Illu Illalu Pillalu August 27 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ధీరజ్, ప్రేమ గురించి నర్మద ఆలోచిస్తుంటుంది. ధీరజ్, ప్రేమ కాపురాన్ని కలపాలనిపించడం లేదా? వాళ్లను కలిపే ప్రయత్నం చేయవా? అని సాగర్ ను నర్మద అడుగుతుంది. చేయను, గొడవలు కామన్. వాళ్లే సర్దిచెప్పుకుంటారని సాగర్ చెప్తాడు.
నర్మద సెటైర్లు

మా తమ్ముడు నువ్వు అనుకున్నంత అమాయకుడేమీ కాదు. ఇగో వల్ల దూరంగా ఉంటున్నారంతే. పరిస్థితి వచ్చినప్పుడు వాళ్లే కలుస్తారు. కాస్త నా గురించి కూడా ఆలోచించు అని నర్మదకు దగ్గరగా వెళ్తాడు సాగర్. దుక్కలా బాగానే ఉన్నావ్ కదా అని సెటైర్ వేస్తుంది నర్మద.
సాగర్ రొమాన్స్
నా ఫీలింగ్స్ ను అర్థం చేసుకో. అర్థమయ్యేలా చెప్పాలా అయితే ఓ గేమ్ ఆడుదాం. హ్యాండ్ రెజ్లింగ్ ఆడుదాం. నువ్వు ఓడిపోతే ముద్దు పెట్టాలి. నేను ఓడిపోతే నేను ముద్దు పెడతా అని సాగర్ అంటాడు. గేమ్ లేదు ఏం లేదని నర్మద వెళ్లిపోతుంటే దగ్గరకు లాక్కొని రొమాన్స్ చేస్తాడు సాగర్.
ఏఐకి ప్రేమ ప్రశ్నలు
మరోవైపు ధీరజ్ గురించి ప్రేమ ఆలోచిస్తుంటుంది. వాడు నిజంగానే ముగ్ధ మాయలో పడి నన్ను వదిలేస్తాడా? లేదా నన్ను భయపెట్టడానికి డ్రామా ఆడుతున్నాడా? వాడి ప్లాన్ ఎలా తెలుసుకోవాలని ప్రేమ అనుకుంటుంది. నెట్ లో వెతుకుదామని ఏఐని వాడుతుంది ప్రేమ.
నా భర్తకు నాకు గొడవ అయింది. మొదట్లో సారీ చెప్పాడు. కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. నా పరిస్థితి ఏంటీ అని ఏఐని అడుగుతుంది ప్రేమ. ఇండియన్ సైకాలజీ ప్రకారం 99 శాతం మొగుళ్లు భార్యల ముందు తగ్గే ఉంటారు. భార్యలు తగ్గితే వాళ్లు చెలరేగిపోతారని ఏఐ చెప్తుంది. నేను ఇప్పుడు తగ్గితే ఎలా ఉంటుందని ప్రేమ అడుగుతుంది. మెడలో చైన్ వేసిన కుక్కపిల్లలా ఆడిస్తారని ఏఐ షాకిస్తుంది. భర్తల మనుసులో ఉన్నది కనిపెట్టడం బ్రహ్మకే సాధ్యం కాదని చెప్తుంది.
అమూల్య ఫైర్
అమూల్య కాల్ కోసం విశ్వ ఎదురు చూస్తుంటాడు. ఆడపిల్ల మనసు అర్థం చేసుకొని సిగ్గులేకుండా అల్లుకుపోవాలని విశ్వనే కాల్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేసిన అమూల్య మాట్లాడకుండా ఉండిపోతుంది. మీ అన్నయ్య, మా చెల్లిని ఎలా కలిపానో చూశావా? మా చెల్లి మీ ఇంటికి వచ్చేసినట్లుందని గొప్పలు చెప్పుకుంటాడు విశ్వ.
{{/usCountry}}అమూల్య కాల్ కోసం విశ్వ ఎదురు చూస్తుంటాడు. ఆడపిల్ల మనసు అర్థం చేసుకొని సిగ్గులేకుండా అల్లుకుపోవాలని విశ్వనే కాల్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేసిన అమూల్య మాట్లాడకుండా ఉండిపోతుంది. మీ అన్నయ్య, మా చెల్లిని ఎలా కలిపానో చూశావా? మా చెల్లి మీ ఇంటికి వచ్చేసినట్లుందని గొప్పలు చెప్పుకుంటాడు విశ్వ.
{{/usCountry}}నేను సైలెంట్ గా ఉన్నది నిన్ను ఎలా తిట్టాలో తెలియక, అసలు ఏం చేశావ్? అన్నయ్య, వదిన మళ్లీ కొట్టుకున్నారు. రేయ్ బండోడా.. మర్యాదగా ఫోన్ పెట్టేయ్. లేదంటే ఇంటికి వచ్చి తల పగలకొడతానని అమూల్య ఫైర్ అవడంతో విశ్వ కాల్ కట్ చేస్తాడు. వాళ్లు ఎప్పుడు కలుస్తారో? అమూల్యతో నా ప్రేమ ప్రయాణం ఎప్పుడు సాగుతుందో అని విశ్వ అనుకుంటాడు.
ధీరజ్ కోసం
ప్రేమ బయటకు వచ్చి ధీరజ్ ఇంకా రాలేడని ఎదురు చూస్తుంటుంది. అప్పుడే కార్లో ధీరజ్ వస్తాడు. కొన్ని దెయ్యాలకు నిద్ర వచ్చి చావదేమో. అర్ధరాత్రి కూడా గబ్బిళాల్లా గేటు పట్టుకొని వేలాడుతుంటారని ధీరజ్ సెటైర్లు వేస్తాడు. మన్మథ రాజా ముద్దపప్పుతో షికారు చేసి ఎన్ని గంటలకు వస్తారో చూద్దామని ఉన్నానని ప్రేమ కౌంటర్ ఇస్తుంది.
సాంగ్ లతో వార్
నీ సంగతి చూస్తాననుకొని ముగ్ధ కాల్ చేసినట్లు ఫోన్ లో మాట్లాడతాడు ధీరజ్. ప్రేమను రెచ్చగొట్టేందుకు ఫ్లర్ట్ చేసేలా మాట్లాడతాడు. ముద్దులు కూడా ఇస్తాడు. ఈ సచ్చినోడు నన్ను వదిలేసేలా ఉన్నాడేమో అని ప్రేమ టెన్షన్ పడుతుంది. మగాళ్లు వట్టి మాయగాళ్లే అంటూ సాంగ్ ప్లే చేస్తుంది ప్రేమ. నమ్మకు నమ్మకు ఆడోళ్లలోని ప్రేమలను అంటూ ధీరజ్ సాంగ్ పెడతాడు.
ధీరజ్ కు హగ్
ఏంట్రా, ఏంటే అంటూ ప్రేమ, ధీరజ్ గొడవ పెట్టుకుంటారు. ఈ టైమ్ లో మాటలేంటీ అని తిరుపతి నిద్రలో నుంచి లేస్తాడు. నువ్వు కనపడని కాట్ రాజువి. మన్మథ రాజువి అని తిడుతుంది ప్రేమ. అప్పుడు దుప్పటి కప్పుకొని వచ్చిన తిరుపతిని చూసి దెయ్యం అనుకొని భయపడి ధీరజ్ ను గట్టిగా హగ్ చేసుకుంటుంది ప్రేమ.
కావాలనే పట్టుకొని దెయ్యాలు అని ఓవర్ చేస్తున్నావా? అని ధీరజ్ అడుగుతాడు. మరి నువ్వు ఎందుకు నన్ను ఆపలేదని ప్రేమ తిరిగి ప్రశ్నిస్తుంది. నువ్వు అనుకోలేదని ధీరజ్ చెప్తాడు. మరి ఆ ముద్దపప్పు ముగ్ధ అనుకున్నావా అని ప్రేమ కోపంతో అడుగుతుంది. ఇద్దరు తిట్టుకుంటారు. అసలు ఈ ముగ్ధ ఎవరు అని తిరుపతి అడిగితే చెప్పకుండా వెళ్లిపోతారు.
ఆలోచనలో చందు
ధాన్యం బస్తాలు వస్తున్నాయి. వాళ్లకు డబ్బులు ఎలా ఇవ్వాలి. రూ.6 లక్షలు పోయిన విషయం నాన్నకు ఎలా చెప్పాలి? అసలు రైస్ మిల్ లో డబ్బులు ఎలా పోయి ఉంటాయో ఎంత ఆలోచించినా అర్థమై చావడం లేదని చందు నిద్రపోకుండా ఆలోచిస్తాడు. మా ఆయన ఆ రూ.6 లక్షల గురించే ఆలోచిస్తున్నట్టున్నాడు. తిరుపతిపై అనుమానం పెరిగేలా చేద్దామని వల్లి అనుకుంటుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.