Jackie Shroff Fitness: మంచి ఆరోగ్యానికి 8 గంటల ఫార్ములా- కానీ, నా డైట్ అస్సలు ఫాలో అవ్వకండి- యంగ్ హీరో తండ్రి కామెంట్స్
Jackie Shroff Reveals 8 Hours Fitness Secret: బాలీవుడ్ సీనియర్ నటుడు, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తండ్రి జాకీ ష్రాఫ్ తన దినచర్య, ఇష్టమైన వంటకాలు, ఫిట్‌నెస్ రహస్యాలను పంచుకున్నారు. మంచి ఆరోగ్యానికి 8 గంటల ఫార్ముల బెస్ట్ అని చెప్పిన జాకీ ష్రాఫ్ తన డైట్ మాత్రం అస్సలు ఫాలో కావొద్దని చెప్పుకొచ్చారు.
Jackie Shroff Reveals 8 Hours Fitness Secret: హిందీ చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో, విలక్షణమైన మ్యానరిజంతో 'జగ్గు దాదా'గా గుర్తింపు తెచ్చుకున్నారు జాకీ ష్రాఫ్. ఎంతటి స్టార్‌డమ్ ఉన్నా సరే సాధారణ వ్యక్తిలా మెలుగుతారు.

జాకీ ష్రాఫ్ డైట్
నిత్యం పర్యావరణం గురించి, మొక్కలు నాటడం గురించి మాట్లాడే జాకీ ష్రాఫ్.. తాజాగా తన వ్యక్తిగత జీవితం, ఆహారపు అలవాట్లు, ఫిట్‌నెస్, డైట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒక ప్రముఖ టాక్ షోలో మాట్లాడుతూ.. తాను చెప్పే సూత్రాలను తానే పాటించనని నవ్వుతూ చెప్పారు బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తండ్రి జాకీ ష్రాఫ్.
8 గంటల ఫార్ములా.. కానీ నాకు కుదరదు!
జీవితంలో సమతుల్యత (Balance) ఎలా ఉండాలో వివరిస్తూ జ్యాకీ ష్రాఫ్ ఒక ఆసక్తికరమైన లెక్క చెప్పారు. "రోజులో ఉండే 24 గంటలను మూడు భాగాలుగా విభజించుకోవాలి. 8 గంటలు నిద్రకు, 8 గంటలు పనికి, మిగిలిన 8 గంటలు మీ వ్యక్తిగత జీవితానికి కేటాయించాలి. ఆ మిగిలిన సమయంలోనే తల్లిదండ్రులు, పిల్లలు, స్నేహితులతో గడపాలి. అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి" అని జాకీ ష్రాఫ్ వివరించారు.
అయితే ఈ నియమం ఇతరులకు మాత్రమేనని, తన జీవితంలో అస్సలు టైమింగ్స్ ఉండవని ఆయన స్పష్టం చేశారు. "నేను చెప్పే ఈ మాటలను వేరే వాళ్లు పాటిస్తే మంచిదే కానీ.. నా దినచర్యను మాత్రం ఎవరూ ఫాలో అవ్వకండి, తిప్పలు తప్పవు. నేను రోజుకు ఆరు గంటలు మాత్రమే పడుకుంటాను. ఒకసారి పని మొదలుపెడితే అది పూర్తయ్యే వరకు మళ్లీ బెడ్ వైపు వెళ్లను" అని జాకీ ష్రాఫ్ నవ్వుతూ చెప్పారు.
స్వీట్లంటే పిచ్చి.. పిల్లల మాట వింటాను
ఈ వయసులో కూడా ఎంతో ఫిట్‌గా కనిపించే జాకీ ష్రాఫ్‌కు తీపి పదార్థాలంటే మహా ఇష్టం. ముఖ్యంగా మామిడి పండ్ల సీజన్ వస్తే అస్సలు కంట్రోల్ చేసుకోలేనని చెప్పారు. జిలేబీ, గులాబ్ జామూన్, రసమలై, ఖీర్, మావా కేక్ వంటి స్వీట్లను తెగ లాగించేస్తానని, రాత్రి పూట స్వీట్లు తినే తన అలవాటును అభిమానులు అస్సలు కాపీ కొట్టవద్దని హెచ్చరించారు.
ఇక ఫిట్‌నెస్ విషయంలో తన పిల్లలైన టైగర్ ష్రాఫ్, కృష్ణ ష్రాఫ్‌ల మాటలు వింటానని ఆయన తెలిపారు. సాధారణంగా పిల్లలే తల్లిదండ్రుల మాట వినాలని అంటుంటారు, కానీ ఆరోగ్యం విషయంలో తాను మాత్రం తన పిల్లల సలహాలను తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పారు.
తాను చేసుకునే వడపావే బెస్ట్
ముంబై నగరంతో జ్యాకీ ష్రాఫ్‌కు విడదీయరాని బంధం ఉంది. అక్కడి ఫేమస్ వడపావ్ సెంటర్లయిన దాదర్ స్టేషన్, కీర్తి కాలేజ్, కాపిటల్ సినిమా థియేటర్ పరిసరాల్లోని స్పాట్స్ గురించి ఆయన గుర్తుచేసుకున్నారు.
గతంలో ముంబైలోనే బెస్ట్ వడపావ్ స్టాల్‌కు తన చేతుల మీదుగా అవార్డు ఇచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. అయితే అన్నింటికంటే బెస్ట్ వడపావ్ ఏది అంటే.. "నేను ఇంట్లో సొంతంగా తయారుచేసుకునే వడపావే నాకు బెస్ట్" అని సమాధానమిచ్చారు.
అల్లం నీళ్ల ముచ్చట
తన హెల్త్ సీక్రెట్స్‌లో ఒకటైన 'అల్లం నీళ్ల' (Ginger Water) ప్రాధాన్యతను కూడా ఈ సందర్భంగా పంచుకున్నారు. అల్లాన్ని బాగా దంచి, వేడి నీళ్లలో మరిగించి ఆ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ బాగుంటుందని, ముఖ్యంగా భోజనం తర్వాత ఇది ఎంతో మేలు చేస్తుందని సలహా ఇచ్చారు. అయితే రోజుకు ఒక్కసారి మాత్రమే దీనిని తీసుకోవాలని సూచించారు.
అన్నం, పప్పు, నెయ్యి
స్టార్ హోదాలో ఉండి రకరకాల ఖరీదైన వంటకాలు తినే అవకాశం ఉన్నప్పటికీ, తనకు మాత్రం 'అన్నం, పప్పు, నెయ్యి' కలిపి తింటే వచ్చే తృప్తి మరి దేనిలోనూ దొరకదని జాకీ ష్రాఫ్ చెప్పుకొచ్చారు. పల్లెటూళ్ల నుంచి తన స్నేహితులు తెచ్చే స్వచ్ఛమైన నెయ్యి వేసుకుని పప్పు అన్నం తినడమే తన ఫేవరెట్ మీల్ అని చెప్పడం ఆయన సాధారణ జీవితానికి అద్దం పడుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


