని మండిపడుతుంది ప్రేమ. నీ ఫ్లర్టింగ్ కు, నీ కుళ్లు కామెడీకి ఇది నీకు పడిపోయింది. అందుకే కారు తోలడం మానేసి, దీని బండి ఎక్కి చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని ప్రేమ అంటుంది.

ప్రేమ అపార్థం

అపార్థం చేసుకుంటూనే ఉంటావా? నేను కారు సర్వీసింగ్ కు ఇచ్చా. లేట్ అవుతుందని చెప్పారు. తను డ్రాప్ చేస్తానంటే బండి ఎక్కా. నమ్మితే నమ్ము లేదంటే లేదు. ఇదే నిజమని ధీరజ్ చెప్తాడు. నువ్వు ఇంటికి రావాలనుకుంటే బైక్ బుక్ చేస్కుంటావని ప్రేమ అంటుంది. బైక్ బుక్ చేసుకునేముందు ఆమె వచ్చిందని ధీరజ్ చెప్తాడు. వీడిని బండి ఎక్కించుకునేందుకు ఎంత ధైర్యం అని ముగ్ధకు వార్నింగ్ ఇస్తుంది ప్రేమ.

ఇప్పుడు మీ మధ్యలో ఏం లేదని ధీరజ్ చెప్పాడు. ఇప్పుడు ధీరజ్ నా బండి ఎక్కితే నీకెందుకు? అని ప్రేమతో ముగ్ధ అంటుంది. అదేదో కోపంలో చెప్పానని ధీరజ్ చెప్పినా ప్రేమ వినిపించుకోదు. నేను మెట్టు దిగి వచ్చా. కానీ నువ్వు మాత్రం దీనితో కులకడానికి దూరం పెడుతున్నావని ప్రేమ అంటుంది. ప్రేమ ఒకవైపు, ధీరజ్ మరోవైపు వెళ్లిపోతారు.

సాగర్ లంచావతారం

మరోవైపు ఆఫీస్ లో లంచానికి అలవాటుపడ్డ సాగర్ ఇంకా ఫైల్స్ తీసుకురమ్మని ఆఫీస్ బాయ్ కు చెప్తాడు. పెద్ద పెద్ద ఫైల్స్ తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడే సాగర్ ఆఫీస్ కు నర్మద వస్తుంది. అది చూసిన సాగర్ ఫ్రెండ్ వెంటనే సాగర్ ను కాపాడాలని అనుకుంటాడు. సాగర్ డబ్బు పట్టుకుంటాడు.

అప్పుడే సాగర్ ఫ్రెండ్ వచ్చి ఫైల్ పక్కనపెట్టమంటాడు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని సాగర్ చెప్తూ నర్మదను చూసి షాక్ అవుతాడు. ఆ డబ్బులు ఏంటీ? లంచం తీసుకున్నావా? నువ్వు మంచోడివి అనుకున్నా. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని చంపేశావ్. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుందని నర్మద ఫైర్ అవుతుంది.

నర్మదకు పచ్చి అబద్ధం

నీ గోల నీదే కానీ నేను చెప్పింది పట్టించుకోవా? నేను లంచం తీసుకోవడం నువ్వు చూశావా? నా దగ్గర డబ్బు ఉంటే వేరే దగ్గర సర్దుబాటు చేశానని అనుకోవచ్చు కదా. ఆఫీస్ మెయింటేనెన్స్ కోసం సర్దుబాటు చేసిన డబ్బులు ఇవి అని సాగర్ పచ్చి అబద్ధం చెప్తాడు. వాళ్ల ఫ్రెండ్ తోనూ అలాగే చెప్పిస్తాడు. అంతే కాకుండా నర్మద మీద ఒట్టు కూడా వేస్తాడు సాగర్.

నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించడం. సిన్సియర్ గా డ్యూటీ చేయడం తప్పా నాకు ఇంకేమీ తెలియదు అని ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తాడు సాగర్. ఆ మాటలు నమ్మిన నర్మద సాగర్ కు సారీ చెప్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More