Jailer 2 OTT Release Date: అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్ 2 (Jailer 2) థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజినీకాంత్ 'టైగర్ ముత్తువేల్ పాండియన్' గా మరోసారి విశ్వరూపం చూపించారు. ఇప్పుడు థియేటర్లు జైలర్ 2 మేనియాతో ఊగిపోతున్నాయి.
రికార్డు కలెక్షన్లు

ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం.. రిలీజైన కేవలం 9 రోజుల్లోనే జైలర్ 2 ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.628 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్లో ఒకటిగా ఈ మూవీ నిలిచింది. ఇండియాలో రూ.350 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు రాబట్టి అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 20 ఇండియన్ సినిమాల లిస్ట్ లో చోటు దక్కించుకుంది.
ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
థియేటర్లలో రికార్డులు కొల్లగొడుతున్న జైలర్ 2 ఓటీటీ రిలీజ్ పై షాకింగ్ బజ్ వైరల్ గా మారింది. పాపులర్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ కు ప్రైమ్ వీడియోకు మధ్య థియేట్రికల్ రిలీజ్ కు ఓటీటీ రిలీజ్ కు మధ్య 4 వారాల గ్యాప్ ఉండేలా డీల్ కుదిరింది.
దీని ప్రకారం నవంబర్ 12 నుంచి రజినీకాంత్ హీరోగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి రానుంది.
కళ్లు చెదిరే ఓటీటీ డీల్ వాల్యూ
జైలర్ 2 సినిమా ఓటీటీ రైట్స్ డీల్ ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా రూ.160 కోట్లు వెచ్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక తమిళ సినిమాకు ఈ స్థాయి ఓటీటీ డీల్ జరగడం ఇదే తొలిసారి అని, ఇది సరికొత్త రికార్డు అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
యాక్షన్ ఎంటర్టైనర్ ఫీస్ట్
{{/usCountry}}జైలర్ 2 సినిమా ఓటీటీ రైట్స్ డీల్ ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా రూ.160 కోట్లు వెచ్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక తమిళ సినిమాకు ఈ స్థాయి ఓటీటీ డీల్ జరగడం ఇదే తొలిసారి అని, ఇది సరికొత్త రికార్డు అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
యాక్షన్ ఎంటర్టైనర్ ఫీస్ట్
{{/usCountry}}అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్, రజినీకాంత్ అన్ మ్యాచబుల్ స్వాగ్, నెల్సన్ మార్క్ డార్క్ కామెడీ.. వెరసి జైలర్ 2 ప్రేక్షకులకు ఓ మాస్ ఫెస్టివల్ లాంటి అనుభూతిని ఇస్తోంది. ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, విద్యా బాలన్ లాంటి భారీ తారాగణం ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.
థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు లేదా మళ్లీ చూడాలనుకునే వారు నవంబర్ 12 నుంచి ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.