Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 3 ఎపిసోడ్ లో నర్మదకు షాకింగ్ విషయం తెలుస్తుంది. వల్లికి అబార్షన్ అని చెప్పిన ఫేక్ డాక్టర్ ను కనిపెట్టాలని నర్మద అనుకుంటుంది. మరోవైపు రాజ పుష్పం చెర నుంచి ప్రేమను ధీరజ్ కాపాడతాడు. ఇంకా ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.
డాక్టర్ కాదు క్లీనర్

శ్రీవల్లికి అబార్షన్ అయిందని డాక్టర్ గెటప్ లో అబద్ధం చెప్పిన అమ్మాయి హాస్పిటల్ లో క్లీన్ చేస్తూ ఉంటుంది. హాస్పిటల్ లో ఇకపై రీల్స్ చేస్తే జాబ్ తీసేస్తామని ఆ అమ్మాయికి డాక్టర్ వార్నింగ్ ఇస్తాడు. నాకంటూ ఓ రోజు వస్తుంది, పెద్ద సెలబ్రిటీ అయిపోతానని ఆ అమ్మాయి అనుకుంటుంది. అదే హాస్పిటల్ కు నర్మద వెళ్తుంది.
డాక్టర్ మెరుపు తీగ
ఆ హాస్పిటల్ లో సీసీ కెమెరాలు పని చేయట్లేదు, రిపేర్ చేయించమని టెక్నీషియన్ కు డాక్టర్ సీరియస్ గా చెప్తాడు. అప్పుడే ఆ ఇంఛార్జ్ డాక్టర్ ను నర్మద కలుస్తుంది. మీ హాస్పిటల్ లో మెరుపు తీగ అని గైనకాలజిస్ట్ ఉన్నారు కదా, ఒకసారి ఆవిడతో మాట్లాడాలని నర్మద అడుగుతుంది. ఆ పేరుతో మా హాస్పిటల్ లో ఎవరూ లేరని డాక్టర్ చెప్తాడు.
పని చేయని సీసీ కెమెరాలు
మాకు తెలిసిన ఒక అమ్మాయి యాక్సిడెంట్ అయిందనే వస్తే అబార్షన్ జరిగిందని ఆ డాక్టర్ చెప్పిందని నర్మద వివరిస్తుంది. ఆ రోజు మేమంతా ఓ విలేజ్ కు హెల్త్ క్యాంపు కోసం వెళ్లామని ఆ డాక్టర్ అంటాడు. సీసీ టీవీ ఫుటేజీ చూద్దామని నర్మద అంటుంది. కానీ నాలుగు రోజుల నుంచి సీసీ కెమెరాలు పని చేయడం లేదని డాక్టర్ చెప్తాడు. ఆ మెరుపు తీగ గురించి తెలుసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ అని నర్మద అనే సరికి.. ఎంక్వైరీ చేయిస్తానని డాక్టర్ మాటిస్తాడు.
ధీరజ్ టెన్షన్
మరోవైపు రూమ్ లో లాక్ అయిన ప్రేమ ఎలా తప్పించుకోవాలని ఏడుస్తుంటుంది. రాజ పుష్పం వెళ్లి అందరికంటే లాస్ట్ లో ప్రేమ అప్లికేషన్ పెడతాడు. ఒప్పుకోకపోతే అసలు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉండదని అనుకుంటాడు. ఇటు ప్రేమ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ధీరజ్ టెన్షన్ పడతాడు.
నర్మదకు తెలిసిన నిజం
{{/usCountry}}మరోవైపు రూమ్ లో లాక్ అయిన ప్రేమ ఎలా తప్పించుకోవాలని ఏడుస్తుంటుంది. రాజ పుష్పం వెళ్లి అందరికంటే లాస్ట్ లో ప్రేమ అప్లికేషన్ పెడతాడు. ఒప్పుకోకపోతే అసలు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉండదని అనుకుంటాడు. ఇటు ప్రేమ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ధీరజ్ టెన్షన్ పడతాడు.
