Illu Illalu Pillalu September 30 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ప్రేమను పెళ్లికి ఒప్పించిన నర్మదపై రామరాజు పొగడ్తలు కురిపిస్తాడు. ధీరజ్, ప్రేమను చూసి పొంగిపోతాడు. వీళ్లు పెళ్లికి రెడీ అవుతుండగా రేయ్ రామరాజు అంటూ భద్రావతి, సేనాపతి ఆవేశంగా వస్తారు.
భద్రావతి ఆవేశం

నా మేనకోడలిని మాయ చేసి తీసుకొస్తావా? సిగ్గు అనిపించడం లేదా? అని రామరాజును భద్రావతి అడుగుతుంది. ప్రేమ తనంతట తానే వచ్చిందని రామరాజు చెప్తాడు. ఇక సేనాపతి ఏమో రామరాజు కాలర్ పట్టుకుంటాడు. అయినా కూడా రామరాజు కూల్ గానే మాట్లాడతాడు.
వేదవతి ఫైర్
నా కోడలు మనస్ఫూర్తిగా ఒప్పుకొనే వచ్చింది. తన ఇష్టపూర్వకంగానే పెళ్లి జరుగుతుంది. గొడవ చేయొద్దని రామరాజు అంటాడు. ప్రేమ ఇంతలోనే పెళ్లికి ఎలా ఒప్పుకుంది? మీరే మనసు మార్చారని భద్రావతి అరుస్తుంది. ప్రేమ తనంతట తనే వచ్చిందని చెప్తే వినిపించుకోవా? అని వేదవతి ఫైర్ అవుతుంది.
షాకిచ్చిన ప్రేమ
ఛాలెంజ్ చేస్తే మగాడిలా గెలవాలి కానీ ఏం బతుకు నీది అని సేనాపతి నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు. నేను నా ఇష్టపూర్వకంగానే వచ్చా. ఇందులో మామయ్య ప్రమేయం లేదు. అనవసరంగా ఆయన్ని మాటలనకండని ప్రేమ గట్టి కౌంటర్ ఇస్తుంది. ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి వెళ్లండని ప్రేమ చెప్పేసరికి భద్రావతి, సేనాపతి షాక్ అవుతారు.
నటించకు అత్త
ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. మర్యాదగా వెళ్లిపోండని ప్రేమ వార్నింగ్ ఇస్తుంది. వీళ్లు మాయ చేశారు. మా మీద ద్వేషాన్ని నూరిపోశారని భద్రావతి మళ్లీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు ట్రై చేస్తుంది. మొసలి కన్నీళ్లు కారుస్తుంది. నటించకు అత్త. నువ్వేం చేశావో నాకు తెలిసిపోయాయి. నేను నిన్ను అమ్మలా చూశా. నువ్వు చెప్పిన ప్రతి మాటను నమ్మా. కానీ ఆ మాటల వెనుక ఉన్న నీ నిజస్వరూపం ఏంటో తెలుసుకున్నానని ప్రేమ ట్విస్ట్ ఇస్తుంది.
కన్యాదానం ఎవరు చేస్తారు?
{{/usCountry}}ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. మర్యాదగా వెళ్లిపోండని ప్రేమ వార్నింగ్ ఇస్తుంది. వీళ్లు మాయ చేశారు. మా మీద ద్వేషాన్ని నూరిపోశారని భద్రావతి మళ్లీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు ట్రై చేస్తుంది. మొసలి కన్నీళ్లు కారుస్తుంది. నటించకు అత్త. నువ్వేం చేశావో నాకు తెలిసిపోయాయి. నేను నిన్ను అమ్మలా చూశా. నువ్వు చెప్పిన ప్రతి మాటను నమ్మా. కానీ ఆ మాటల వెనుక ఉన్న నీ నిజస్వరూపం ఏంటో తెలుసుకున్నానని ప్రేమ ట్విస్ట్ ఇస్తుంది.
కన్యాదానం ఎవరు చేస్తారు?
{{/usCountry}}నిన్ను ఇప్పటికీ అమ్మలాగే చూస్తున్నా. అందుకే అందరి ముందు నీ గురించి చెప్పి పరువు తీయలేనత్తా. దయచేసి వెళ్లిపో అని ప్రేమ రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు చేసిన ఛాలెంజ్ లో గెలిచానని అనుకుంటున్నావేమో. కానీ అమ్మాయి కన్నవాళ్లు అబ్బాయి కాళ్లు కడగాలి. అప్పుడే కన్నకూతురిని అల్లుడి చేతుల్లో పెట్టినట్లు. ఈ పెళ్లి మంటపంలో శాస్త్ర ప్రకారం కన్యాదానం చేయకపోతే పెళ్లికి విలువ ఉండదు. కన్యాదానం ఎవరు చేస్తారు అని సేనాపతి బిల్డప్ గా మాట్లాడతాడు.
అప్పుడు నేను చేస్తానని తిరుపతి ముందుకొస్తాడు. ప్రేమ నాక్కూడా కూతురే. నా మేనల్లుడి కాళ్లు కడిగి మేం కన్యాదానం చేస్తామని తిరుపతి అనేసరికి సేనాపతికి దిమ్మతిరుగుతుంది. కూతురికి నచ్చిన పెళ్లి ఎందుకు చేయడం లేదని సేనాపతిని శారదాంబ అడుగుతుంది. కానీ కూతురు లేదని ఎమోషనల్ డైలాగ్ చెప్పి భద్రావతిని తీసుకొని సేనాపతి వెళ్లిపోతాడు.
గ్రాండ్ గా పెళ్లి
ధీరజ్, ప్రేమకు గ్రాండ్ గా పెళ్లి జరుగుతుంది. తిరుపతి, సుక్కు కలిసి ధీరజ్ కాళ్లు కడుగుతారు. ప్రేమ మెడలో ధీరజ్ తాళి కడతాడు. కొత్త దంపతులు ఇంటికి వస్తారు. కాసేపట్లో తనను మెడ పట్టుకుని బయటకు నెంటేస్తారని శ్రీవల్లి భయపడుతుంది.
మొగుడు, పెళ్లాలు ఒకరి పేరు ఒకరు చెప్పి ఇంట్లోకి రావాలని ఆడపడుచులు అమూల్య, కామాక్షి అడుగుతారు. ఆడపడుచు కట్నం ఇవ్వాల్సిందేనని కామాక్షి పట్టుబడుతుంది. ప్రేమ తెగ సిగ్గుపడుతూ నా పేరు ప్రేమ, మా ఆయన ధీరజ్ తో వచ్చానని చెప్తుంది. నేను, నా గయ్యాల రాక్షసి.. నా అందాల రాక్షసి పెళ్లాంతో వచ్చానని ధీరజ్ చెప్తాడు.
తిరు, సుక్కు ఎంట్రీ
తిరుపతి, సుక్కు కూడా కుడి కాలు పెట్టి లోపలికి వస్తామంటారు. కానీ వేదవతి మాత్రం రానివ్వదు. కాళ్లు కడిగాం కదా బావ, పెద్ద మనసుతో ఇంట్లోకి రానివ్వు బావ అని తిరుపతి రిక్వెస్ట్ చేస్తాడు. నేను మీరు చెప్పినట్లు వింటా. నా ప్రవర్తన రాకపోతే ఎప్పుడైనా సరే గెంటేయొచ్చని సుక్కు అంటుంది. కొడుకులు కూడా రిక్వెస్ట్ చేసేసరికి రామరాజు సరేనంటాడు.
మా బావ దేవుడు. దేవుడి భార్య అంటే మా అక్క కూడా దేవతేనని తిరుపతి మురిసిపోతాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.