చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.
Illu Illalu Pillalu November 26 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- ధీరజ్‌ను చూసి చందు ఎస్కేప్-వల్లికి రామరాజు ప్రామిస్
Illu Illalu Pillalu November 26 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే నవంబర్ 26 ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. గుడిలో ధీరజ్ ను చూసి అంజలిని తీసుకొని చందు పారిపోతాడు. ఇటు వల్లిని చూసేందుకు వచ్చిన రామరాజు, వేదవతిని భాగ్యం నానా మాటలు అంటుంది. ధీరజ్ కాల్ చేస్తే చందు అబద్ధం చెప్తాడు.
Illu Illalu Pillalu November 26 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. గుడిలో అంజలితో చందు క్లోజ్ గా ఉండటం చూసి ధీరజ్ షాక్ అవుతాడు. ధీరజ్ ను చూసి చందు మైండ్ బ్లాక్ అవుతుంది. రేయ్ పెద్దోడా ఎంత పని చేశావ్ రా అని ధీరజ్ అనుకుంటాడు.

పారిపోయిన చందు
గుండె పట్టుకున్నావ్ ఏంట్రా? హార్ట్ ఎటాక్ ఏమైనా వచ్చిందా? అని ధీరజ్ ను చూసి ప్రేమ కంగారు పడుతుంది. అంజలిని పట్టుకొని చందు అక్కడి నుంచి కంగారుగా బయటకు వెళ్లిపోతాడు. మా తమ్ముడు ధీరజ్ చూసేశాడని అంజలిని బైక్ పై ఎక్కించుకొని చందు వెళ్లిపోతాడు. పెద్దోడా అని ధీరజ్ పిలిచినా కూడా పట్టించుకోకుండా చందు వెళ్లిపోతాడు.
భద్రావతి అని అబద్ధం
నేను ఉండగానే ఆ అమ్మాయి కోసం పరుగెత్తుకుంటూ ఎందుకు వచ్చావ్? ఆ అమ్మాయి ఎవరు? నువ్వు నిజం చెప్పేదాకా వదలను అని ధీరజ్ చెవిని ప్రేమ పిండేస్తుంది. మీ భద్రావతి అత్తయ్యలా కనిపిస్తే ఆవిడ వచ్చిందేమోనని డౌట్ వచ్చింది. ఎప్పుడూ ఏదో ఒక ప్లాన్ వేస్తుంది కదా. అందుకే చూద్దామని వచ్చానని ధీరజ్ అబద్ధం చెప్తాడు. అబద్ధం చెప్తున్నావని ధీరజ్ ను ప్రేమ కొడుతుంది.
వల్లి దగ్గరకు అత్తామామ
మరోవైపు బిడ్డ కోసం చిన్న స్వెటర్ కుట్టి శ్రీవల్లి ఏడుస్తుంది. పాలు తెచ్చి ఇచ్చిన ఇడ్లీ బాబాయి తన బిడ్డను అత్తారింటికి త్వరగా పంపమని దేవుడిని కోరుకుంటాడు. తనకు పుట్టబోయే బిడ్డ కోసం కుట్టిన స్వెటర్ ఎలా ఉందని తండ్రిని వల్లి అడుగుతుంది. అప్పుడే రామరాజు, వేదవతి వస్తారు. నీ చేయి పడితే ఏదైనా అద్భుతంగానే ఉంటుందమ్మా అని రామరాజు అంటారు.
క్షమించు వల్లి
అత్తామామను చూసి వల్లి సంబరపడిపోతుంది. కడుపుతో ఉన్న కోడలు ఇంటికి వచ్చి నిజం చెప్పినా ఇంట్లోకి తీసుకెళ్లలేకపోయినందుకు క్షమించమ్మా అని వల్లిని రామరాజు అడుగుతాడు. ఏ పూటకాపూట బలం వచ్చేది తింటూ ఉండు అని వేదవతి పండ్ల బుట్ట ఇస్తుంది. హాస్పిటల్ ఖర్చులకు రామరాజు డబ్బు ఇవ్వబోతాడు.
భాగ్యం ఆవేశం
కానీ కోపంగా వచ్చిన భాగ్యం ఆ బుట్టను, డబ్బును విసిరికొడుతుంది. ఏంటి కొత్తగా మా ఇంటికి వచ్చారు. ఊర్లోవాళ్లకు గొప్పలు చెప్పుకోవడానికి వచ్చారు. నాలుగు డబ్బులు, కాయలు ముష్టి వేయడానికి వచ్చారా? అని దొబ్బిపొడిచేలా భాగ్యం మాటలంటుంది. మేమేమీ ముష్టి వేయడానికి రాలేదు. మనసారా కోడలిని చూసి మురిసిపోదామని వచ్చాం. అనవసరంగా గొడవపడకని వేదవతి సీరియస్ గా చెప్తుంది.
రెచ్చగొట్టేలా మాటలు
మనం కోడలిని చూడ్డానికి వచ్చాం. ఈ గొడవలు మనకు వద్దని వేదవతికి రామరాజు చెప్తాడు. కానీ భాగ్యం మాత్రం నానా మాటలు అంటూనే ఉంటుంది. వల్లి వద్దని చెప్పినా కూడా భాగ్యం వినదు. వీళ్లు కొడుకును కాదని ఏం చేయరు? వీళ్లకు కొడుకే ఎక్కువ, నువ్వు కాదు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కాదని భాగ్యం అంటుంది.
నలుగురికి తెలిస్తే నోట్లో ఊస్తారని నాలుగు డబ్బులు పడేయడానికి వచ్చారు. జీవితాంతం నువ్వు ఈ కొంపలోనే పడి ఏడవాలి. కోడలిని ఇంటికి తీసుకెళ్తామని మీ మామతో ఒక్క మాట అనిపించు అని రెచ్చగొట్టేలా భాగ్యం మాట్లాడుతుంది. కానీ రామరాజు, వేదవతి సైలెంట్ గా ఉంటారు. మీ అత్త మాట్లాడటం లేదని భాగ్యం ఇంకా ఎక్కువ చేస్తుంది.
ఇంటికి తీసుకెళ్తామని
అత్తయ్య, మామయ్య నన్ను ఆ ఇంటికి తీసుకెళ్లకపోయినా పర్వాలేదు కానీ వాళ్లను ఒక్క మాట అన్నా ఊరుకోనని తల్లికి వల్లి వార్నింగ్ ఇస్తుంది. కింద పడ్డ డబ్బు, పండ్లను సుక్కు తీస్తుంది. అమ్మా వల్లి నువ్వు ఈ మామయ్యను, అత్తయ్యను నమ్ముతున్నావ్ కదా అని రామరాజు అడుగుతాడు.
నేను, అత్తయ్య, చిన్నోడు, ప్రేమ, నర్మద నీకు తోడుగా ఉంటాం. నువ్వు తప్పులు తెలుసుకున్నావ్. నిన్ను ఎప్పటికైనా మన ఇంటికి తీసుకెళ్లే బాధ్యత మాదేనని వల్లికి రామరాజు ధైర్యం చెప్తాడు. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూసుకో. నిన్ను త్వరలోనే ఇంటికి తీసుకెళ్తామని వేదవతి కూడా చెప్తుంది. రామరాజు, వేదవతి బాధపడుతూ వెళ్లిపోతారు.
వల్లి జీవితం నాశనమైందంటే కారణం నువ్వే అత్తా అని భాగ్యంతో సుక్కు అంటుంది. జుట్టు కట్ చేస్తానని సుక్కు జట్టు పట్టుకుంటుంది భాగ్యం. జన్మలో మీ ఇంటికి రానని సుక్కు పారిపోతుంది. ఆ చందు ఎవరినో ఒకరిని తెచ్చి భార్య అని చెప్తాడు. నా నోటిలో మచ్చలు ఉన్నాయని భాగ్యం చెప్పడంతో వల్లి బాధపడుతుంది.
ధీరజ్ కు అబద్ధం చెప్పిన చందు
గుడిలో జరిగిన విషయం గురించి అటు చందు, ఇటు ధీరజ్ ఆలోచిస్తుంటారు. చందుకు ధీరజ్ కాల్ చేసి ఎక్కడున్నావని అడుగుతాడు. రైస్ మిల్ లో ఉన్నానని చందు అబద్ధం చెప్తాడు. మరి ఇందాక గుడి దగ్గర పిలిస్తే పలకలేదని ధీరజ్ అడుగుతాడు. ఏ గుడి అని చందు అంటాడు. అంజలితో నువ్వు గుడికి రాలేదా అని ధీరజ్ మళ్లీ అడుగుతాడు. అంజలి ఇక్కడ లేదు కదా అని చందు అబద్ధం చెప్పడంతో ధీరజ్ కన్ ఫ్యూజ్ అవుతాడు.
టీనేజీ లవర్స్
రైస్ మిల్ లో ఉన్నట్లుగానే చందు కవర్ చేస్తూ మాట్లాడతాడు. ధీరజ్ కాల్ కట్ చేస్తాడు. ఈ సెన్సిటివ్ మ్యాటర్ ను జాగ్రత్తగా డీల్ చేయాలని ధీరజ్ అనుకుంటాడు. గుడిలో ధీరజ్ మనల్ని చూశాడనే టెన్షన్ తో ఉన్నానని చందు కాఫీ తాగేస్తాడు. ఇలా నవ్వి ఎన్ని రోజులైందో. టీనేజీ లవర్స్ లా మనం బైక్ పై తిరిగేవాళ్లమని అంజలి గుర్తు చేసుకుంటుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper
