డిఫరెంట్ టైటిల్‌తో ఇట్లు మీ ఎదవ- రిలీజ్ డేట్ ఇదే- నైజాంలో ఒకరు, ఆంధ్ర, సీడెడ్‌లో మరొకరితో విడుదల

తెలుగులో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనింగ్ మూవీగా వస్తోంది ఇట్లు మీ ఎదవ సినిమా. వెయ్యేళ్లు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. త్రినాధ్ కఠారి హీరోగా చేయడంతోపాటు దర్శకత్వం వహించారు. సాహితీ అవాంచ హీరోయిన్‌గా చేసిన ఇట్లు మీ ఎదవ సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా మేకర్స్ ప్రకటించారు.

Published on: Nov 16, 2025 10:49 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్‌లో త్రినాధ్ కఠారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ మూవీ ఇట్లు మీ ఎదవ. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత బళ్లారి శంకర్ ఈ సినిమాను నిర్మించారు. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ మూవీలో సాహితీ అవాంచ హీరోయిన్‌గా చేసింది.

డిఫరెంట్ టైటిల్‌తో ఇట్లు మీ ఎదవ- రిలీజ్ డేట్ ఇదే- నైజాంలో ఒకరు, ఆంధ్ర, సీడెడ్‌లో మరొకరితో విడుదల
డిఫరెంట్ టైటిల్‌తో ఇట్లు మీ ఎదవ- రిలీజ్ డేట్ ఇదే- నైజాంలో ఒకరు, ఆంధ్ర, సీడెడ్‌లో మరొకరితో విడుదల

వెయ్యేళ్లు ధర్మంగా వర్ధిల్లు ట్యాగ్‌లైన్

వెయ్యేళ్లు ధర్మంగా వర్ధిల్లు అనే ట్యాగ్ లైన్‌తో వచ్చిన ఇట్లు మీ ఎదవ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా ఇట్లు మీ ఎదవ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 21న ఇట్లు మీ ఎదవ థియేట్రికల్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది.

నైజాంలో ఒకరు మిగతా చోట్ల మరొకరు

నైజాంలో ఇట్లు మీ ఎదవ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పీ విడుదల చేయనుండగా.. ఆంధ్ర, సీడెడ్‌లో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేయనుంది. ఈ రెండు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ఇట్లు మీ ఎదవ గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఆర్పీ పట్నాయక్ సంగీతం

ఇదిలా ఉంటే ఇట్లు మీ ఎదవ చిత్రంలో హీరోహీరోయిన్లతోపాటు తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రానికి జగదీష్ చీకటి డీవోపీగా, ఎడిటర్ ఉద్ధవ్ ఎస్‌బీ వర్క్ చేశారు.

ఇట్లు మీ ఎదవ నటీనటులు

ఇట్లు మీ ఎదవ సినిమాలో మొత్తంగా త్రినాధ్ కఠారి, సాహితీ అవాంచ, తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, నవీన్ నేని, సురభి ప్రభావతి, మధుమణి, తాగుబోతు రమేష్, చలాకీ చంటి, జబర్దస్త్ నూకరాజు, జెమినీ సురేష్, డీడీ శ్రీనివాస్, రామజగన్ నటించారు.

చాలా ఆనందంగా ఉంది

ఇదిలా ఉంటే, ఇట్లు మీ ఎదవ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత బళ్లారి శంకర్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. ఇది నా ఫస్ట్ సినిమా. పట్నాయక్ గారు మ్యూజిక్ అందించడం చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుకకు వచ్చిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు" అని అన్నారు.

నా ఫస్ట్ సినిమా

"మాకు సపోర్ట్ చేస్తున్న డైరెక్టర్ బుచ్చిబాబు గారికి హీరో శ్రీకాంత్ గారికి నిర్మాత కేఎస్ రామారావు గారికి కృతజ్ఞతలు. ఇది నా ఫస్ట్ సినిమా మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను" అని కోరారు నిర్మాత బళ్లారి శంకర్.

డిఫరెంట్ టైటిల్‌తో

ఇదిలా ఉంటే, డిఫరెంట్ టైటిల్‌తో వస్తున్న ఇట్లు మీ ఎదవ థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

News/Entertainment/డిఫరెంట్ టైటిల్‌తో ఇట్లు మీ ఎదవ- రిలీజ్ డేట్ ఇదే- నైజాంలో ఒకరు, ఆంధ్ర, సీడెడ్‌లో మరొకరితో విడుదల
News/Entertainment/డిఫరెంట్ టైటిల్‌తో ఇట్లు మీ ఎదవ- రిలీజ్ డేట్ ఇదే- నైజాంలో ఒకరు, ఆంధ్ర, సీడెడ్‌లో మరొకరితో విడుదల