Rajinikanth Jailer 2 Advance Booking Collection: బాక్సాఫీస్ వద్ద తలైవా రజనీకాంత్ హవా మళ్లీ మొదలైంది. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ 'జైలర్ 2' అడ్వాన్స్ బుకింగ్స్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. థియేటర్లలో సినిమా విడుదల కావడానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉన్నప్పటికీ, అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన కేవలం ఒక్క రోజులోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 20 కోట్లకు పైగా ప్రీ-సేల్స్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
ఓవర్సీస్‌లో రజనీ క్రేజ్ పీక్స్!

గతంలో వచ్చిన 'జైలర్' మొదటి భాగం తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న 'జైలర్ 2' పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 10న భారతదేశంలో ముందస్తు టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా, ఓవర్సీస్‌లో అంతకంటే ఒక్కరోజు ముందే బుకింగ్స్ తెరుచుకున్నాయి.
ఆదివారం (అక్టోబర్ 11) ఉదయానికి అందిన వివరాల ప్రకారం, విదేశీ మార్కెట్లలోనే జైలర్ 2 సినిమాకు దాదాపు 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 17 కోట్లు) కంటే ఎక్కువ ప్రీ-సేల్స్ నమోదు కావడం విశేషం.
దేశీయంగా రూ. 4 కోట్లు దాటిన ప్రీ-సేల్స్
ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో ఇంకా పూర్తి స్థాయిలో థియేటర్ల కౌంట్ అందుబాటులోకి రాకపోయినప్పటికీ, మొదటి రోజే రూ. 4 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు నమోదయ్యాయి. ఇందులో ఒక్క మొదటి రోజు (అక్టోబర్ 15) షోల కోసమే రూ. 3.53 కోట్ల విలువైన టికెట్లు అమ్ముడయ్యాయి.
తమిళనాడులో అభిమానులు థియేటర్ల వద్ద క్యూ కడుతుండటంతో దేశీయ బుకింగ్స్‌లో 90 శాతం వసూళ్లు ఒక్క తమిళనాడు నుంచే రావడం గమనార్హం. కేవలం చెన్నై నగరంలోనే రూ. 1.63 కోట్ల టికెట్లు ముందస్తుగా అమ్ముడయ్యాయి. అక్టోబర్ 11న కేరళతో పాటు తెలుగు రాష్ట్రాల్లో, హిందీ బెల్ట్‌లో బుకింగ్స్ జోరందుకుంటే ఈ సంఖ్య మరింత భారీగా పెరగనుంది.
హృతిక్ రోషన్ ఉనికిపై ఉత్కంఠ.. అదనపు ఆకర్షణగా మల్టీస్టారర్ కాస్టింగ్!
దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన జైలర్ 2 చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మొదటి భాగంలో మెరిసిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ హ్యాట్రిక్ హీరో శివ రాజ్‌కుమార్ ఈ సీక్వెల్లో కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
{{/usCountry}}దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన జైలర్ 2 చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మొదటి భాగంలో మెరిసిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ హ్యాట్రిక్ హీరో శివ రాజ్‌కుమార్ ఈ సీక్వెల్లో కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
{{/usCountry}}వీరితో పాటు రమ్యకృష్ణ, యోగి బాబు, మిర్నా మీనన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. రీసెంట్‌గా విడుదలైన జైలర్ 2 ట్రైలర్‌లో చూపించిన ఒక షాడో ఆధారంగా బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో మెరవబోతున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ ప్రచారం నిజమైతే సినిమా పాన్-ఇండియా రేంజ్‌లో రికార్డులను తిరగరాయడం ఖాయం.
విడుదల ఎప్పుడు? రన్‌టైమ్ వివరాలు
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ భారీ చిత్రం జైలర్ 2 అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు UA 16+ సర్టిఫికేట్‌ను కేటాయించింది. సినిమా రన్‌టైమ్ 2 గంటల 45 నిమిషాలుగా ఉంది. మొదటి భాగం సృష్టించిన రికార్డులను తిరగరాస్తూ 'జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సునామీ సృష్టిస్తుందో చూడాలి.