Illu Illalu PIllalu October 22 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. వల్లిని ఇంట్లో నుంచి భాగ్యం గెంటేయడంపై రామరాజు ఇంట్లో చర్చ కొనసాగుతుంది. ఆ దొంగల ముఠా పేర్లు వినపడొద్దని చెప్తున్నా నాన్న. ఇక మీదట వాళ్లు మన ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడరని రామరాజుకు చందు చెప్తాడు.
ప్రేమ కాన్ఫిడెంట్

ట్రావెల్స్ ఆఫీస్ వేలం పాటకు వెళ్తున్నావా? అని ధీరజ్ ను రామరాజు అడుగుతాడు. ధీరజ్ చెప్పేందుకు తడబడుతుంటే ప్రేమ మాత్రం కాన్ఫిడెంట్ గా వెళ్తున్నామని చెప్తుంది. ట్రావెల్స్ ఆఫీస్ వదిలేది లేదని ప్రేమ అంటుంది. అత్తాకోడళ్లు వెటకారంగా పంచ్ లు వేసుకుంటారు.
పొదుపుగా పాడతామని
వేలం పాటకు వేదవతి వస్తానంటే ప్రేమ వద్దంటుంది. అప్పుడే నా కొడుకును నాకు దూరం చేస్తున్నావా? అని వేదవతి అడుగుతుంది. నువ్వు వస్తే కొడుకు మీద ప్రేమతో ఎక్కువ రేటుకు పాడుతావ్. కానీ నేను పొదుపుగా ఆచితూచి మాట్లాడతానని ప్రేమ అంటుంది. నర్మద, వేదవతి ఆల్ ది బెస్ట్ చెప్పి ధీరజ్, ప్రేమను పంపిస్తారు.
కత్తి ఎంట్రీ
వేలం పాట జరిగే చోటుకు ధీరజ్, ప్రేమ వెళ్తారు. అన్నీ చూసి రూ.12 లక్షల కంటే ఎక్కువ పాడితే వేస్ట్ అని ప్రేమకు ధీరజ్ చెప్తాడు. అప్పుడే భార్య నగలు అమ్మేసి వేలానికి వచ్చానని కామెడీ చేస్తూ కత్తి వస్తాడు. మా అమ్మకు అరడజను మంది ఆడపిల్లలు పుట్టారు. ఆ తర్వాత కత్తిలాంటి వాడిని పుట్టానని కత్తి అని పేరు పెట్టారని చెప్తాడు.
ప్రేమ కంగారు
ట్రావెల్స్ ఆఫీస్ కోసం వేలం పాట మొదలవుతుంది. ధీరజ్ పాడిన వేలానికి కత్తి ఒక్క రూపాయి యాడ్ చేస్తూ వెళ్తాడు. ధీరజ్ ఏకంగా రూ.14 లక్షలు అనేసరికి అందరూ షాక్ అవుతారు. అమౌంట్ అడ్జెస్ట్ అవుతాయా అని ప్రేమ కంగారుగా అడుగుతుంది. అంతా తాను చూసుకుంటానని ధీరజ్ చెప్తాడు.
అవమానించిన భద్రావతి
{{/usCountry}}ట్రావెల్స్ ఆఫీస్ కోసం వేలం పాట మొదలవుతుంది. ధీరజ్ పాడిన వేలానికి కత్తి ఒక్క రూపాయి యాడ్ చేస్తూ వెళ్తాడు. ధీరజ్ ఏకంగా రూ.14 లక్షలు అనేసరికి అందరూ షాక్ అవుతారు. అమౌంట్ అడ్జెస్ట్ అవుతాయా అని ప్రేమ కంగారుగా అడుగుతుంది. అంతా తాను చూసుకుంటానని ధీరజ్ చెప్తాడు.
అవమానించిన భద్రావతి
{{/usCountry}}ధీరజ్ పాట రూ.14 లక్షలు మూడోసారి అని వేలం నిర్వాహకులు అనబోతుండగా రూ.20 లక్షలు అని భద్రావతి షాకింగ్ ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూసి ధీరజ్, ప్రేమ వెళ్లిపోతారు. ధీరజ్ ను భద్రావతి అవమానించేలా మాట్లాడుతుంది. కోటలోని యువరాణి పల్లకిని మోసేవాడిని పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది ప్రేమ అని భద్రావతి అంటుంది.
ప్రేమ పంతం
అవును, నేను పల్లకిని మోసేవాడిని. భార్యను నెత్తిన, గుండెల్లో పెట్టుకొని మోసేవాడినే అని ధీరజ్ కౌంటర్ వేస్తాడు. ప్రేమను తీసుకొని వెళ్దామంటాడు. కానీ ప్రేమ ఏమో రూ.21 లక్షలు అంటుంది. నా మొగుడు తగ్గకూడదని ధీరజ్ ను తీసుకొని వెళ్లి ప్రేమ కుర్చీలో కూర్చుంటుంది. భద్రావతి రూ.22 లక్షలంటుంది. ప్రేమ రూ.23 లక్షలకు పెంచుతుంది. ధీరజ్ వెళ్లిపోదామని చెప్పినా ప్రేమ వినదు.
కత్తి కమీషన్
కత్తిని పిలిచి ధీరజ్ ఎంత అమౌంట్ తెచ్చావని అడుగుతాడు. తన సూట్ కేసులో ఉన్న రూపాయిని చూపించి కత్తి షాక్ ఇస్తాడు. వేలం పాట పాడేవాళ్లు మమ్మల్ని పాట పెంచేందుకు పెట్టుకుంటారు. వాళ్లు అనుకున్న దానికంటే ఎక్కువ రేట్ వస్తే మాకు కమీషన్ ఇస్తారని కత్తి చెప్తాడు.
గెలిచిన ప్రేమ కానీ
ఇక భద్రావతి ఏమో రూ.25 లక్షలు అని అంటుంది. ప్రేమ, భద్రావతి పోటాపోటీగా వేలం పాట పాడతారు. ప్రేమ మాట్లాడకుండా ధీరజ్ నోరు మూస్తాడు. ప్రేమ పాట 30 లక్షల ఒక్క రూపాయి అని కత్తి చెప్తాడు. అవును అని ప్రేమ అంటుంది.
చివరకు వేలంలో ప్రేమ గెలుస్తుంది. ధీరజ్ మనం గెలిచాం రా అని ధీరజ్ కలర్ ఎగరేస్తుంది ప్రేమ. చెప్పినట్లే నా భర్తను గెలిపించానని అత్తకు కౌంటర్ వేస్తుంది. కానీ ఎక్కువ రేటుకు పాడించి దెబ్బ కొట్టానన్నట్లు భద్రావతి సైకోలా నవ్వుతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.