Illu Illalu Pillalu May 1 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు ఇంట్లో ఆస్తి చిచ్చు రగులుతుంది. వాటా అడగడంలో తప్పు లేదని సాగర్ రెచ్చిపోతాడు. మరోవైపు శ్రీవల్లి కడుపులో బిడ్డ లేదని చెప్పాలనుకున్న ఇడ్లీ బాబాయ్ ను భాగ్యం అడ్డుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 1 ఎపిసోడ్ లో చూద్దాం.
ప్రేమ సారీ

జరిగిన గొడవ తలుచుకుంటూ ధీరజ్ ఫీల్ అవుతాడు. నా మీద చాలా కోపంగా ఉంది కదా. నీ బాధ నాకు తెలుస్తుంది. కారణం నేనే. సారీ అని ప్రేమ చెప్తుంది. నేనే మిస్టేక్ చేశా. అనవసరంగా ష్యూరిటీ సంతకం పెట్టమని బావను తీసుకెళ్లానని ధీరజ్ అంటాడు. మీ బావనే నేనే అడిగా కదా, ఇదంతా జరగడానికి కారణం నేనే కదా అని ప్రేమ అంటుంది.
నేనే కారు కొనిస్తా
నగలు తీసుకోమన్నా తీసుకోవడం లేదు. డౌన్ పేమెంట్ కు డబ్బులు లేవు. అందుకే మీ బావను అడిగా. నా భర్తకు జరిగిన అవమానాన్ని మర్చిపోను. అవమానించిన వాళ్ల ముందే సగ్వరంగా తల ఎత్తుకునేలా చేస్తా. రేపే డబ్బులు కట్టి, కారు తీసుకుంటున్నావ్. నేనే డబ్బులు తీసుకొస్తానని ప్రేమ షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది.
సాగర్ పై నర్మద సీరియస్
నీ మైండ్ లోకి ఆస్తి పంపకాల విషయం ఎలా వచ్చింది బుద్ధి లేకుండా అని సాగర్ పై నర్మద కోప్పడుతుంది. ఈ ఆలోచన వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అని అడుగుతుంది. చెప్పించుకునే స్థితిలో లేనని, టిఫిన్ బాక్స్ తీసుకోకుండా సాగర్ కోపంగా వెళ్లిపోతాడు. కుటుంబం ముక్కలు అవుతుందేమోనని ప్రేమతో చెప్తూ నర్మద భయపడుతుంది.
ముగ్గుతో వేదవతి కామెడీ
బయట వేదవతి వేసిన ముగ్గును చూస్తూ తిరుపతి కామెడీ చేస్తాడు. వీడియోలో చూసి వేశా. అంటా అన్నానంటావ్ కానీ నేను వేస్తే ఇంత దరిద్రంగా వచ్చిందేంటీ? అని వేదవతి అమాయకంగా అంటుంది. రాత్రి అంత పెద్ద గొడవ జరిగింది కదా. సర్దుమణిగేలా చేయాలనే ఆలోచన ఉందా? ఇక్కడేమో ముగ్గులు వేస్తున్నారా? అని అత్తపై నర్మద, ప్రేమ మండిపడతారు.
నీతి బోధ
{{/usCountry}}బయట వేదవతి వేసిన ముగ్గును చూస్తూ తిరుపతి కామెడీ చేస్తాడు. వీడియోలో చూసి వేశా. అంటా అన్నానంటావ్ కానీ నేను వేస్తే ఇంత దరిద్రంగా వచ్చిందేంటీ? అని వేదవతి అమాయకంగా అంటుంది. రాత్రి అంత పెద్ద గొడవ జరిగింది కదా. సర్దుమణిగేలా చేయాలనే ఆలోచన ఉందా? ఇక్కడేమో ముగ్గులు వేస్తున్నారా? అని అత్తపై నర్మద, ప్రేమ మండిపడతారు.
నీతి బోధ
{{/usCountry}}సీ మై గవర్నమెంట్ కోడలు, మేన కోడలు సమస్య వస్తే శాంతంగా పరిష్కరించుకోవాలి. టెన్షన్ పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు అని వేదవతి నీతి బోధ చేస్తుంది. గవర్నమెంట్ కోడలా.. నా కొడుకు కోపాన్ని నేను పోగొడతాను కానీ ముగ్గురం కలిసి ఈ ముగ్గును పట్టుపడదామని వేదవతి చెప్తుంది. ప్రేమ, నర్మద, వేదవతి కలిసి ముగ్గు వేస్తారు.
వల్లికి కుళ్లు
ఇదంతా శ్రీవల్లి చూసి కుళ్లుకుంటుంది. నేను కడుపుతో ఉన్నా నన్ను పట్టించుకోవడం లేదని లోపలికి వెళ్లిపోతుంది. కిచెన్ లోకి వెళ్లి కుకర్ ను కింద పాడేస్తుంది. ఆ సౌండ్ విని రామరాజు లోపలికి వస్తాడు. నేను కడుపుతో ఉన్నా కదా, బోలెడంత ఆకలి వేస్తుంది కదా ఏదైనా వండుకుని తిందామని లోపలికి వచ్చానని శ్రీవల్లి ప్లాన్ ప్రకారం చెప్తుంది.
రామరాజు ఫైర్
బుజ్జమ్మ, నర్మద, ప్రేమ అని రామరాజు గట్టిగా అరుస్తాడు. కడుపుతో ఉన్న కోడలిని పట్టించుకోరా అని సీరియస్ అవుతాడు. నీకు ఆకలేస్తే నన్ను పిలవొచ్చు కదా అని వేదవతి అడుగుతుంది. మీ ముగ్గురిని పిలిచాను కానీ ముగ్గు వేస్తూ, కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీస్ లో ఉన్నారు. అందుకే పిలిచినా వినిపించలేదని శ్రీవల్లి అబద్ధం చెప్తుంది.
బెల్ కొట్టగానే
పెద్ద కోడలికి బెల్ ఇస్తాడు రామరాజు. ఇది నొక్కగానే ఎవరో ఒకరు నీ దగ్గరకు వస్తారని రామరాజు చెప్తాడు. జాగ్రత్తగా చూసుకోండని ముగ్గురికి వార్నింగ్ ఇస్తాడు. చేతిలో బెల్ ఉంది కదా అని శ్రీవల్లి ఆడుకుంటుంది. దోశలు, ఇడ్లీలు, వడలు, జ్యూస్ అంటూ అన్నీ అడుగుతుంది. తిని రెస్ట్ తీసుకుంటానని వల్లి లోపలికి వెళ్లిపోతుంది.
ప్రేమగా ప్రేమ
మరోవైపు ధీరజ్ మైండ్ ను డైవర్ట్ చేయాలని ప్రేమ అనుకుంటుంది. నీ చేతులతో నా తల తుడవమని అడుగుతుంది. నేను ఎందుకు తుడుస్తాను? అని ధీరజ్ అంటే.. నేను మా పుట్టింటికి వెళ్లిపోతానని ప్రేమ అలుగుతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.