...
...
Next Story

Illu Illalu Pillalu September 1 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. అత్తను ఇరికించిన బల్లక్కాయ్-ప్రేమ, ధీరజ్ పేపర్ రాయబారం

Illu Illalu Pillalu September 1 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే సెప్టెంబర్ 1 ఎపిసోడ్ లో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. వేదవతిని బల్లక్కాయ్ ఇరికిస్తుంది. భద్రావతి మొసలి కన్నీరుతో డ్రామా ఆడుతుంది. ప్రేమ, ధీరజ్ పేపర్ల రాయబారం చేసుకుంటారు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

Published on: Sep 1, 2026, 08:05:28 IST
Advertisement

Illu Illalu Pillalu September 1 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. నాన్నలాగా నువ్వు కూడా మాట జారడం ఏంటమ్మా? నీ తమ్ముడిని దొంగ అన్నావని వేదవతిని మాటలంటాడు సాగర్. మధ్యలో ఆపండి అంటూ శ్రీవల్లి ఎంట్రీ ఇస్తుంది.

శ్రీవల్లి డ్రామా

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

వేదవతికి సపోర్ట్ గా శ్రీవల్లి మాట్లాడుతుంది. ఇన్ని రోజులూ అత్తయ్య తన తమ్ముడిని ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఇప్పుడు డబ్బు తీసుకున్నాడని అన్నారంటే ఏదో ఒక బలమైన కారణం లేకుండా ఉంటుందా? ఎంతసేపు మాట జారారని అంటున్నారు కానీ ఆలోచిస్తున్నారా? అని వల్లి తన అత్తను ఇరికిస్తుంది.

ఆ కారణం ఏంటీ? అని అమ్మను చందు, ధీరజ్ అడుగుతారు. కానీ వేదవతి సైలెంట్ గా ఉంటుంది. అత్తయ్య సైలెంట్ గా ఉన్నారంటే ఏదో బలమైన కారణం ఉంటుంది. మీరు గుచ్చిగుచ్చి అడగొద్దని వల్లి డ్రామా ఆడుతుంది. ఆ కారణం ఏంటో తెలుసుకుందామనే అడుగుతున్నాం. అత్తయ్యను మేం అర్థం చేసుకోవడం లేదు అన్నట్లుగా పుల్లలు పెట్టకు అని నర్మద అంటుంది.

వేదవతి కన్నీళ్లు

ఇంకా ఆపండి. నోరు విప్పి మాట్లాడాల్సిన మనిషి మౌనంగా ఉంటే ఏం చేస్తాం? రహస్యాలు దాచిపెట్టడం అలవాటైందని తన భార్యపై రామరాజు కోప్పడతాడు. వెంటనే వేదవతి బాధతో రగిలిపోతూ మాట్లాడుతుంది. అందరూ నన్నే అనండి. నన్ను అర్థం చేసుకోనివాళ్లు ఎవరూ నాతో మాట్లాడొద్దని ఏడుస్తూ వేదవతి లోపలికి వెళ్లిపోతుంది.

శారదాంబ నిజాలు

చూశావా ప్రేమ? నేను నిన్ను నీ మొగుడికి దూరం చేశానంటా. ఆ రోజు ధీరజ్ గాడు అందరిముందు కళ్యాణ్ తో లేచిపోయావని జీవితం ఇచ్చానన్నాడని మళ్లీ కళ్యాణ్ టాపిక్ తీసుకొస్తుంది భద్రావతి. పాతికేళ్లుగా వీడు రైస్ మిల్ లో పనోడిలా పని చేస్తే.. చివరకు మీ అత్త రూ.6 లక్షలు కొట్టేశాడని నింద వేసిందని భద్రావతి చెప్పగానే ప్రేమ షాక్ అవుతుంది.

బాబాయ్.. అత్త చెప్పేది నిజమా? అని తిరుపతిని ప్రేమ అడుగుతుంది. ఆ రోజు నిన్ను అవమానించారు. ఈ రోజు వీడిని దొంగ అని తరిమేసింది వాళ్లే. వాళ్లపై పగ తీర్చుకోవడానికి నేను తీసుకొచ్చానా? ఆ పాపం తెలియని నన్ను పట్టుకొని నిందలు వేస్తే ఎంత బాధగా ఉంటుందో చెప్పమని భద్రావతి మొసలి కన్నీరు కారుస్తుంది.

తిరుపతికి పెళ్లి చూపులు

కుటుంబం అన్నాక చిన్న గొడవలు సహజం. కలిసిపోయేలా చెప్పాలి కానీ విడగొడతారా? అని రేవతి ప్రశ్నిస్తుంది. కానీ భద్రావతి ఏమో తిరుపతిలో విషం నాటాలని చూస్తుంది. వాళ్ల గురించి వదిలేయ్. నీ కోసం ఈ అక్క ఉంది. ఈ అక్క నీ జీవితాన్ని ఆనందంగా మారుస్తుంది. రేపే నీకు పెళ్లి చూపులు అని తిరుపతికి భద్రావతి చెప్తుంది.

విశ్వతో అమూల్య

రాత్రి అమూల్యతో విశ్వ సీక్రెట్ గా మాట్లాడతాడు. మా చెల్లి, మీ అన్నయ్య విషయంలోనే చాలా గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు తిరుపతి మామయ్యపై దొంగతనం నింద వేయడం ఏంటీ? అని విశ్వ అడుగుతాడు. అప్పుడే బయటకు వచ్చిన ధీరజ్ ను చూసి అమూల్య భయపడుతుంది.

పేపర్ల రాయబారం

ధీరజ్, ప్రేమ ఒకరినొకరు చూసుకుంటారు. కానీ అనుకున్న మాటలను గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతారు. ఇదంతా దొంగచాటుగా విశ్వ, అమూల్య చూస్తుంటారు. వాళ్ల మనసులో మాట్లాడుకోవాలని అనుకుంటున్నాయి. కానీ ఇగో అడ్డుపడుతుందని విశ్వకు అమూల్య చెప్తుంది. అందుకే ప్రేమ దగ్గర పేపర్లు, పెన్నులు పెట్టా. అక్షరాలు రాయబారం చేస్తాయని విశ్వ అంటాడు.

మా బాబాయి మీద దొంగతనం నింద వేస్తారా? అని రాసి ధీరజ్ పైకి విసురుతుంది ప్రేమ. మాట వరుసకు మా అమ్మ అడిగింది. మీ కాంచత్త చెడగొట్టి తీసుకెళ్లిపోయింది. అప్పుడు నువ్వు, ఇప్పుడు మీ బాబాయి మీ ఊసరవెళ్లి అత్త వెనుకాల తోక ఊపుకుంటూ వెళ్లిపోయారు కదా అని ధీరజ్ రాసి తిరిగి విసిరేస్తాడు.

ఇలా పేపర్లతో మళ్లీ ఒకరిపై ఒకరు మాటలు అనుకుంటూనే ఉంటారు. మర్యాదగా మా మామను పంపిస్తారా? వచ్చి తీసుకురావాలా? అని ధీరజ్ రాసి పంపిస్తాడు. నీకు అంత ధైర్యం ఉంటే వచ్చి నన్ను, బాబాయిని తీసుకెళ్లురా అని ప్రేమ రిప్లే ఇస్తుంది. అప్పుడే అర్జెంట్ గా వెళ్లాలని ధీరజ్ ను సాగర్ బైక్ పై ఎక్కించుకొని వెళ్తాడు.

నర్మద ట్విస్ట్

నీ ప్లాన్ లన్నీ నీలాగే బండగా ఉంటాయిరా బండ సచ్చినోడా? అని విశ్వను తిట్టి అమూల్య లోపలికి వెళ్తుంది. ఇంట్లో నర్మదను చూసి అమూల్య షాక్ అవుతుంది. ఎక్కడికి వెళ్లావని నర్మద అడుగుతుంది. ఫ్రెండ్ కాల్ చేస్తే బయటకు వెళ్లానని అమూల్య అబద్ధం చెప్తుంది. మధ్యాహ్నం ఐస్ క్రీమ్ పార్లర్ లో చూశానని నర్మద ట్విస్ట్ ఇస్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe