భారతీయ చలనచిత్ర పరిశ్రమకు 2026 వ సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా మారనుంది. బాలీవుడ్‌లో ‘ధురంధర్ 2’ భారీ విజయంతో అకౌంట్ ఓపెన్ చేయగా.. రాబోయే రోజుల్లో ‘రామాయణ’, ‘ఆల్ఫా’, ‘కింగ్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నాయి. టాలీవుడ్ నుండి రామ్ చరణ్ ‘పెద్ది’, శాండల్‌వుడ్ నుండి యష్ ‘టాక్సిక్’, కోలీవుడ్ నుండి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ లైన్‌లో ఉన్నాయి.
ఈ లవ్ స్టోరీపై ప్రేక్షకుల ఆసక్తి

అయితే ఈ భారీ సూపర్ స్టార్ల చిత్రాలన్నింటినీ వెనక్కి నెట్టి ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ అవేటెడ్ మూవీగా ఒక సింపుల్ రొమాంటిక్ డ్రామా నిలవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మే 29 నాటి గణాంకాల ప్రకారం.. ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన ‘మై వాపస్ ఆవుంగా’ (Main Vaapas Aaunga) సినిమా IMDb మోస్ట్ అవేటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాలో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది.
ప్రముఖ సినిమా డేటాబేస్ సంస్థ ‘IMDb’ తమ పోర్టల్‌లో నెటిజన్లు ఆయా సినిమాల పేజ్ విజిట్స్ ఆధారంగా రియల్ టైమ్ పాపులారిటీని లెక్కిస్తుంది. దీని ప్రకారం ఏ చిత్రానికి ఎంత శాతం మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారనే రేషియోను ప్రకటిస్తుంది. ప్రస్తుతం 23.3 శాతంతో మై వాపస్ ఆవుంగా టాప్ లో ఉంది. ఇక 15.4 శాతంతో టాక్సిక్ రెండో స్థానంలో ఉండగా.. హై జవానీ తో ఇష్క్ హోనా హై మూవీ 13.2 శాతంతో మూడో స్థానంలో నిలిచింది.
ఆరో స్థానంలో పెద్ది
ఈ మై వాపస్ ఆవుంగా మూవీ జూన్ 12న విడుదల కానుండటంతో దీనిపై నెటిజన్లలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ‘పెద్ది’, మాధురీ దీక్షిత్ ‘మా బెహన్’, షాహిద్ కపూర్-కృతి సనన్-రష్మిక మందన్నల ‘కాక్‌టెయిల్ 2’ వంటి భారీ చిత్రాలను కూడా ఇది అధిగమించింది. అలాగే ‘వెల్‌కమ్ టు ది జంగిల్’, ‘బాబా’, ‘మా ఇంటి బంగారం’, ‘శ్రీ కృష్ణ’ చిత్రాలు కూడా ఈ టాప్ 10 జాబితాలో ఉన్నాయి.
‘రామాయణ’, ‘కింగ్’ ఎక్కడ?
దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్న రణబీర్ కపూర్ ‘రామాయణ’, షారుఖ్ ఖాన్ ‘కింగ్’ వంటి మెగా బడ్జెట్ చిత్రాలు ప్రస్తుతానికి టాప్ 10 లో లేకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. IMDb ర్యాంకింగ్ అనేది రియల్ టైమ్ లో ఉండే పాపులారిటీపై ఆధారపడి ఉంటుంది.
{{/usCountry}}దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్న రణబీర్ కపూర్ ‘రామాయణ’, షారుఖ్ ఖాన్ ‘కింగ్’ వంటి మెగా బడ్జెట్ చిత్రాలు ప్రస్తుతానికి టాప్ 10 లో లేకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. IMDb ర్యాంకింగ్ అనేది రియల్ టైమ్ లో ఉండే పాపులారిటీపై ఆధారపడి ఉంటుంది.
{{/usCountry}}ఈ సినిమాల విడుదలకు ఇంకా చాలా నెలల సమయం ఉండటం వల్ల, ప్రస్తుతానికి నెటిజన్ల లొకేషన్ విజిట్స్ పరంగా వీటి బజ్ కాస్త తక్కువగా ఉంది. 2026 చివరి త్రైమాసికం ప్రారంభమయ్యాక ఈ చిత్రాల హవా మళ్లీ పెరగనుంది.
‘మై వాపస్ ఆవుంగా’ సినిమా విశేషాలు
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ మార్క్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. 1947 దేశ విభజన నాటి పరిస్థితుల నేపథ్యంలో సాగే ఒక అద్భుతమైన ప్రేమకథ ఇది.
దిల్జీత్ దోసాంజ్, వేదాంగ్ రైనా, శర్వరి, నసీరుద్దీన్ షా ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, విండో సీట్ ఫిల్మ్స్ మూవీని నిర్మించాయి. జూన్ 12న సినిమా విడుదల కానుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. ప్రస్తుతం IMDb లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రం ఏది?
ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా ‘మై వాపస్ ఆవుంగా’ (23.3% అంచనాలతో) మొదటి స్థానంలో నిలిచింది. ఇది యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాను కూడా వెనక్కి నెట్టింది.
2. ‘మై వాపస్ ఆవుంగా’ సినిమా ఎప్పుడు విడుదల కానుంది?
ఈ చిత్రం జూన్ 12, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఇది దేశ విభజన (Partition) నాటి నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ.
3. యష్ ‘టాక్సిక్’, రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రాల IMDb అంచనాల శాతం ఎంత ఉంది?
మే 29 నాటి డేటా ప్రకారం, యష్ ‘టాక్సిక్’ చిత్రం 15.4% తో రెండో స్థానంలో ఉండగా, రామ్ చరణ్ ‘పెద్ది’ కూడా టాప్ 10 జాబితాలో కొనసాగుతోంది.