Priya Bhavani Shankar Marriage: తమిళ స్టార్ నటి, ఇరుముడి సినిమా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ తన లైఫ్ లో ఓ కొత్త ఛాప్టర్ స్టార్ట్ చేసింది. ఈ భామ సైలెంట్ గా ఇవాళ (నవంబర్ 11) పెళ్లి చేసుకుంది. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ రాజ్ వేల్ తో ఆమె వివాహం బుధవారం పొద్దున చెన్నైలో జరిగింది.
సింపుల్ గా మ్యారేజీ

సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటుల పెళ్లిళ్లంటే ఉండే హడావుడి వేరు. ఆ హైప్, బజ్ వేరే లెవల్. కానీ ప్రియా భవానీ శంకర్ మాత్రం చాలా సింపుల్ గా తన మ్యారేజీ చేసుకుంది. ఇవాళ ఉదయం చెన్నైలోనే తన బాయ్ ఫ్రెండ్ రాజ్ వేల్ తో కలిసి ఈ ముద్దుగుమ్మ ఏడడుగులు నడిచింది.
వీడియోలు వైరల్
ప్రియా భవానీ శంకర్ పెళ్లి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. నెటిజన్లు ఈ కొత్త దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇరుముడి హీరోయిన్ పెళ్లి చేసుకుందంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు. దీంతో ప్రియా భవానీ శంకర్ పేరు ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది.
కాలేజీ ఫ్రెండ్
ప్రియా భవానీ శంకర్, రాజ్ వేల్ కు కాలేజీ రోజుల నుంచి పరిచయం ఉంది. వీళ్లు సుమారు పదేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. అప్పటి నుంచి వీళ్ల మధ్య లవ్ కొనసాగుతూ వచ్చింది. చివరకు మూడు ముళ్లతో ఈ జంట ఒక్కటైంది.
ప్రియా భవానీ శంకర్ సినిమాలు
హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ తమిళంలో చాలా సినిమాలే చేసింది. 2017లో వచ్చిన మేయాద మాన్ సినిమాతో ఆమె అరంగేట్రం చేసింది. తెలుగులో 2023లోనే అడుగుపెట్టింది. సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ‘కళ్యాణం కమనీయం’ సినిమా టాలీవుడ్ లో ఆమె ఫస్ట్ మూవీ.
{{/usCountry}}హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ తమిళంలో చాలా సినిమాలే చేసింది. 2017లో వచ్చిన మేయాద మాన్ సినిమాతో ఆమె అరంగేట్రం చేసింది. తెలుగులో 2023లోనే అడుగుపెట్టింది. సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ‘కళ్యాణం కమనీయం’ సినిమా టాలీవుడ్ లో ఆమె ఫస్ట్ మూవీ.
{{/usCountry}}ఆ తర్వాత తెలుగులో భీమా, జీబ్రా సినిమాలు చేసింది. అనంతరం తమిళంలో బిజీ అయింది. తెలుగులో ఆమెకు గత సినిమాలు మంచి రిజల్ట్ ఇవ్వలేకపోయాయి.
ఇరుముడితో పాపులర్
తెలుగులో ఇరుముడి సినిమాతో సక్సెస్ అందుకోవడమే కాదు ఇక్కడ ప్రియా భవానీ శంకర్ పాపులర్ కూడా అయింది. ఇందులో హీరో భార్యగా ఆమె సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. ఎమోషనల్ సీన్లలో అయితే ఏడిపించేసింది.
పెళ్లి చేసుకున్న ప్రియా భవానీ శంకర్ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలున్నాయి. తమిళంలో ఆమె డీమాంటీ కాలనీ 2, మరగధ నానయం 2 తదితర సినిమాలు చేస్తోంది.