...
...
Next Story

Illu Illalu Pillalu September 18 Episode:ఇల్లు ఇల్లాలు పిల్లలు-సేనాపతిని చితకబాదిన ధీరజ్, రామరాజు-పోలీస్ స్టేషన్ లో గొడవ

Illu Illalu Pillalu September 18 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే సెప్టెంబర్ 18 ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ప్రేమకు పెళ్లి చూపులు అరెంజ్ చేశారని సేనాపతిని ధీరజ్, రామరాజు కొడతారు. రెండు ఫ్యామిలీలు పోలీస్ స్టేషన్ కు వెళ్తాయి. చివరకు భద్రావతి ప్లాన్ వేస్తుంది.

Published on: Sep 18, 2026, 08:08:12 IST
Advertisement

Illu Illalu Pillalu September 18 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. కోపంతో ఊగిపోతున్న ధీరజ్ ఏకంగా భద్రావతిపైకి చేయి ఎత్తుతాడు. పెళ్లి చూపుల కోసం వచ్చిన వాళ్లను బయటకు వెళ్లమంటాడు. ప్రేమను కూడా కొడతానంటాడు. పెళ్లి చేసుకుంటావా? అని ప్రేమను అడుగుతాడు.

ధీరజ్ ను లాక్కెళ్లిన ప్రేమ

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

ప్రేమకు పెళ్లి చూపులు అని ధీరజ్ అపార్థం చేసుకుంటాడు. ఇంకొక్క క్షణం నువ్వు మా ఇంట్లో ఉన్నావంటే బాగుండదని ధీరజ్ చొక్కా పట్టుకొని ప్రేమ లాక్కెళ్తుంది. అది చూసి శ్రీవల్లి సైకో ఆనందంతో సంబరపడుతుంది. రామరాజు, వేదవతిని పిలిచి ఆ దారుణం చూడండని చూపిస్తుంది.ఆ సీన్ చూసి వేదవతి, రామరాజు షాక్ అవుతారు.

కోడలికి పెళ్లిచూపులు

మా ఇంటికి వచ్చి బంధువుల ముందు మా వాళ్ల పరువు తీశాడు. నా మీదమీదకు వచ్చాడు. మా నాన్నను కొట్టాడు. మా అత్తను కొట్టబోయాడు. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందర చేసి సైకోలా ప్రవర్తించాడని ప్రేమ చెప్తుంది. ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్లావురా అని ధీరజ్ ను రామరాజు అడుగుతాడు. నీ కోడలికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని ధీరజ్ అంటాడు.

చితకబాదిన రామరాజు

ఆ మాట విని రామరాజు కూడా సీరియస్ అవుతాడు. నా కోడలికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తావా? అని సేనాపతిని రామరాజు చితకబాదుతాడు. ఏంటి మామయ్య? మీరు కూడా చెప్పింది వినకుండా ఆవేశపడుతున్నారని ప్రేమ అంటుంది. కానీ ధీరజ్ వినిపించకుండా ప్రేమ, సేనాపతిని కొడతాడు. గొడవను ఆపిన భద్రావతి ఏమో.. మీ అందరినీ పోలీసు స్టేషన్ కు పంపిస్తామని వార్నింగ్ ఇస్తుంది. మేమే పోలీసులను పిలుస్తామని ధీరజ్, రామరాజు అంటారు.

నర్మద మిస్టరీ

సీన్ పోలీస్ స్టేషన్ కు మారుతుంది. అక్కడ ఒకరిపై ఒకరు పోలీసులకు కంప్లైంట్స్ ఇచ్చుకుంటారు. పాతికేళ్ల గొడవ నుంచి మొదలుపెట్టారు సార్. అన్నీ రాస్తుంటే చేతులు నొప్పి పెడుతున్నాయని కానిస్టేబుల్ చెప్తాడు. అప్పుడే నర్మద వచ్చి ఏమైందని అడిగితే ఎవరూ చెప్పరు. చివరకు ఎస్ఐ కుటుంబరావును ఏం జరిగిందని నర్మద అడుగుతుంది.

నాకు మాత్రం ఏం తెలుసు? కంప్లైంట్స్ పేజీలకు పేజీలు ఇస్తున్నారు. చివరకు జరిగిన విషయం మొత్తాన్ని చందు చెప్తాడు. ప్రేమ నీకు పెళ్లి చూపులు ఏంటీ? అని నర్మద అడుగుతుంది. అసలు నాకు పెళ్లి చూపులు ఏంటీ? చెప్పే అవకాశం ఇస్తే కదా. వచ్చి రాగానే కొట్టడం తప్పా ఆలోచించలేదు. ధీరజ్ సెన్స్ లేకుండా బిహేవ్ చేశాడని ప్రేమ చెప్తుంది.

పేజీలకు పేజీలు

చిన్న కన్ఫ్యూజన్ కారణంగా కంప్లైంట్స్ ఇస్తే ఫ్యామిలీని పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తారా అని ఎస్ఐని నర్మద అడుగుతుంది. మీ వాళ్లే కంప్లైంట్ ఇచ్చారని కుటుంబరావు చెప్తాడు. ముందు నా కంప్లైంట్ అంటే నా కంప్లైంట్ అని వేదవతి, భద్రావతి గొడవపడతారు. పేజీలకు పేజీలు ఉన్న ఆ కంప్లైంట్స్ ను చూసి ఎస్ఐ తలపట్టుకుంటాడు.

ఇక స్టేషన్లో మళ్లీ రెండు ఫ్యామిలీలు గొడవ పెట్టుకుంటాయి. ముందు వీళ్లను అరెస్టు చేయాలంటే వీళ్లను అరెస్టు చేయాలని గొడవపడతారు. మీరు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం రెండు కుటుంబాల వాళ్లను అరెస్టు చేయాలి. అలా చేస్తే అందరూ సంవత్సరాలు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగాలి. కనీసం అయిదేళ్లు జైల్లో ఉండాలి. కానీ ఈ కుటుంబరావు ఏదో ఒకటి చేసి బంధాలను కలుపుతాడు తప్పా విడగొట్టడు అని ఎస్ఐ చెప్తాడు.

భద్రావతి ప్లాన్

మీరు బయటకు వెళ్లి మనసు విప్పుకొని మాట్లాడుకొని ఫైనల్ గా నా దగ్గరకు రండి అని ఎస్ఐ చెప్తాడు. దీంతో రెండు ఫ్యామిలీలు బయటకు వెళ్తాయి. ప్రేమకు పెళ్లిచూపులని ధీరజ్ కన్ఫ్యూజ్ అయ్యాడు. అందుకే గొడవ పెట్టుకున్నాడని సేనాపతికి కొడుకు, భార్య చెప్తారు. విశ్వ కేసు విషయంలోనే కోర్టుల చుట్టూ తిరిగాం. ఇప్పుడు మళ్లీ అవసరమా? అని రేవతి అంటుంది.

కేసు వెనక్కి తీసుకుందామని విశ్వ అంటాడు. కానీ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ప్రేమ. ధీరజ్ మరోసారి అవమానిస్తే ధీరజ్ దగ్గరకు వెళ్లవని మాట ఇచ్చిందని భద్రావతి గుర్తు చేస్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks