...
...
Next Story

Illu Illalu Pillalu August 31 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-ప్రేమ, ధీరజ్ రోల్స్ రివర్స్-వల్లికి షాకిచ్చిన భద్రావతి రచ్చ

Illu Illalu Pillalu August 31 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్టు 31 ఎపిసోడ్ లో భద్రావతి రచ్చ చేస్తోంది. తిరుపతిని దొంగ అని ఎలా అంటారంటూ వేదవతి, రామరాజుతో గొడవ పెట్టుకుంటుంది. తిరుపతికి వారంలో పెళ్లి చేస్తానంటుంది. మరోవైపు ధీరజ్, ప్రేమ రోల్స్ రివర్స్ చేసుకుంటారు.

Published on: Aug 31, 2026, 08:06:11 IST
Advertisement

Illu Illalu Pillalu August 31 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ రోజు ఎపిసోడ్ లో.. ధీరజ్, ప్రేమ మధ్య శాంతి చర్చలకు నర్మద పట్టుబడుతుంది. కానీ ధీరజ్, ప్రేమ ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటారు. మీ కోపాన్ని ఐస్ క్రీమ్ లా కరిగిపోయేలా చేసి, మిమ్మల్ని మిల్క్ షేక్ లా కలిసిపోయేలా చేసేందుకు నేనున్నానని నర్మద బిల్డప్ గా చెప్తుంది.

రోల్స్ రివర్స్

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

మొగుడు, పెళ్లాలు గొడవపడటం ఎంత సహజమో.. తిరిగి కలవడం కూడా అంతే సహజం. మీరు ఒకరి మాటను మరొకరు వినరు. అందుకే మీరు రోల్స్ రివర్స్ చేసి మాట్లాడుకోండి. అలా అయితే ఒకరి మనసులోని బాధ మరొకరికి అర్థమవుతుందని నర్మద చెప్తుంది.

ధీరజ్, ప్రేమ గొడవ

ధీరజ్ ప్రేమలా మారి మాట్లాడతాడు. ప్రేమ ఎమో ధీరజ్ లా మాట్లాడుతుంది. కానీ ఎవరి గొప్పలు వాళ్లే చెప్పుకుంటారు. తప్పు నాదే అంటే నాదే అంటూ ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటారు. దీంతో ప్రేమకు కోపం వస్తుంది. వీడు నా క్యారెక్టర్లో ఉండి నాదే తప్పు అనేలా మాట్లాడుతున్నాడని ప్రేమ కోపంతో అరుస్తుంది. మళ్లీ కళ్యాణ్ టాపిక్ తెచ్చి ధీరజ్, ప్రేమ గొడవ పడతారు.

ధీరజ్ పైకి ఐస్ క్రీమ్ విసిరేసి ప్రేమ వెళ్లిపోతుంది. ధీరజ్ కూడా వెనుకాలే వెళ్తాడు. అక్కడ అమూల్యను నర్మద చూసి ఫాలో అవుతుంది. తను ఇక్కడికి ఎందుకు వచ్చిందని అనుమానపడుతుంది.

తిరుపతి కన్నీళ్లు

మరోవైపు అక్క నన్ను దొంగ అని మాట్లాడేసరికి తట్టుకోలేకపోయానని తల్లి శారదాంబతో చెప్తూ ఏడ్చేస్తాడు తిరుపతి. వేదవతి అలా మాట్లాడదు. రైస్ మిల్ డబ్బు వసూలు చేసేది నువ్వే కదా. నువ్వు ఏమైనా తీసుకున్నావా? అని మాట వరుసకు అడిగి ఉంటుందని తల్లి నచ్చజెప్పాలని చూస్తుంది. ఆ మాటలను పట్టించుకోకు అని చెప్తుంది.

రెచ్చగొట్టేలా భద్రావతి

వేదవతిని బయటకు పిలుస్తుంది భద్రావతి. వేదవతి, రామరాజు బయటకు వస్తారు. నేను అంటించిన అగ్గిపుల్ల మండుతోందని వల్లి తెగ సైకో ఆనందం పొందుతుంది. మీ అక్కను గొడవకు పిలుచుకు వచ్చావా? అని తిరుపతిని వేదవతి అడుగుతుంది. తిరుపతి ఏదో చెప్పబోతుంటే భద్రావతి అడ్డుపడుతుంది. మీరెంత, మీ బతుకులెంతా? నా తమ్ముడి మీద దొంగ అని ముద్ర వేస్తారా? అని భద్రావతి అడుగుతుంది.

తెలుసుకోకుండా మాట్లాడకు. నేను వాడిని దొంగ అని అనలేదు. అయినా నా తమ్ముడిని దొంగ అని ఎందుకు అంటాను. ఏదైనా అవసరం ఉండి తీసుకుంటే ధైర్యంగా చెప్పమన్నాను. అందులో తప్పు ఏముందని వేదవతి అంటుంది. వాడు తీసుకోలేదని చెప్తుంటే పదే పదే గుచ్చిగుచ్చి అడగడంలో అర్థం ఏముంది? దొంగ అని ముద్ర వేయడమే కదా అని భద్రావతి గొడవను పెద్దది చేయాలని చూస్తుంది.

రామరాజు సీరియస్

ఆ డబ్బులో తనకు కూడా హక్కు ఉందని, స్వతంత్రంగా తీసుకోమని చెప్పింది. అంతే తప్పా వాడిని దొంగతనం చేశావని ఒక్క మాట కూడా అనలేదని రామరాజు అంటాడు. ఆపవయ్యా పెద్ద మనిషి. నీకు, నీ కొడుకులకు డబ్బు కొట్టేసే అలవాటు ఉందని భద్రావతి అనడంతో రామరాజు సీరియస్ అవుతాడు.

నీ రెండో కొడుకు డబ్బులు పెట్టి ఉద్యోగం కొనుక్కోలేదా? పెళ్లి వాళ్లు వచ్చి నీ చొక్కా పట్టుకొని నిలదీయలేదా? దాన్ని దొంగతనం అనరా? అని సేనాపతి నానామాటలు అంటాడు. సేనాపతి పాత విషయాలు తీసుకొచ్చి బుద్ధి లేకుండా వాగకు అని వేదవతి ఫైర్ అవుతుంది. నా తమ్ముడు జమీందార్ కొడుకు. మీలా కూలోడి కుటుంబం కాదని అవమానించేలా భద్రావతి మాట్లాడుతుంది.

నిజం చెప్పని వేదవతి

రైస్ మిల్ ను నీ పెద్ద కొడుకు కూడా చూసుకుంటున్నాడు కదా మరి వాడిని డబ్బు అడక్కుండా నా తమ్ముడినే ఎందుకు అడిగారని వేదవతి ప్రశ్నిస్తుంది. ఎందుకంటే అని వేదవతి ఆగిపోతుంది. వీడు ఆ డబ్బుతో సుకన్యకు చైన్ కొనిచ్చాడని చెప్పి నా భర్త ముందు, పిల్లల ముందు నా తమ్ముడిని తక్కువ చేయలేనని వేదవతి అనుకుంటుంది.

వారంలో పెళ్లి

కలెక్షన్ వాడు చేశాడు కాబట్టి తీశావా అని మాత్రమే అడిగిందని రామరాజు చెప్తాడు. ఇదే ఛాన్స్ అని భద్రావతి నోటికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంది. రైస్ మిల్ లో పనిచేయడని చెప్పి వీడికి పెళ్లి చేయకుండా ఉన్నారని భద్రావతి అంటుంది. ఇలా దిగజారి మాట్లాడటానికి సిగ్గు లేదా? మా మీద ద్వేషంతో సొంత తమ్ముడిని శత్రువులా చూశావ్. అసలు నీకు ఓ తమ్ముడు ఉన్నాడనే విషయం గుర్తుందా? అని వేదవతి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది.

నాకు బాధ్యత లేదా? వారం తిరిగేసరికి నా తమ్ముడికి పెళ్లి చేస్తా. జమీందార్ స్థాయికి తగ్గట్లు పెళ్లి చేసి మిమ్మల్ని తలదించుకునేలా చేయకపోతే నా పేరు భద్రావతే కాదు అని భద్రావతి ఛాలెంజ్ చేస్తుంది. దీంతో వల్లి షాక్ అవుతుంది. ఇక తిరుపతిని భద్రావతి ఇంట్లోకి లాక్కెళ్తుంది. అది చూసి రామరాజు, వేదవతి ఫీల్ అవుతారు. మరోవైపు రూ.6 లక్షల విషయంలో తప్పించుకున్నామని వల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది.

ధీరజ్ ప్రశ్న

రైస్ మిల్ లో డబ్బు పోయిందనే ఆధారం తెలుసుకున్నాక మాట అనాల్సిందని వేదవతితో నర్మద అంటుంది. మామ చిన్నప్పటి నుంచి నాన్నతో కలిసి రైస్ మిల్ చూసుకుంటున్నాడు. నాన్న డబ్బు ఇస్తే ఎప్పుడూ తీసుకోలేదు. అవసరం ఉంటే నాన్ననే అడిగేవాడు. కళ్ల ముందు రూ.లక్ష ఉన్నా ముట్టుకునేవాడు కాదు. అలాంటి మామ డబ్బులు కొట్టేశాడని నువ్వు ఎలా అనుమానపడ్డావని తల్లిని ధీరజ్ అడుగుతాడు.

ఇదే ఛాన్స్ అని సాగర్ తన గురించి చెప్తాడు. నేను అన్ని సంవత్సరాలు రైస్ మిల్ లో పని చేసి రూ.5 లక్షలు తీసుకుంటే నాన్న నన్ను దొంగ అన్నాడు. నువ్వు కూడా ఆయనలా మాట జారడం ఏంటీ అమ్మా అని సాగర్ అనడంతో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks