ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ భలే రసవత్తరంగా సాగుతోంది. శ్రీవల్లీతో నర్మద, ప్రేమ ఓ ఆటాడుకుంటున్నారు. శ్రీవల్లి ఫేక్ సర్టిఫికేట్ల గురించి చందుకు తెలిసిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మార్చి 31 ఎపిసోడ్ లో చూసేద్దాం.
చందు ఫైర్

నువ్వు చదివింది తొమ్మిదో క్లాస్. కానీ ఎంఏ ఇంగ్లీష్ అని అబద్ధం చెప్పి నాతో పెళ్లి చేస్తారు. పెళ్లప్పుడు నాన్నకు మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేస్తారా అని శ్రీవల్లిపై చందు ఫైర్ అవుతాడు. దొంగ సర్టిఫికేట్లు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటిది ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్లు చేశారంటే మీరు కంత్రీగాళ్లను అర్థం అవుతుందని చందు మండిపడతాడు.
వల్లీ ఏడుపు
మేం సానా మంచోళ్లం. సానా అమాయకులం. టీచర్ జాబ్ లో జాయిన్ కావాలని మామయ్య దగ్గర నర్మద, ప్రేమ ఇరికించేసరికి మరో దారిలేక దొంగ సర్టిఫికేట్లు చేయించాల్సి వచ్చింది. అంతా నర్మద, ప్రేమ కారణంగానే జరిగిందని వల్లీ ఏడుస్తూ అంటుంది. నీతో పెళ్లి కోసమే మా వాళ్లు అబద్ధం చెప్పారు బా అని వల్లీ కన్నీళ్లు కారుస్తుంది.
నాన్న తట్టుకోగలడా?
నాకు కాబోయే అమ్మాయి ఎంఏ చదివి ఉండాలని నేను అడిగానా? నువ్వు ఎంత చదువుకున్నావ్? నీకు ఎంత ఆస్తి ఉందని మా నాన్న చూడలేదు. ఒక్క రూపాయి కట్నం అడగకుండా కోడలిని చేసుకున్నారు. పెద్ద కోడలి రూపంలో వచ్చిన దేవతవి నువ్వు అని మా నాన్న పొంగిపోతున్నారు. నిజం తెలిస్తే మా నాన్న తట్టుకోగలడా? అని చందు ఫీల్ అవుతాడు.
తనను బా అని పిలవొద్దని చందు కోప్పడతాడు. అసహ్యంగా అనిపిస్తుందని వల్లీపై సీరియస్ అవుతాడు. మా నాన్నను మోసం చేశావ్, నా నమ్మకాన్ని మోసం చేశావని చందు వెళ్లిపోతాడు. వల్లీ ఏడుస్తూ కూలబడిపోతుంది.
భాగ్యం టెన్షన్
{{/usCountry}}తనను బా అని పిలవొద్దని చందు కోప్పడతాడు. అసహ్యంగా అనిపిస్తుందని వల్లీపై సీరియస్ అవుతాడు. మా నాన్నను మోసం చేశావ్, నా నమ్మకాన్ని మోసం చేశావని చందు వెళ్లిపోతాడు. వల్లీ ఏడుస్తూ కూలబడిపోతుంది.
భాగ్యం టెన్షన్
{{/usCountry}}మరోవైపు భాగ్యం, ఇడ్లీ బాబాయ్ తెగ టెన్షన్ పడిపోతుంటారు. అల్లుడు నా కూతురిని ఏం చేశాడో ఏంటో అని భయపడతారు. వల్లీకి భాగ్యం ఫోన్ చేస్తుంది. మీరు ఇద్దరు కలిసి అబద్ధాలు ఆడి నా బతుకు గంగలో కలిపారని వల్లీ ఏడ్చేస్తుంది. మేం కూడా ఇంటికి వస్తామని భాగ్యం, ఇడ్లీ బాబాయ్ బయల్దేరుతారు.
వల్లితో ఆటలు
బల్లీ ఫేస్ ను ఎప్పుడెప్పుడు చూడాలని ఉందని ప్రేమ, నర్మద గుమ్మం బయటే వెయిట్ చేస్తుంటారు. అప్పుడే వచ్చిన చందు బావను చూస్తారు. చందు బావ ఫుల్ ఫైర్ లో ఉన్నారు. బల్లీకి గూబ పగిలిపోయి ఉంటుందని ప్రేమ అంటుంది. అప్పుడే చెంప పట్టుకుని శ్రీవల్లి వస్తుంది. ఆ బల్లితో నర్మద, ప్రేమ ఆడుకుంటారు. టీచర్ అంటూ సెటైర్లు వేస్తారు.
వల్లక్కాయ్ బుగ్గ బూరెలా వాచిపోయింది. ఏమైందక్కాయ్ అని వెటకారంగా అడుగుతారు ప్రేమ, నర్మద. మీ మాటలే ఎక్కువ బాధగా ఉన్నాయని వల్లి లోపలికి వెళ్తుంది. వల్లిని చందు బయటకు నెట్టేసి గది గడియ పెట్టుకుంటాడు. బా ప్లీజ్ బా నేను చెప్పేది విను అని వల్లి రిక్వెస్ట్ చేసినా చందు పట్టించుకోడు.
రామరాజు కాళ్లపై
ఇదే రగులుతున్న అగ్ని పర్వతమంటూ మా మామయ్య మీ అందరి మీద ఫుల్ కోపంగా ఉన్నారు. మీ పాపాల చిట్టా బయటపడిందని అప్పడే వచ్చిన భాగ్యం, ఇడ్లీ బాబాయ్ ను నర్మద, ప్రేమ భయపెట్టేస్తారు. ఇంతలో గునపం తీసుకుని రామరాజు వస్తాడు. అది చూసి ఇడ్లీ బాబాయ్ వణికిపోతాడు. వెళ్లిపోదామని భాగ్యంతో చెప్తాడు. మీ అమ్మాయి పరిస్థితి ఎలా? వెళ్లి మామయ్య కాళ్ల మీద పడండని నర్మద చెప్తుంది.
భాగ్యం, ఇడ్లీ బాబాయ్ కలిసి రామరాజు కాళ్లమీద పడతారు. మమ్మల్ని క్షమించాలని అంటారు. కొబ్బరికాయలు ఒలవడానికి గునపం తీసుకెళ్తున్నానని రామరాజు అంటాడు. నర్మద, ప్రేమ కలిసి రామరాజు ముందు భాగ్యం, ఇడ్లీ బాబాయ్ ను ఇరికిస్తారు. రూ.10 లక్షలు ఇచ్చారు కదా, వ్యాపారంలో లాస్ వచ్చిందని, క్షమించండని భాగ్యం మాట మారుస్తుంది. నర్మద వార్నింగ్ ఇవ్వడంతో భాగ్యం, ఇడ్లీ బాబాయ్ జంప్ అవుతారు.
బుజ్జమ్మ ప్రేమ
రేపు ఉదయం నీకు అసలు సినిమా ఉందని వల్లీని నర్మద, ప్రేమ మరింత టెన్షన్ పెడతారు. కొబ్బరికాయలు ఒలుస్తున్న రామరాజును చూసి వేదవతి కంగారు పడుతుంది. డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడు కదా అని వేదవతి చెప్తుంది. హలో బుజ్జమ్మా నాకు ఏమైనా వయసు అయిపోయిందా అని రామరాజు తన పని తాను చేసుకుంటాడు. భర్తకు పట్టిన చెమటను కొంగుతో తుడుస్తూ వేదవతి ఓ సాంగ్ వేసుకుంటుంది.
ఈ పనులు నేను చేస్తానని తండ్రిని ధీరజ్ లోపలికి పంపిస్తాడు. అప్పుడే ప్రేమ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. వీళ్లు చిర్రుబుర్రలను చూస్తూ వేదవతి నవ్వుకుంటుంది. చిన్నోడా ఆ కాఫీ నేనే పెట్టాన్రా అని వేదవతి చెప్పగానే ధీరజ్ తీసుకుంటాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.