Irumudi: టీ తాగారా? టిఫిన్ చేశారా? అంటూ పక్కవాళ్లను, చుట్టాలను పలకరిస్తుంటాం. ఇప్పుడు ఇందులోకి ఓ కొత్త ప్రశ్న కూడా చేరింది. అదే.. ఇరుముడి చూశారా? అవును.. ఇప్పుడు కామన్ పీపుల్ కు ఇది కామన్ ప్రశ్నగా మారింది. ఇద్దరు వ్యక్తులు కలిసినా, ఫ్యామిలీ ఒక్క చోట చేరినా ఇప్పుడు ఇరుముడి గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా చూశారా? లేదా? అని అడుగుతున్నారు.
ఇరుముడి ఇంపాక్ట్

తెలుగు ఆడియన్స్ మీద ఇరుముడి మూవీ చూపించిన ఇంపాక్ట్ మామూలుగా లేదు. సినిమా అంటే కేవలం రెండున్నర గంటల ఎంటర్ టైన్మెంట్ అని, థియేటర్ బయటకు రాగానే చాలా మంది దాన్ని మర్చిపోతారు. కానీ ఇరుముడి అలాంటి మూవీ కాదు. జనాలు ఈ సినిమాను తమతో పాటు ఇంటికి తీసుకెళ్తారు. తమ లైఫ్ లో దీన్ని భాగం చేసుకున్నారు. అందుకే రోజువారీ మాటల్లోనూ ఇరుముడి ప్రస్తావన తీసుకొస్తున్నారు.
మూవీ చర్చలు
ఫ్యామిలీ ఫంక్షన్ అయినా. ఫ్రెండ్స్ కలిసినా.. ఇరుముడి గురించి కచ్చితంగా మాట్లాడుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. మూవీ చూశారా? అని అడుగుతున్నారు. స్టోరీ గురించి, సినిమాలో రవితేజ, బేబీ నక్షత్ర యాక్టింగ్ గురించి, సాయికుమార్ ఇచ్చే మైండ్ బ్లాక్ ట్విస్ట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ఇల్లీగల్ అయినప్పటికీ కొన్ని చోట్ల అయితే పైరసీ కాపీలను స్క్రీన్ లు ఏర్పాటు చేసుకుని మరీ చూస్తున్నారు.
బలగం తర్వాత
రీసెంట్ టైమ్స్ లో తెలుగు జనాలను బాగా కదిలించిన మూవీ బలగం. కమెడియన్ వేణు డైరెక్టర్ గా మారి తీసిన ఈ మూవీ ఆడియన్స్ మనసులను తాకింది. ఊర్లకు ఊర్లు బిగ్ స్క్రీన్ లు సెట్ చేసుకుని ఈ సినిమాను చూశాయి. ఆ చిత్రంలోని ఎమోషన్ కు ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఇరుముడి కూడా ఆ లెవల్ లో జనాల్లోకి వెళ్లిపోయింది.
సెలబ్రిటీలు కూడా
ఇరుముడి మూవీపై సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య వరకూ అందరూ ఈ సినిమాకు ఫిదా అయ్యారు. రీసెంట్ గా ఎపిక్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో వైష్ణవి చైతన్య ఈ మూవీ గురించి ప్రస్తావించింది. తన అమ్మమ్మతో కలిసి సినిమా చూశానని, ఆవిడ ఏడ్చేశారని చెప్పింది.
లాభాల పంట
{{/usCountry}}ఇరుముడి మూవీపై సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య వరకూ అందరూ ఈ సినిమాకు ఫిదా అయ్యారు. రీసెంట్ గా ఎపిక్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో వైష్ణవి చైతన్య ఈ మూవీ గురించి ప్రస్తావించింది. తన అమ్మమ్మతో కలిసి సినిమా చూశానని, ఆవిడ ఏడ్చేశారని చెప్పింది.
లాభాల పంట
{{/usCountry}}మరోవైపు ఇరుముడి సినిమా ప్రొడ్యూసర్లకు, బయ్యర్లకు లాభాల పంట పండిస్తోంది. 40 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు రూ.250 కోట్ల కలెక్షన్లకు దగ్గర్లో ఉంది. ఆగస్టు 21న రిలీజైన ఈ మూవీ జోరు మూడో వారంలోనూ తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆక్యుపెన్సీ కొనసాగిస్తోంది. రవితేజ కెరీర్ ను మలుపు తిప్పిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చాక ఇంకా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.