...
...
Next Story

Alex Cooper: తల్లి కాబోతున్న కాల్ హర్ డాడీ హోస్ట్ అలెక్స్ కూపర్.. బేబీ బంప్ ఫోటోలు వైరల్- ఆ అనుమానాలకు ఆన్సర్ ఇదే!

Alex Cooper Announced Pregnancy With Matt Kaplan: అంతర్జాతీయ డిజిటల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన 'కాల్ హర్ డాడీ' పాడ్‌కాస్ట్ హోస్ట్ అలెక్స్ కూపర్ త్వరలో తల్లి కాబోతున్నారు. తన భర్త, హాలీవుడ్ నిర్మాత మాట్ కప్లాన్‌తో కలిసి దిగిన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Published on: May 18, 2026, 06:08:54 IST
Advertisement

Alex Cooper Announced Pregnancy With Matt Kaplan: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది శ్రోతలను ఆకట్టుకున్న అమెరికన్ సెలబ్రిటీ, పాడ్‌కాస్టర్, కాల్ హర్ డాడీ హోస్ట్ అలెక్స్ కూపర్ (31) తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నారు. తాను గర్భవతిననే విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు.

కెమెరాలకు దొరకకుండా దోబూచులాట..

తల్లి కాబోతున్న కాల్ హర్ డాడీ హోస్ట్ అలెక్స్ కూపర్.. బేబీ బంప్ ఫోటోలు వైరల్- ఆ అనుమానాలకు ఆన్సర్ ఇదే!
తల్లి కాబోతున్న కాల్ హర్ డాడీ హోస్ట్ అలెక్స్ కూపర్.. బేబీ బంప్ ఫోటోలు వైరల్- ఆ అనుమానాలకు ఆన్సర్ ఇదే!

పాడ్‌కాస్ట్ రంగంలో సంచలనాలు సృష్టిస్తూ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన అలెక్స్ కూపర్ తన వ్యక్తిగత జీవితంలోని ఈ సంతోషకరమైన క్షణాలను పంచుకోవడంతో నెటిజన్లు శుభాకాంక్షలు కురిపిస్తున్నారు. ఈ అధికారిక ప్రకటనకు కొన్ని రోజుల ముందే అలెక్స్ కూపర్ నగరంలో పబ్లిక్‌గా తిరుగుతూ కెమెరాల కంటికి చిక్కారు.

ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ 'టిఎమ్‌జెడ్' (TMZ) ప్రతినిధులు ఆమెను పలకరించి, తోటి ఇన్‌ఫ్లుయెన్సర్ అలిక్స్ ఎర్లేతో నడుస్తున్న వివాదం గురించి ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. అయితే, అలెక్స్ కూపర్ ఏమాత్రం తగ్గకుండా, ఎవరికీ ఎలాంటి సమాధానం చెప్పకుండా చాలా వేగంగా హడావుడిగా తన కారులోకి వెళ్లిపోయారు.

అప్పట్లో ఆమె ఎందుకు అంత లో-ప్రొఫైల్ మెయింటైన్ చేశారనే దానికి ఇప్పుడు సమాధానం దొరికింది. తన గర్భాన్ని, పెరుగుతున్న బేబీ బంప్‌ను మీడియా కంట పడకుండా దాచడానికే అలెక్స్ కూపర్ అలా కెమెరాల నుంచి తప్పించుకున్నట్లు స్పష్టమైంది. అలెక్స్ మీడియా ముందుకు ఎందుకు రావట్లేదన్న అనుమానాలకు ఇప్పుడు సమాధానం దొరికినట్లయింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో అఫీషియల్ అనౌన్స్‌మెంట్

"మా కుటుంబం 🤍" అనే అందమైన క్యాప్షన్‌తో అలెక్స్ కూపర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ ఫోటోలలో అలెక్స్ కూపర్ ప్రెగ్నెన్సీ స్పష్టంగా కనిపిస్తోంది. అలెక్స్ కూపర్ బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

"వారి వైవాహిక బంధంలో ఎలాంటి మనస్పర్థలు లేవు, ఆ వార్తలన్నీ అబద్ధం. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు వారిద్దరూ ఎంతో ఆత్రుతగా, సంతోషంగా ఉన్నారు. వీలైనంత కాలం ఈ విషయాన్ని గుట్టుగా ఉంచాలని మాత్రమే వారు అనుకున్నారు" అని పీపుల్ (PEOPLE) మ్యాగజైన్‌కు వీరి సన్నిహిత వర్గాలు తెలిపాయి.

జూమ్ కాల్‌తో మొదలైన ప్రేమాయణం

అలెక్స్ కూపర్ తన మీడియా కెరీర్‌లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ గోప్యంగా ఉంచడానికే ఇష్టపడతారు. 2020లో కరోనా లాక్‌డౌన్ సమయంలో ఒక జూమ్ కాల్ ద్వారా మాట్ కప్లాన్‌తో ఆమెకు తొలి పరిచయం ఏర్పడింది. అప్పట్లో తన పాడ్‌కాస్ట్‌లో అతని అసలు పేరును బయటపెట్టకుండా రహస్యంగా ఉంచుతూ "మిస్టర్ సెక్సీ జూమ్ మ్యాన్" అని పిలిచేవారు.

మొదట్లో పెళ్లిపై పెద్దగా నమ్మకం లేని అలెక్స్ కూపర్ 2022లో ఒక డిన్నర్ డేట్ సమయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. "నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ప్రపోజ్ చేయవచ్చు" అని మాట్ కప్లాన్‌కు చెప్పడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మెక్సికోలో గుట్టుగా పెళ్లి..

ఈ జంట 2024 ఏప్రిల్‌లో మెక్సికోలోని రివియెరా మాయాలో అత్యంత ప్రైవేట్‌గా వివాహం చేసుకున్నారు. చాలా తక్కువ మంది అతిథుల సమక్షంలో జరిగిన ఈ వేడుక గురించి అలెక్స్ ప్రసిద్ధ 'వోగ్' (Vogue) మ్యాగజైన్‌తో మాట్లాడుతూ.. తమకు ఎలాంటి ఆడంబరాల పెళ్లి ఇష్టం లేదని, సహజమైన వాతావరణంలో, తమను అమితంగా ప్రేమించే ఆప్తుల మధ్య మాత్రమే వేడుక జరుపుకోవాలని అనుకున్నట్లు వివరించారు.

మరోవైపు, అలెక్స్‌తో పబ్లిక్ ఫ్యూడ్ (వివాదం) నడుపుతున్న సోషల్ మీడియా స్టార్ అలిక్స్ ఎర్లే.. ఈ గర్భధారణ వార్తపై ఇంకా ఎలాంటి స్పందన తెలియజేయలేదు. ఎన్‌ఎఫ్‌ఎల్ స్టార్ టామ్ బ్రాడీతో డేటింగ్ పుకార్ల ద్వారా వార్తల్లో నిలిచిన అలిక్స్, ప్రస్తుతం తన సొంత ఇన్‌స్టాగ్రామ్ పోస్టులతో బిజీగా గడుపుతున్నారు. ఏదేమైనా, 'కాల్ హర్ డాడీ' ఫ్యాన్స్ మాత్రం తమ ఫేవరెట్ హోస్ట్ తల్లి కాబోతుండటంతో పండగ చేసుకుంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe