Illu Illalu Pillalu September 16 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-తిరుపతి ఫస్ట్ నైట్ ఆశ-బల్లక్కాయ్ ను బాదేసిన అత్త-ఆధారాలు

Illu Illalu Pillalu September 16 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే సెప్టెంబర్ 16 ఎపిసోడ్ లో తిరుపతి ఫస్ట్ నైట్ ఆశలను భాగ్యం ఆవిరి చేస్తుంది. మరోవైపు బల్లక్కాయ్ ను వేదవతి చితకబాదుతుంది. స్మిత్ నుంచి కాల్ రావడంతో నర్మద హ్యాపీగా ఫీల్ అవుతుంది. వల్లి ప్రూఫ్స్ అన్ని దొరికాయని స్మిత చెప్తుంది.

Published on: Sep 16, 2026, 07:31:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu September 16 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ప్రేమను ధీరజ్ దగ్గరకు వెళ్లనివ్వకుండా భద్రావతి, సేనాపతి కుట్రలు పన్నుతారు. వాళ్లు కలిసే అవకాశాన్ని ఆవిరి చేయాలి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా చేయాలి. ధీరజ్ కు ఈగో ఎక్కువ. అది టార్గెట్ చేస్తే చాలు అని భద్రావతి చెప్తుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

తిరుపతి ఫస్ట్ నైట్

మరోవైపు తలకు, చేతులకు మల్లెపూలు చుట్టుకుని ఫస్ట్ నైట్ కు తిరుపతి రెడీ అయిపోతాడు. సుక్కు ఏమో నిరాశగా వచ్చి ఏడుస్తుంది. ఏదైనా సరే అందరి సమక్షంలోనే జరగాలని అంటున్నారు. అందరూ ఒప్పుకొన్న తర్వాతే ఈ తంతు జరగాలంటున్నారు. నా మీద నీకు ప్రేమ ఉంటే మీ వాళ్లను ఒప్పించు అని సుక్కు చెప్పి వెళ్లిపోతుంది.

తల్లికి జాగ్రత్తలు

అప్పుడే భాగ్యానికి శ్రీవల్లి ఫోన్ చేస్తుంది. అక్కడ, ఇక్కడ పరిస్థితి ఎలా ఉందని ఒకరినొకరు అడుక్కుంటారు. తిరుపతికి వచ్చే వాటాను లాగేయొచ్చని బోల్డన్ని కలలు కన్నాం. కానీ మా ఇంట్లో పడేశారంటే బాబూ అని భాగ్యం నిరాశ పడుతుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా అది జరుగుతుంది. భద్రావతి కోపం తగ్గేదాకా జాగ్రత్తగా ఉండండని తల్లికి బల్లక్కాయ్ చెప్తుంది.

వేదవతిని చూసి షాక్

సుక్కుకు, తింగరి తిరుపతికి పెళ్లి చేసేశానంటూ ఎగురుతూ తన గదిలోకి వెళ్తుంది వల్లి. అక్కడ బెడ్ మీద సీరియస్ గా కూర్చున్న వేదవతిని చూసి షాక్ అవుతుంది. అమ్మకు నీతో ఏదో పర్సనల్ పని ఉందంటా అని చాప, దిండు తీసుకొని చందు బయటకు వెళ్లిపోయి గడియ పెడతాడు.

వేదవతిని చూసి బల్లక్కాయ్ భయపడుతుంది. సుక్కు, తిరుపతి పెళ్లికి నాకు సంబంధం లేదండి. నేను అమాయకురాలిని అని వల్లి చెప్తుంది. అసలు సుకన్యను ఈ ఇంటికి తీసుకొచ్చింది నువ్వే కదా అని సీరియస్ టోన్ తో వేదవతి అడుగుతుంది. పాత తప్పుల కింద వదిలేయండని వల్లి రిక్వెస్ట్ చేస్తుంది. సరే ఏం అనను కానీ ఇక్కడే పడుకుంటా లైట్ ఆఫ్ చేయమని వేదవతి చెప్తుంది.

బాదేసిన అత్త

వల్లి లైట్ ఆఫ్ చేయగానే వేదవతి ఆమెను చితక్కొడుతుంది. కానీ లైట్ ఆన్ చేయగానే వేదవతి సేమ్ పొజిషన్ లో ఉంటుంది. లైట్ ఆఫ్ చేశాక మళ్లీ బాదుతుంది. లైట్ ఆఫ్ చేశాక నన్ను కొడుతున్నారు. ఇది చీటింగ్ అత్తయ్య అని నొప్పులతో బల్లక్కాయ్ మూలుగుతుంది. ఓ తెలిసిపోయిందా అని వేదవతి నవ్వేస్తుంది.

ఫ్రూప్స్ తో స్మిత కాల్

ఉదయం నర్మదకు స్మిత కాల్ చేస్తుంది. వల్లి గురించి, వాళ్ల ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయించా. ప్రూఫ్స్ అన్ని పక్కాగా ఉన్నాయి. వచ్చి తీసుకెళ్లు అని స్మిత చెప్పడంతో నర్మద సంబరపడుతుంది. అయితే అర్జెంట్ గా వెళ్లాలని నర్మద చెప్తున్నా సాగర్ అడ్డుకుంటాడు. మొగుడికి ఇవ్వాల్సిన మామూలు ఇచ్చి బయటకు వెళ్లమని సాగర్ అడుగుతాడు. సాగర్ ను కళ్లు మూసుకోమని చెప్పిన నర్మద గిల్లేసి వెళ్లిపోతుంది.

మాస్ వార్నింగ్

బయట బల్లక్కాయ్ కు నర్మద మాస్ వార్నింగ్ ఇస్తుంది. నీ పని మీదే వెళ్తున్నా. వచ్చిన తర్వాత ఏంటనేది నీకే తెలుస్తుంది కదా అని నర్మద వెళ్తుంది. ఇక ధీరజ్ ఏమో కారు క్లీన్ చేసేందుకు వచ్చి అద్దంపై ‘ధీమా’ అని రాసి లవ్ సింబల్ వేస్తాడు. అది ప్రేమ చూసి ఫీల్ అవుతుంది. బయటకు కనిపించిన కోపం వెనుక కనిపించని ప్రేమ ఉందని ప్రేమ అనుకుంటుంది.

అప్పుడే ప్రేమను చూసి స్మైల్ ఇస్తాడు ధీరజ్. కానీ మనసు ముక్కలయ్యేలా ప్రేమ అన్న మాటలు గుర్తు రావడంతో ప్రేమ పేరును చెరిపేస్తాడు. దీంతో మళ్లీ ధీరజ్, ప్రేమ మధ్య మాటల తగాదా మొదలవుతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More