నర్మదకు తెలిసిన నిజం
{{/usCountry}}అప్పుడే నర్మద వస్తుంది. ప్రేమ డ్యాన్స్ కాంపిటీషన్ కు వెళ్లింది. మీ ముద్దుల చెల్లెలు అబద్ధం చెప్పిందని ధీరజ్ అసలు విషయం చెప్తాడు. అప్పుడే ప్రేమ ఇంకా రాలేదా? అని రామరాజు వచ్చి అడుగుతాడు. హాస్పిటల్ లో ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు. నువ్వు వెళ్లి ఉదయం ప్రేమను తీసుకొని రా అని చిన్నోడికి రామరాజు చెప్తాడు. దీంతో ధీరజ్ బయల్దేరతాడు.
రూ.10 లక్షలు
డ్యాన్స్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. హాల్ లో కూర్చుని మందు కొడతాడు రాజ పుష్పం. కాంపిటీషన్ స్టార్ట్ అయింది. రూ.10 లక్షలు గెలుచుకుని నీ మొగుడికి కారు కొనివ్వాలని కలలు కంటూ వచ్చిన డ్యాన్స్ షో స్టార్ట్ అయిందని ప్రేమకు వినపడేలా రాజ పుష్పం అంటాడు. నీ మొగుడికి కారు కొనివ్వడం అనేది నీ చేతుల్లోనే ఉందంటాడు.
ప్రేమను దగ్గరకు లాక్కొని
నా కంట్లో పడిన అందం నేను అనుకున్న వెంటనే నా ఒళ్లో పడిపోవాలి. నేను ఇలా ఎప్పుడూ వెయిట్ చేయలేదు. నాలోని మన్మధ రాజ్ కోరుకుంటున్నాడు. తలుపు తీయమని డోర్ ను కొడతాడు రాజ పుష్పం. ఇలా బంధించడం చాలా పాపం. నన్ను వెళ్లనివ్వండని ప్రేమ ప్రాధేయపడుతుంది. అప్పుడే కరెంట్ పోతుంది.
ఇదే ఛాన్స్ అని ప్రేమ తప్పించుకునేందుకు బయటకు వస్తుంది. ఆమె ఫోన్ కు ధీరజ్ కాల్ చేస్తాడు. ప్రేమ ఫోన్ తీసుకోబోతుంటే రాజ పుష్పం వచ్చి చేయి పట్టుకుంటాడు. కరెంట్ నేనే తీయించేశా. నువ్వు రూమ్ లో నుంచి బయటకు వచ్చేందుకు ఇలా చేశానని ప్రేమను దగ్గరకు లాక్కుంటాడు రాజ పుష్పం.
ధీరజ్ కు కాల్
రాజ పుష్పాన్ని నెట్టేసిన ప్రేమ కత్తి పట్టుకుంటుంది. ఆ కత్తితో అతని చేతిని కట్ చేస్తుంది. మళ్లీ రూమ్ లోకి పరుగెత్తి లాక్ చేసుకుంటుంది. ధీరజ్ కు కాల్ చేసి ప్రేమ ఏడుస్తుంది. జరిగిందంతా చెప్తుంది. లొకేషన్ షేర్ చేయగానే ధీరజ్ రాకెట్ లా దూసుకెళ్తాడు.
చేతికి కట్టు కట్టుకున్న రాజ పుష్పం తన అసిస్టెంట్ తో కలిసి డోర్ బద్దలు కొడతాడు. నీ మొగుడు వచ్చేలోపే నిన్ను నా సొంతం చేసుకుంటానని ప్రేమను బెడ్ పైకి తోసేస్తాడు. అప్పుడే ధీరజ్ హీరోలా ఎంట్రీ ఇస్తాడు. రాజ పుష్పాన్ని చితకబాదతాడు. నా భార్యను ఏడిపిస్తావారా? అంటూ కొడతాడు ధీరజ్. రాజ పుష్పం పారిపోతాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ముగుస్తుంది.