...
...
Next Story

Jana Nayagan: మా సినిమాను థియేటర్లలో ఎవరైనా చూస్తారో లేదో.. లీక్ చూస్తే చూశారు కానీ మళ్లీ రండి: జన నాయగన్ డైరెక్టర్

Jana Nayagan: జన నాయగన్ మూవీ ఎట్టకేలకు థియేటర్లలోకి వస్తున్న సమయంలో డైరెక్టర్ హెచ్ వినోద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తమ సినిమాను థియేటర్లలో జనాలు చూస్తారో లేదో తెలియదని, గతంలోనే మూవీ లీకైనప్పుడు ఆన్‌లైన్ లో చూసిన వాళ్లు కూడా మళ్లీ థియేటర్లకు రావాలని కోరాడు.

Published on: Jul 20, 2026, 20:54:37 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Jana Nayagan: కోలీవుడ్ సూపర్ స్టార్, తమిళనాడు సీఎం దళపతి విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగన్' ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. సినిమా రిలీజ్‌కు ముందే పైరసీ బారిన పడినప్పటికీ, ఆడియన్స్ ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాను థియేటర్లలోనే చూడాలని డైరెక్టర్ హెచ్ వినోద్ కోరడం విశేషం. పెద్ద స్క్రీన్ పైనే ఈ కథలోని అంశాలను చూసి చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇది కేవలం ప్రమోషన్ కాదు

Jana Nayagan: మా సినిమాను థియేటర్లలో ఎవరైనా చూస్తారో లేదో.. పిల్లలు చూడలేకపోవడం బాధ కలిగిస్తోంది: జన నాయగన్ డైరెక్టర్ (X)
Jana Nayagan: మా సినిమాను థియేటర్లలో ఎవరైనా చూస్తారో లేదో.. పిల్లలు చూడలేకపోవడం బాధ కలిగిస్తోంది: జన నాయగన్ డైరెక్టర్ (X)

జన నాయగన్ సినిమా లీక్ అవడం థియేట్రికల్ కలెక్షన్లపై కచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుందని వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా మంది అనధికారిక లీకైన కాపీలు చూసేసినట్లు విన్నానని, దీంతో థియేటర్లలో ఈ సినిమాను చూస్తారో చూడరో అని అన్నారు. అయినా సరే విజయ్ సార్ కోసం ఫ్యాన్స్ థియేటర్లకు వస్తారని నమ్ముతున్నట్లు చెప్పారు.

ఈ మూవీ కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగే సాధారణ సినిమా కాదని, ఇందులో ఎన్నో సెన్సిటివ్ పొలిటికల్ ఇష్యూస్ టచ్ చేశామని క్లారిటీ ఇచ్చారు. విజయ్ స్థాపించిన టీవీకే (TVK) పార్టీని కేవలం ప్రమోట్ చేయడానికే ఈ సినిమా తీయలేదని, సమాజానికి అవసరమైన ఒక బలమైన సందేశం ఇందులో ఉందని స్పష్టం చేశారు.

సీఎం అవుతారని ఊహించలేదు.. అంతా ఒక కలలా ఉంది!

ఈ ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి రోజులను డైరెక్టర్ హెచ్ వినోద్ గుర్తుచేసుకున్నారు. షూటింగ్ టైంలో విజయ్ సీఎం అవుతారని తాము అస్సలు అనుకోలేదని, ఇప్పుడు అంతా ఒక కలలా అనిపిస్తోందని చెప్పారు.

ఎన్నో నెలల సెన్సార్ ఆలస్యాల తర్వాత ఎట్టకేలకు ఈ మూవీ జులై 23న థియేటర్లలో అడుగుపెడుతోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు 'A' సర్టిఫికెట్ వచ్చింది. హెచ్ వినోద్ గతంలో కార్తీతో 'తీరన్ అధిగారమ్ ఒండ్రు', అజిత్ తో 'వలిమై', 'తునివు' లాంటి ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్‌బస్టర్స్ అందించిన హిస్టరీ ఉంది. అదే రేంజ్ పవర్ ప్యాక్డ్ సీన్లు ఇందులో కూడా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ మెయిన్ విలన్‌గా రచ్చ చేయబోతున్నారు. రీసెంట్ సెన్సేషన్ మమితా బైజూతో పాటు ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, నరైన్, నాజర్ లాంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్ కెరీర్ లోనే ఇది లాస్ట్ మూవీ కావడం, పైగా ఆయన రియల్ లైఫ్ లో సీఎం అయిన తర్వాత థియేటర్లలోకి వస్తుండటంతో లీక్ ఇష్యూ పక్కన పెడితే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల జాతర ఖాయంగా కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks