...
...
Next Story

Irumudi Twitter Review: అన్న హిట్ కొట్టాడ్రోయ్.. రవితేజ 'ఇరుముడి' ట్విటర్ రివ్యూ.. ఎమోషనల్ మహారాజా.. పబ్లిక్ టాక్ ఇదే!

Irumudi Twitter Review: మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన 'ఇరుముడి' చిత్రానికి థియేటర్ల వద్ద, సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. తండ్రీకూతుళ్ల బాండింగ్, ఎమోషనల్ క్లైమాక్స్‌తో కూడిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ పబ్లిక్ రివ్యూస్ పై ఓ లుక్కేయండి.

Published on: Aug 21, 2026, 08:57:46 IST
Advertisement

Irumudi Twitter Review: ‘అన్న హిట్ కొట్టాడ్రోయ్’, ‘మాస్ మహారాజా కాదు ఎమోషనల్ మహారాజా’.. ఇవే ఇరుముడి సినిమా చూసిన ఆడియన్స్ చెప్తున్న మాటలు. అవును.. ఇరుముడితో రవితేజ బ్లాక్ బస్టర్ కమ్ బ్యాక్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. ఇవాళ (ఆగస్టు 21) రిలీజైన ఇరుముడి మూవీ అదిరిపోయిందని అంటున్నారు.

ఇరుముడి రిలీజ్

అన్న హిట్ కొట్టాడ్రోయ్.. రవితేజ 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ.. ఎమోషనల్ మహారాజా.. 5 ఏళ్ల తర్వాత! (x/RaviTeja_offl)
అన్న హిట్ కొట్టాడ్రోయ్.. రవితేజ 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ.. ఎమోషనల్ మహారాజా.. 5 ఏళ్ల తర్వాత! (x/RaviTeja_offl)

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ థ్రిల్లర్ 'ఇరుముడి' థియేటర్లలోకి వచ్చింది. గత కొన్నాళ్లుగా రొటీన్ మాస్ సినిమాలతో పలకరించిన రవితేజ, ఈసారి తన ఇమేజ్ చట్రాన్ని పక్కనపెట్టి పూర్తిస్థాయి నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన కథను ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరుముడికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. నెటిజన్ల ట్విటర్ రివ్యూ వైరల్ గా మారుతున్నాయి.

తండ్రీకూతుళ్ల అనుబంధం

ఇరుముడి సినిమాకు తండ్రీకూతుళ్ల మధ్య ఉండే బలమైన భావోద్వేగాలే ప్రధాన బలంగా నిలిచాయి. సమాజంలో భయం లేకుండా నిజం వైపు నిలబడే త్రినాథ్ (రవితేజ) అనే తండ్రి.. తన కూతురి కోసం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనేది ఈ సినిమా స్టోరీ.

ఈ ఇరుముడి మూవీని కేవలం ఒక థ్రిల్లర్ చిత్రంగా మాత్రమే కాకుండా, పిల్లల పెంపకం (Parenting) చుట్టూ తిరిగే ఒక మంచి సామాజిక సందేశాత్మక మూవీగా దర్శకుడు మలిచారు.

సాయికుమార్ పాత్ర ద్వారా మరొక రకమైన తండ్రి ఆలోచనా విధానాన్ని సమాంతరంగా చూపిస్తూ, రెండు వేర్వేరు పెంపకాలు పిల్లల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చాలా స్పష్టంగా వివరించారు.

ఎమోషనల్ మహారాజా!

"ఇటీవలి కాలంలో రవితేజ నుంచి వచ్చిన అత్యంత గొప్ప నటన ఇది" అని సినీ విమర్శకులు, అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

కంటతడి పెట్టించే క్లైమాక్స్

సినిమా సెకండాఫ్ లో వచ్చే కొన్ని మలుపులు, ముఖ్యంగా 'మల్లెపూల పల్లకి' పాట నేపథ్యంలో సాగే యాక్షన్ సన్నివేశం థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లాకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తోంది. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా కథకు కట్టుబడి దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, కథ ముందుకు సాగేకొద్దీ ఉత్కంఠ పెరుగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుందని, థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆ భావోద్వేగం వెంటాడుతుందని ప్రేక్షకులు చెబుతున్నారు.

ఆ లోపాలు

కథ ప్రారంభంలో మొదటి 15 నిమిషాలు కాస్త నెమ్మదిగా సాగడం, ప్రీ-క్లైమాక్స్ సన్నివేశాలు కొంత రొటీన్ టెంప్లేట్‌ను పోలి ఉండటం, విలన్ పాత్రల చిత్రీకరణ కొన్నిచోట్ల అతిగా అనిపించడం ఇరుముడికి లోపాలుగా మారాయి.

అయినప్పటికీ కథలోని ప్రాణం, ఎమోషన్స్ ఈ చిన్న చిన్న లోపాలను అధిగమించేలా చేశాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. జివి ప్రకాష్ అందించిన నేపథ్య సంగీతం కథనానికి మరింత బలాన్ని ఇచ్చింది. మొత్తానికి రవన్న హిట్ కొట్టాడ్రోయ్ అని నెటిజన్లు అంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks