Illu Illalu Pillalu September 29 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. శ్రీవల్లి, ఇడ్లీ బాబాయ్, భాగ్యం కలిసి ప్రేమ అనుకొని చింతామణిని కిడ్నాప్ చేస్తారు. చింతామణికి మెళకువ వస్తుంది. రూ.6 లక్షలు ఇచ్చినట్లే ఇచ్చి నా ఇంటికి దొంగతనానికి వస్తారా అని చింతామణి ఊగిపోతుంది.
రూ.6 లక్షల నిజం

ఈ మాటలు విన్న నర్మద షాక్ అవుతుంది. ప్రేమను కిడ్నాప్ చేసి తీసుకెళ్లడానికి వచ్చామని బల్లక్కాయ్ మత్తులో వాగుతుంది. రూ.6 లక్షలు రైస్ మిల్ లో కొట్టేసి చింతామణికి ఇచ్చారా? ఆ నింద పాపం తిరుపతి బాబాయ్ పై వేశారు అని నర్మద అనుకుంటుంది. మీ లెక్కలు తర్వాత తేలుస్తానని నర్మద అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
భద్రావతి పొగరు
నర్మద కార్లో వెళ్తుంటే శ్రీవల్లి పరుగెత్తుకుంటూ వెళ్లి ఎక్కుతుంది. ఇడ్లీ బాబాయ్, భాగ్యాన్ని చింతామణి చితక్కొడుతుంది. మరోవైపు భద్రావతి, సేనాపతి ఏమో ఇంట్లో కన్నింగ్ గా మాట్లాడుకుంటారు. అప్పుడు నా చెల్లెలు గురించి, ఇప్పుడు నా మేనకోడలి గురించి ఎంతలా ఏడ్చానో నాకు తెలుసురా అని తమ్ముడితో భద్రావతి అంటుంది.
ప్రేమ, ధీరజ్ ల పెళ్లి చేస్తానని ఛాలెంజ్ చేసిన రామరాజు ఓడిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే ఉన్నాయక్కా. ప్రేమ మన ఇంటికి శాశ్వతంగా వచ్చేయడమే కాదక్కా. ఆ రామరాజు మన ముందు తలదించుకొని బతుకుతాడని సేనాపతి అంటారు. అప్పుడే చింతామణి మనుషులు కాల్ చేసి ప్రేమను పెళ్లి మంటపానికి తీసుకెళ్లారని చెప్పడంతో భద్రావతి, సేనాపతి కోపంతో బయల్దేరతారు.
షాకిచ్చిన ప్రేమ
ఇటు పెళ్లి మంటపంలో ప్రేమ కూర్చునే ఉంటుంది. నువ్వు పెళ్లి కూతురివి, ముందు రెడీ కావాలని వేదవతి, రేవతి సహా ఎవరేం చెప్పినా ప్రేమ పట్టించుకోదు. నీకేమైనా పిచ్చా, వెర్రా నోరు తెరిచి మాట్లాడు అని వేదవతి సీరియస్ అవుతుంది. నేను ఈ పెళ్లి చేసుకోనని ప్రేమ మళ్లీ షాక్ ఇస్తుంది.
{{/usCountry}}ఇటు పెళ్లి మంటపంలో ప్రేమ కూర్చునే ఉంటుంది. నువ్వు పెళ్లి కూతురివి, ముందు రెడీ కావాలని వేదవతి, రేవతి సహా ఎవరేం చెప్పినా ప్రేమ పట్టించుకోదు. నీకేమైనా పిచ్చా, వెర్రా నోరు తెరిచి మాట్లాడు అని వేదవతి సీరియస్ అవుతుంది. నేను ఈ పెళ్లి చేసుకోనని ప్రేమ మళ్లీ షాక్ ఇస్తుంది.
{{/usCountry}}పెళ్లి చేసుకోని దానివి ఇక్కడికి ఎందుకు వచ్చావ్? భోజనం కోసం వచ్చావా? అని వేదవతి కోపంగా అడుగుతుంది. ధీరజ్ కోసం వచ్చానని ప్రేమ చెప్తుంది. నా ఆడపడుచు కట్నం కోసం నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండకు అని కామాక్షి మధ్యలోకి వచ్చి కామెడీ చేస్తుంది.
ధీరజ్ కోసం
నేను పెళ్లి మంటపానికి రాకపోతే జీవితంలో వాడి ముఖం చూపించలేనని అన్నాడు. వాడి ముఖం చూడకుండా నేను ఉండలేనని ప్రేమ ఫీల్ అవుతుంది. ఎంత చక్కగా చెప్పావో. జీవితాంతం ఇలాగే కుర్చీలో వాడిని చూస్తూ కూర్చుంటావా? ఓసేయ్ తింగరదానా? నీక్కూడా నాలాగే బుర్ర లేదని నిరూపించావ్. వాడి ముఖం చూడలేవు. అలాగే పెళ్లి చేసుకోవని వేదవతి అంటుంది.
రామరాజు ట్విస్ట్
అప్పుడే నర్మద వచ్చి ప్రేమను ఎందుకు రెడీ చేయలేదని అడుగుతుంది. ప్రేమ ఏదేదో మాట్లాడి మాకు మెంటల్ తెప్పిస్తుందని వేదవతి చెప్తుంది. నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నావ్. నీ భ్రమను నేను తొలగిస్తానని ప్రేమను పట్టుకుంటుంది నర్మద. అప్పుడే ఈ పెళ్లి జరగదని రామరాజు ట్విస్ట్ ఇస్తాడు.
మూడు ముళ్లతో బంధం ముడిపడాలంటే ముందు మనసులు ముడిపడాలి. ఒకసారి నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది. ఇప్పుడు ఇష్టం ఉంటేనే పెళ్లి జరుగుతుందని రామరాజు అంటాడు. వాళ్ల మనసులో ప్రేమ ఉందని అనుకున్నా. కానీ బలవంతంగా పెళ్లి వద్దని మళ్లీ అదే మాట చెప్తాడు. ధీరజ్ కూడా అదే అంటాడు.
మూర్ఖంగా ప్రేమ
కానీ నర్మద ఏమో ప్రేమను పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతుంది. నువ్వు చాలా చైల్డిష్ గా బిహేవ్ చేస్తున్నావ్ తెలుసా. ధీరజ్ నిన్ను వద్దనుకుంటే ఎప్పటికీ కలుసుకోలేనంత దూరం పెరుగుతుంది. ముందు పెళ్లి చీర కట్టుకొని రెడీ అవ్వు అని నర్మద చెప్తుంది. కానీ రెడీ అవ్వనని ప్రేమ మూర్ఖంగానే ప్రవర్తిస్తుంది.
ధీరజ్ గురించి మా వాళ్లకు చాలా గొప్పగా చెప్పా. ధీరజ్ మా వాళ్ల పరువు తీస్తే అతని జీవితంలోకి వెళ్లనని మా అత్తకు మాటిచ్చా. నేను ఆ మాటను తప్పలేను కదా. ధీరజ్ నా ప్రాణం, సర్వస్వం అనుకుంటే అందరి ముందు తల దించుకునేలా చేశాడు. అప్పుడు కన్నీళ్లు తుడిచి భరోసా ఇచ్చింది మా వాళ్లే కదా అని ప్రేమ అంటుంది.
విడిపోవడానికి కారణం మీ అత్త
అసలు ధీరజ్, నువ్వు విడిపోవడానికి కారణమే మీ అత్త. కుట్ర చేసిందే మీ అత్త. ధీరజ్ నోరు జారేలా రెచ్చగొట్టింది మీ అత్త. మోపిదేవి రమ్మని ఆ ఎస్ఐ ఫోన్ చేయడం అంతా నాటకం అని వీడియోను చూపిస్తుంది నర్మద. అది చూసి ప్రేమ షాక్ అవుతుంది. అసలు సూత్రధారి వల్లినే, ఆ ప్లాన్ కు భద్రావతిని ఆయుధంగా వాడుకుందని ప్రేమకు అర్థమయ్యేలా నర్మద చెప్తుంది.
నర్మద మాటలతో ప్రేమ మనసు మార్చుకుంటుంది. పెళ్లి చీర కట్టుకొని రెడీ అవుతుంది. దీంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నర్మదను వేదవతి, రామరాజు తెగ పొగిడేస్తారు. నర్మద మరోసారి ట్రబుల్ షూటర్ అని ప్రూవ్ చేసుకుంటుంది. అప్పుడే భద్రావతి, సేనాపతి వస్తారు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.