...
...
Next Story

Indraja: ఇది దేవుడిచ్చిన బంధం.. నన్ను రాజీ అని పిలుస్తాడు.. సుడిగాలి సుధీర్‌తో రిలేష‌న్‌షిప్‌పై ఇంద్ర‌జ ఎమోష‌న‌ల్‌

Indraja: సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాలు, షోలతో ఇంద్రజ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఒకప్పటి ఈ స్టార్ నటి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుడిగాలి సుధీర్ తో తన బంధంపై మాట్లాడుతూ ఇంద్రజ ఎమోషనల్ అయ్యారు.

Published on: Apr 22, 2026, 14:01:15 IST
Advertisement

Indraja: ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ.. ఇప్పుడు సినిమాలు, టీవీ షోలతో బిజీగా మారిపోయారు. ఈటీవీలో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు ఆమె జడ్జ్ గా చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెర నుంచి వచ్చి చాలా ఫేమస్ అయిన నటుడు సుడిగాలి సుధీర్ గురించి ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. అతని గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.

ఇంద్రజ కామెంట్లు

ఇంద్రజ, సుధీర్ (x)
ఇంద్రజ, సుధీర్ (x)

సుడిగాలి సుధీర్ గురించి ఇంద్రజ తాజాగా ఓ టాక్ షోలో మాట్లాడింది. తమ బంధం గురించి వివరించింది. ‘‘సిద్ధు (సుధీర్) నాకు కొడుకు లాంటివాడు. నన్ను అమ్మా అని పిలుస్తాడు. అమ్మ అంటే అమ్మలాగే చూసుకుంటాడు. ప్రేమ, గౌరవం చూపిస్తాడు. అది చూసినప్పుడు ఇది దేవుడు ఇచ్చిన బంధంలా అనిపిస్తుంది’’ అని ఇంద్రజ తెలిపింది.

సుధీర్ కొడుకులా

సుడిగాలి సుధీర్ తనకు కొడుకు లాంటివాడని ఇంద్రజ మరోసారి స్పష్టం చేసింది. జబర్దస్త్ లో కూడా తమను నిజంగానే తల్లీకొడుకులా చూసేవాళ్లను ఇంద్రజ వెల్లడించారు. బయటకు వెళ్తే ఫ్యాన్స్ కూడా అదే అడుగుతుంటారు. కలిసి కనిపించడం లేదని, మా ఇద్దరిని మిస్ అవుతున్నామని అంటారని ఇంద్రజ చెప్పారు.

రాజీ అని

తన కొడుకు లాంటి సుధీర్ తనను రాజీ అని ప్రేమగా పిలుస్తాడని ఇంద్రజ వెల్లడించింది. ‘‘నేను సుధీర్ ను సిద్ధు అని పిలుస్తా. అతనేమో నన్ను రాజీ అని అంటాడు. ఎందుకంటే మా ఇంట్లో వాళ్లు కూడా నన్ను రాజీ అనే పిలుస్తారు. సిద్దు నన్ను రాజీ అంటే సంతోషంగా అనిపిస్తుంది’’ అని ఇంద్రజ పేర్కొన్నారు.

ఎంతో టాలెంట్

సుడిగాలి సుధీర్ కు ఫ్యాన్ బేస్ ఎక్కువ. అతనో ఆల్ రౌండర్ అని చెప్పొచ్చు. మ్యాజిక్ చేసుకునే రోజుల నుంచి ఇప్పుడు హీరోగా ఎదిగాడు. జబర్దస్త్ లో నవ్వించిన సుడిగాలి సుధీర్ ఇప్పుడు వెండితెరపైనా అలరిస్తున్నాడు. ప్రస్తుతం గోట్ సినిమా పనులతో సుధీర్ బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఇది రిలీజ్ కానుంది. మరో రెండు మూవీస్ కూడా సుధీర్ చేతిలో ఉన్నాయి. మరోవైపు జీ తెలుగులో ఆట, ఆహా ఓటీటీలో సర్కార్ షోలను హోస్ట్ చేస్తున్నాడు సుధీర్.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks