Illu Illalu Pillalu June 9 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 9 ఎపిసోడ్ లో.. భద్రావతికి దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది ప్రేమ. ధీరజ్ ను నిర్దోషిగా బయటకు తీసుకొస్తానని ఛాలెంజ్ చేస్తుంది. నర్మద, ప్రేమ కలిసి అదే పని మీద ఉంటారు. ఇంకా ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో చూసేయండి.
భద్రావతి మురిపెం

ప్రేమ తన పుట్టింటికి వెళ్లిపోతుంది. నేను మళ్లీ ఇంటికి వచ్చేస్తే ధీరజ్ ను కేసు నుంచి విడిపిస్తానని చెప్పావ్ కదా. ధీరజ్ ను విడిపించమని భద్రావతిని అడుగుతుంది ప్రేమ. సేనా, విశ్వ మన ప్రేమ శాశ్వతంగా మన ఇంటికి వచ్చేసిందని భద్రావతి తెగ సంతోషపడిపోతుంది.
భర్తను వదిలేస్తావా?
ప్రేమ ఏంటే పిచ్చి పని, తాళి కట్టిన భర్తను వదిలేసి వస్తావా? మూడు ముళ్ల బంధాన్ని తెంచేసుకుంటావా? అని శారదాంబ, రేవతి కలిసి బుద్ధి చెప్పాలని చూస్తారు. కానీ వాళ్లను భద్రావతి తిడుతుంది. కూతురిని చూసుకుని సేనాపతి మురిసిపోతాడు. ఇదంతా చూస్తున్న నర్మద ఫీల్ అవుతుంది. శ్రీవల్లి, సుక్కు ఎమో చంకలు గుద్దుకుంటారు.
దిమ్మతిరిగే షాక్
నీ మెడలో వాడు కట్టిన తాళి ఎందుకు? తీసి పారేయ్ అని ప్రేమ తాళిని భద్రావతి పట్టుకుంటుంది. కానీ అత్త చేతిని పట్టుకుని ప్రేమ నవ్వుతుంది. నా గుండెలో ప్రాణం ఉన్నంతవరకూ ధీరజ్ కట్టిన తాళిని, ధీరజ్ ప్రేమను వేరు చేయడం నీ వల్ల కాదని భద్రావతికి దిమ్మతిరిగే షాకిస్తుంది ప్రేమ. శాశ్వతంగా బంధాన్ని తెంచేసుకున్నానంటే నమ్మేశావా? మా మధ్య ఉన్న ప్రేమ ఒకరికోసం ఒకరు బతకడం. చావైనా, బతుకైనా వాడితోనే. మధ్యలోనే చేయి విడిచిపెట్టి వస్తానని ఎలా అనుకున్నారని ప్రేమ చెప్తుంది.
సత్యభామలా పోరాడతా
వాడు జీవితాంతం జైల్లోని మగ్గిపోతాడని సేనాపతి అంటాడు. మీకు కుట్రలు చేసి నా భర్తను ఇరికించడం తెలిస్తే, నాకు యుద్ధం చేసి నా భర్తను విడిపించడం తెలుసు. సత్యభామలా పోరాడతా. భర్తను నిర్దోషిగా బయటకు తీసుకొస్తానని ప్రేమ చెప్పడంతో అక్కడే ఉన్న నర్మద విజిల్ వేసి, క్లాప్స్ కొడుతుంది. తిరిగి తిరిగి నా కాళ్ల దగ్గరకే వస్తావని భద్రావతి అంటుంది. నా భర్త రిలీజై రావడాన్ని మీరు కళ్లారా చూస్తారు, రెడీగా ఉండండని చెప్పి ప్రేమ వెళ్లిపోతుంది.
ధీరజ్ కోసం
{{/usCountry}}వాడు జీవితాంతం జైల్లోని మగ్గిపోతాడని సేనాపతి అంటాడు. మీకు కుట్రలు చేసి నా భర్తను ఇరికించడం తెలిస్తే, నాకు యుద్ధం చేసి నా భర్తను విడిపించడం తెలుసు. సత్యభామలా పోరాడతా. భర్తను నిర్దోషిగా బయటకు తీసుకొస్తానని ప్రేమ చెప్పడంతో అక్కడే ఉన్న నర్మద విజిల్ వేసి, క్లాప్స్ కొడుతుంది. తిరిగి తిరిగి నా కాళ్ల దగ్గరకే వస్తావని భద్రావతి అంటుంది. నా భర్త రిలీజై రావడాన్ని మీరు కళ్లారా చూస్తారు, రెడీగా ఉండండని చెప్పి ప్రేమ వెళ్లిపోతుంది.
ధీరజ్ కోసం
{{/usCountry}}బయటకు వెళ్లిన తర్వాత ప్రేమను నర్మద హగ్ చేసుకుంటుంది. నువ్వు నిజంగానే పుట్టింటికి వెళ్తావేమోనని భయపడ్డానని నర్మద అంటుంది. ధీరజ్ లా ప్రేమించే భర్త నాకు దొరకడని ప్రేమ చెప్తుంది. రామరాజు కోడళ్ల పవర్ చూపిద్దాం. ధీరజ్ ను బయటకు తీసుకొద్దామని నర్మద అంటుంది. అప్పుడే లాయర్ కు ఫోన్ చేసి ధీరజ్ కు బెయిల్ వస్తుంది కదా అని అడుగుతుంది. కానీ అది డ్రగ్స్ కేసు కాబట్టి ఆశలు పెట్టుకోవద్దని లాయర్ చెప్తాడు.
ధీరజ్ ను కోర్టుకు తీసుకెళ్లకుండానే నిర్దోషిగా బయటకు తీసుకు రావాలక్కా అని నర్మదతో ప్రేమ అంటుంది. ఆ మాదక ద్రవ్యాలకు, ధీరజ్ కు సంబంధం లేదని నిరూపిస్తే బయటకు తీసుకురావచ్చని నర్మద చెప్తుంది. అయితే ఎంక్వైరీ మొదలు పెడదామని ప్రేమ, నర్మద వెళ్తారు. ఇదంతా చూసి శ్రీవల్లి, సుక్కు నవ్వుకుంటారు. నేను వాళ్లను ఫాలో చేస్తానని సుక్కు వెళ్తుంది.
సీసీ టీవీ ఫుటేజీ
రోడ్డు మీదకు వెళ్లి అందరిని ప్రేమ అడుగుతుంది. దానికి పక్కా ఎవిడెన్స్ కావాలి. ఆ సాక్ష్యాలతో పాటు వాడిని మనం పోలీసులకు పట్టించాలి. సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డు అవుతాయని నర్మద చెప్తుంది. సీసీ టీవీ ఫుటేజీ కోసం పక్కనే ఉన్న ఓ షాప్ లోకి వెళ్తారు. ఆ షాప్ లో పెద్ద మనిషికి ఉన్న చాదస్తంతో ఫుటేజీ ఇవ్వనంటాడు. నర్మదకు చిర్రెత్తుకొచ్చి తల పగలకొడతానని అంటుంది.
ఫోన్ లో వీడియో
ఆ వ్యక్తి మామిడి పళ్ల బాక్స్ లతో రావడం, కారు ఎక్కడం అంతా సీసీటీవీలో రికార్డయింది. ఆ ఫుటేజీని నర్మద వీడియో తీసుకుంటుంది. ఓ ట్రాఫిక్ ఎస్సైకి కాల్ చేసి బండి నంబర్ ఆధారంగా పేరు, అడ్రస్ ఇవ్వమని నర్మద అడుగుతుంది. ఇదంతా చూసిన సుక్కు ఈ విషయాన్ని అత్తకు చెప్పాలని వెళ్లిపోతుంది.
మరోవైపు వేదవతి ఏడుస్తూ ఉంటుంది. చిన్నోడికి బెయిల్ వస్తుందని లాయర్ చెప్పాడు. ఏం టెన్షన్ పడకండని తండ్రి రామరాజుతో చందు చెప్తాడు. కానీ ఇది చిన్నా చితకా కేసు కాదు అని రామరాజు అనడంతో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.