...
...
Next Story

Illu Illalu Pillalu November 18 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-బయటపడ్డ సాగర్ బాగోతం-లంచం డబ్బుతో పట్టించిన నర్మద-అరెస్ట్

Illu Illalu Pillalu November 18 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే నవంబర్ 18 ఎపిసోడ్ లో సాగర్ లంచం బాగోతం బయటపడుతుంది. ఏసీబీ ఆఫీసర్లు రామరాజు ఇంటికి వస్తారు. కానీ సాగర్ తప్పించుకోవాలని చూస్తాడు. అయితే లంచం డబ్బుతో సాగర్ ను నర్మద పట్టిస్తుంది. ఇక ప్రేమ బిజినెస్ తెలివికి ధీరజ్ షాక్ అవుతాడు.

Published on: Nov 18, 2026, 07:42:51 IST
Advertisement

Illu Illalu Pillalu November 18 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. కూరగాయలు అమ్మే ఆవిడలా రామరాజు ఇంటికి వచ్చిన వల్లి దొరికిపోతుంది. దీంతో చందు గొడవ చేస్తాడు. కానీ బల్లక్కాయ్ మాత్రం విడాకుల పేపర్ల మీద సంతకం చేయనంటే చేయనని చెప్పేస్తుంది.

బాదేసిన వేదవతి

ఇల్లు ఇల్లాలు పిల్లలు-బయటపడ్డ సాగర్ బాగోతం-లంచం డబ్బుతో పట్టించిన నర్మద-అరెస్ట్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు-బయటపడ్డ సాగర్ బాగోతం-లంచం డబ్బుతో పట్టించిన నర్మద-అరెస్ట్ (jiohotstar)

నువ్వు నాకు కావాలి బా. ఈ కుటుంబం నాకు కావాలి అని వల్లి ప్రాధేయపడుతుంది. సంతకం పెట్టకపోతే చంపేస్తా. నువ్వు వాయిదాకు వస్తావ్ కదా అప్పుడు చెప్తా నీ సంగతి అని చందు బయటకు వెళ్లిపోతాడు. నేను కోర్టుకు రాను. సంతకం పెట్టనని వల్లి గట్టిగా అరుస్తుంది. ఎందుకే నా కొడుకును రెచ్చకొడుతున్నావని బల్లక్కాయ్ ను బాదేస్తుంది వేదవతి. దీంతో వల్లి పరుగులు పెడుతుంది.

సాగర్ బాగోతం

సాగర్, నర్మద ఆఫీసుకు వెళ్లేందుకు రెడీ అవుతుంటారు. అప్పుడే ఏసీబీ వాళ్లు ఇంటికి వస్తారు. వాళ్లను చూసి షాక్ అయిన సాగర్ టెన్షన్ తో గదిలోకి వెళ్తాడు. ఏసీబీ వాళ్లు అంటే ఏంటో తెలియని తిరుపతి, సుక్కు కామెడీ చేస్తారు. సాగర్ ను పిలవమని వాళ్లు అడుగుతారు. సాగర్ లంచం తీసుకున్నాడు. అతణ్ని పట్టుకోవడానికి వచ్చామని ఏసీబీ ఆఫీసర్ చెప్పేసరికి అందరి మైండ్ లు బ్లాంక్ అవుతాయి. ఇలా సాగర్ బాగోతం బయటపడుతుంది.

వీడియో ప్రూఫ్

మీరు రూల్స్ మాట్లాడితే, మేం కూడా రూల్స్ మాట్లాడతాం సార్. మీరు లంచం తీసుకున్నారో లేదో మేం తేలుస్తాం. ఇళ్లంతా చెక్ చేయండని ఆఫీసర్ చెప్తాడు. అందుకు సాగర్ ఒప్పుకోడు. కానీ సాగర్ లంచం తీసుకుంటే ఆ పాపం సొమ్ము నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వెళ్లి వెతకండని రామరాజు చెప్తాడు. కానీ డబ్బు దొరకదు.

సాగర్ ప్లాన్

మీరు చాలా ప్లాన్డ్ ఉన్నారని అర్థమవుతోంది. మీరు కోపరేట్ చేస్తే శిక్ష తగ్గుతుంది. లేదంటే చాలా సీరియస్ గా ఉంటుందని ఆఫీసర్ సాగర్ తో చెప్తాడు. బెదిరించి చాలు. మీకు ఏం దొరకలేదు కదా ఇక వెళ్లండని సాగర్ అంటాడు. టోటల్ ప్రూఫ్స్ తో వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తానని ఆఫీసర్ చెప్తాడు. అయితే రాత్రి మొక్కల దగ్గర సాగర్ ఏదో దాచిన విషయాన్ని నర్మద గుర్తు చేసుకుంటుంది.

పట్టించిన నర్మద

అక్కడికి వెళ్లి నర్మద చూస్తే డబ్బు కట్టలు ఉంటాయి. ఏం చేస్తున్నావ్ నర్మద? వాళ్లకు డబ్బు ఇస్తే నా ఉద్యోగం పోతుందని సాగర్ చెప్తున్నా నర్మద వినదు. సార్ మా ఆయన లంచం తీసుకున్నాడు. ఇదిగోండి డబ్బులు అని నర్మద సాగర్ ను పట్టిస్తుంది. డబ్బుతో పాటు సాగర్ ను ఎంక్వైరీ కోసం తీసుకెళ్లాలంటారు. నీ కోసం నీ భర్తకు తక్కువ శిక్ష పడేలా చూస్తానని ఆ ఆఫీసర్ నర్మదకు చెప్తాడు. సాగర్ ను తీసుకొని వెళ్తారు.

నడిపోడిని తీసుకెళ్లొద్దని చెప్పండని రామరాజును వేదవతి అడుగుతుంది. సేటుకు డబ్బు ఇస్తానన్నప్పుడే కచ్చితంగా వాడు లంచం తీసుకునే ఉంటాడని అనుమానం వచ్చింది. అదే జరిగింది. అప్పుడే నిలదీసుంటే బాగుండేది. ఇక్కడిదాకా వచ్చేది కాదని రామరాజు కోపంతో ఊగిపోతాడు.

ప్రేమ బిల్డప్

ఇటు ట్రావెల్ ఏజెన్సీలో కార్లన్నింటికీ ప్రేమ దిష్టి తీస్తుంది. కొబ్బరికాయ కొడితే చిన్న ముక్క వెళ్లి ధీరజ్ కు తగులుతుంది. కార్లకు ప్రేమ చేసిన పూజ చూసి ధీరజ్ షాక్ అవుతాడు. ఇలా పూజ చేస్తేనే కొన్నిసార్లు దిష్టి తగలకుండా ఉంటుంది. ఈ రోజు మన గల్లా పెట్టే అంతా కాసులతో కళకళలాడిపోవాలని ప్రేమ అంటుంది. అప్పుడే ఓ కస్టమర్ కాల్ చేసి కారు కావాలంటాడు. ఫస్ట్ కస్టమర్ కావడంతో ధీరజ్ రూ.500 తక్కువ చేసి చెప్తాడు.

బిజినెస్ డీల్

బిజినెస్ నీకు వదిలేస్తే కష్టమేరా అని ప్రేమ గుండెలు బాదుకుంటుంది. ఇక తానే డీల్ చేస్తానని ప్రేమ అంటుంది. అప్పుడే వచ్చిన మరో కస్టమర్ ను ప్రేమ డీల్ చేస్తానంటుంది. బాబాయి గారు మీకు బీపీ, షుగర్ ఉన్నాయా? అని ప్రేమ అడుగుతుంది. కూల్ డ్రింక్, స్నాక్స్ తెమ్మని ధీరజ్ ను పంపించి ఆ కస్టమర్ తో ప్రేమ ముచ్చట్లు పెడుతుంది.

ఫ్యామిలీతో వైజాగ్ వెళ్లాలనే ఆలోచన ఉందని ఆ కస్టమర్ చెప్తాడు. వైజాగ్ వెళ్తే సింహాచలం, కైలాసగిరి, అన్నవరం కూడా వెళ్లాలి. కారుకు రూ.15 వేలు అవుతుందని ప్రేమ చెప్తుంది. కాస్త తగ్గించమని కస్టమర్ అడుగుతాడు. పైగా హైదరాబాద్ కూడా వెళ్లాలంటాడు. హైదరాబాద్ లో అన్ని చూడాలి, అందుకు రూ.25 వేలు అవుతుందని ప్రేమ చెప్తుంది.

ధీరజ్ కు షాక్

తన భార్యకు ఫోన్ చేస్తానని ఆ కస్టమర్ పక్కకు వెళ్తాడు. కారు రెంట్ రేట్లు మండిపోతున్నాయి. నువ్వు చెప్పినట్లే ట్రైన్ కు వెళ్లిపోదామని ఆ కస్టమర్ భార్యతో చెప్పేసరికి ప్రేమ షాక్ అవుతుంది. ధీరజ్ కు మండిపోతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks