...
...
Next Story

Imran Khan: ఇంట్లో ఆడోళ్లు లేరని నా కూతురిని దూరం పెడుతున్నారు, గుండెను పిండేస్తోంది: యంగ్ హీరో ఇమ్రాన్ ఖాన్ ఆవేదన

Imran Khan Single Father Struggles: బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ సింగిల్ ఫాదర్‌గా తాను ఎదుర్కొంటున్న సామాజిక ఇబ్బందులను పంచుకున్నారు. తన ఇంట్లో ఆడోళ్లు లేరనే ఒకే ఒక్క కారణంతో కూతురి స్నేహితుల తల్లులు తమ పిల్లలను తన ఇంటికి పంపడానికి వెనుకాడటం చాలా బాధించిందని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.

Updated on: May 17, 2026, 17:23:32 IST
Advertisement

Imran Khan Single Father Struggles: భార్యాభర్తలు విడిపోయినప్పుడు పిల్లల బాధ్యతను ఇద్దరూ పంచుకోవడం (కో-పేరెంటింగ్) ఈ రోజుల్లో ఎక్కువైంది. అయితే, ఒక ఒంటరి తండ్రిగా (సింగిల్ ఫాదర్) సమాజంలో ఎలాంటి వింత పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో బాలీవుడ్ యంగ్ హీరో ఇమ్రాన్ ఖాన్ మనసు విప్పి మాట్లాడారు.

ఓటీటీ టాక్ షో

ఇంట్లో ఆడోళ్లు లేరని నా కూతురిని దూరం పెడుతున్నారు, గుండెను పిండేస్తోంది: యంగ్ హీరో ఇమ్రాన్ ఖాన్ ఆవేదన
ఇంట్లో ఆడోళ్లు లేరని నా కూతురిని దూరం పెడుతున్నారు, గుండెను పిండేస్తోంది: యంగ్ హీరో ఇమ్రాన్ ఖాన్ ఆవేదన

మాజీ భార్య అవంతికా మాలిక్‌తో విడిపోయిన తర్వాత కూతురు ఇమారా బాధ్యతలను చూసుకుంటున్న ఇమ్రాన్ ఖాన్ ఒక తండ్రిగా తాను పడుతున్న మానసిక సంఘర్షణను బయటపెట్టారు. బాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ పరిణీతి చోప్రా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓటీటీ టాక్ షో 'మామ్ టాక్స్' (Mom Talks)లో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. తన కూతురు వారంలో మూడు నుంచి నాలుగు రోజులు తనతోనే ఉంటుందని చెప్పారు. ఆ సమయంలో కూతురు తన స్నేహితురాళ్లను ఇంటికి పిలవాలని కోరినప్పుడు ఎదురైన చేదు అనుభవాలను ఇమ్రాన్ వివరించారు. కూతురి స్నేహితుల తల్లులకు ఫోన్ చేసి తమ పిల్లలను ఇంటికి పంపాల్సిందిగా కోరినప్పుడు, వారు ఏదో ఒక సాకు చెప్పి నిరాకరించేవారని ఇమ్రాన్ గుర్తుచేసుకున్నారు.

ఇంట్లో మహిళ లేకపోవడమే కారణమా?

ఒకటి రెండు సార్లు కాదు, వరుసగా ప్రతివారం ఇలాంటి తిరస్కరణలే ఎదురవడంతో ఇమ్రాన్ ఖాన్ అసలు కారణాన్ని గ్రహించారు. మన సమాజంలో ఒక ఒంటరి మగాడు ఉండే ఇంటికి, అందులోనూ ఆడపిల్లలను పంపడానికి తల్లులు భయపడుతున్నారని ఆయన అర్థం చేసుకున్నారు. విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నందున తన ఇంట్లో ఏ మహిళ లేదని, అందుకే కొందరు తల్లులు తమ పిల్లలను తన ఇంటికి పంపడానికి ఇష్టపడటం లేదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.

ఒక ఒంటరి తల్లికి సమాజంలో ఇతర మహిళల నుంచి లేదా స్నేహితుల నుంచి లభించే ఎమోషనల్ సపోర్ట్, ఒంటరి తండ్రికి లభించదని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు. మగవారి మధ్య ఉండే బంధాల్లో ఇదొక పెద్ద లోపమని ఆయన విశ్లేషించారు.

మగవాడంటే బలంగా ఉండాలి, బాధలను బయటపెట్టకూడదు అనే పాతకాలపు ఆలోచనల వల్లే పురుషులు తమ మనసులోని ఆవేదనను పంచుకోలేకపోతున్నారని చెప్పారు. ఒక మహిళకు తన బాధను పంచుకోవడానికి ఇద్దరు ముగ్గురు ప్రాణ స్నేహితురాళ్లు ఉంటారని, కానీ మగవారికి అలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉండదని ఆయన అన్నారు.

వ్యక్తిగత జీవితం.. కొత్త ప్రయాణం

ఇమ్రాన్ ఖాన్, అవంతిక మాలిక్ చిన్నప్పటి నుంచే ప్రేమించుకున్నారు. 2011లో అమీర్ ఖాన్ నివాసంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. 2013లో వీరికి ఇమారా జన్మించింది. అయితే, మనస్పర్థల కారణంగా 2019లో వీరు విడాకులు తీసుకున్నారు.

ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ నటి లేఖా వాషింగ్టన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్‌కు చెందిన సీ ఫేసింగ్ అపార్ట్‌మెంట్‌ను వీరిద్దరు అద్దెకు తీసుకున్నారు. దీని కోసం నెలకు రూ. 9 లక్షల భారీ మొత్తాన్ని అద్దెగా చెల్లిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe