...
...
Next Story

నేను ఎదవ క్యారెక్టర్ చేశాను, ఇది ఒక తండ్రికొడుకు, కూతుర్ల కథ.. హీరో, డైరెక్టర్ త్రినాధ్ కటారి కామెంట్స్

తెలుగులో వస్తోన్న లేటెస్ట్ లవ్, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ఇట్లు మీ ఎదవ. ఈ సినిమాకు త్రినాధ్ కటారి హీరోగా చేస్తూ డైరెక్టర్‌గా స్వీయ దర్శకత్వం వహించారు. ఆర్‌పీ పట్నాయక్ సంగీతం అందించిన ఇట్లు మీ ఎదవ ట్రైలర్‌ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Oct 31, 2025, 18:44:26 IST
Advertisement

త్రినాధ్ కటారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ ఇట్లు మీ ఎదవ. వెయ్యేళ్లు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో సాహితీ అవంచ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఇట్లు మీ ఎదవ ట్రైలర్ లాంచ్

నేను ఎదవ క్యారెక్టర్ చేశాను, ఇది ఒక తండ్రికొడుకు, కూతుర్ల కథ.. హీరో, డైరెక్టర్ త్రినాధ్ కటారి కామెంట్స్
నేను ఎదవ క్యారెక్టర్ చేశాను, ఇది ఒక తండ్రికొడుకు, కూతుర్ల కథ.. హీరో, డైరెక్టర్ త్రినాధ్ కటారి కామెంట్స్

ఇటీవల రిలీజ్ చేసిన ఇట్లు మీ ఎదవ సినిమా టైటిల్ గ్లింప్స్, సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇవాళ (అక్టోబర్ 31) ఇట్లు మీ ఎదవ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.

ఫీల్ గుడ్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్

యూత్‌ఫుల్ ఫన్, బ్యూటిఫుల్ లవ్ స్టొరీ, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయింది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, డైరెక్టర్ త్రినాధ్ కటారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

వారికి పాదాభివందనం

హీరో, దర్శకుడు త్రినాధ్ కటారి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మీడియా వారికి పాదాభివందనం. ప్రేక్షకులకు నమస్కారం. మేము ఒక మంచి సినిమా చేసాం. అందరూ కష్టపడ్డారు. నేను కష్టపడ్డాను. అందరు కూడా చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు. భరణి గారు, గోపరాజు రమణ గారు దేవి ప్రసాద్ గారు వారిచ్చిన సపోర్టు ఎప్పటికీ మర్చిపోలేను" అని అన్నారు.

కొత్త వాడినని చూడలేదు

"ఎవరు కూడా నేను కొత్త వాడినని చూడలేదు. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలానే నన్ను చూసుకున్నారు. డీవోపీ జగదీష్ గారు సినిమాని అద్భుతంగా చూపించారు. ఈ సినిమాకి కథే హీరో. ఇందులో నేను ఎదవ అని ఒక క్యారెక్టర్ చేశాను. ఇది ఒక తండ్రి కొడుకులు కథ, తండ్రి కూతుర్ల కథ, ఒక అమ్మాయి అబ్బాయి కథ. ఈ ముగ్గురు మధ్య ఉండే లవ్ స్టోరీ" అని త్రినాధ్ కటారి తెలిపారు.

కథ చెప్తున్నప్పుడే

హీరోయిన్ సాహితీ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశాం. మా టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. చాలా బ్యూటిఫుల్ స్టోరీ ఇది. చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి. అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. అందరూ కనెక్ట్ అయ్యే సినిమా" అని అన్నారు.

నమ్మకంతో పని చేశారు

"మా డైరెక్టర్ గారు చాలా క్లియర్ విజన్‌తో చేశారు. ఆయన వల్లే ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ చేయగలిగాం. మా నిర్మాత శంకర్ గారు చాలా మంచి పర్సన్. మా మీద నమ్మకంతో సినిమా చేశారు. తప్పకుండా ఆయనకి చాలా మంచి విజయం దొరుకుతుందని కోరుకుంటున్నాను. మాకు సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది" అని సాహితీ అవంచ పేర్కొంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks