బాలీవుడ్ స్టార్ నటి జాన్వీ కపూర్ తన పుట్టినరోజును (గురువారం) అత్యంత ఆధ్యాత్మికంగా జరుపుకుంది. ఏటా తన బర్త్ డే నాడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్న జాన్వీ.. ఈసారి కూడా తిరుమల చేరుకుంది. అంతేకాదు ప్రతిసారిలాగే ఈసారి కూడా అలిపిరి మెట్ల మార్గంలో ఆమె కొండకు చేరుకోవడం విశేషం.
3,550 మెట్లు.. కాలినడకన ప్రయాణం

సుమారు 3,550 మెట్లు ఉన్న చారిత్రాత్మక అలిపిరి కాలినడక మార్గంలో జాన్వీ కపూర్ నడుచుకుంటూ వెళ్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెల్లటి పూల డిజైన్ ఉన్న కుర్తా-పైజామా ధరించి, చాలా సాధారణంగా ఆమె మెట్ల మార్గంలో నడుస్తూ వెళ్లింది. తన వెంట సెక్యూరిటీ ఉన్నప్పటికీ, దారిలో ఎదురైన భక్తులను పలకరిస్తూ, సెల్ఫీలకు ఫోజులిస్తూ ఆమె చూపిన వినయం అందరినీ ఆకట్టుకుంది.
నెటిజన్ల ప్రశంసలు: "గ్లామర్, భక్తి కలయిక"
జాన్వీ భక్తిని చూసి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. "ఆమె తలచుకుంటే వీఐపీ దర్శనం సులభంగా దొరుకుతుంది, కానీ సామాన్య భక్తురాలిలా మెట్లు ఎక్కడం అభినందనీయం" అని ఒక అభిమాని రాశారు.
"నేటి తరం (Gen-Z) కేవలం గ్లామర్, టెక్నాలజీకే పరిమితం కాదు, వారికి దైవభక్తి కూడా ఎక్కువే అని జాన్వీ నిరూపించింది" అని మరికొందరు వ్యాఖ్యానించారు. తన తల్లి శ్రీదేవికి తిరుమల అంటే ఉన్న అపారమైన భక్తిని జాన్వీ ఇలా కొనసాగిస్తుండటం గమనార్హం.
జాన్వీ కపూర్ కెరీర్ అప్‌డేట్స్
జాన్వీ కపూర్ ఈ మధ్యే శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్ సరసన నటించిన 'సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి'తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'పెద్ది' (Peddi) మూవీలో నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 30, 2026న విడుదల కానుంది.
గతంలోనే ఎన్టీఆర్ తో కలిసి దేవర మూవీతో ఆమె టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆడంబరాలకు దూరంగా, ఆధ్యాత్మిక చింతనతో పుట్టినరోజును జరుపుకున్న జాన్వీ కపూర్ తీరు ఆమె పట్ల అభిమానుల్లో గౌరవాన్ని మరింత పెంచింది. తన పుట్టిన రోజునే కాదు.. తన తల్లి శ్రీదేవి పుట్టిన రోజున కూడా ఆమె ఇలాగే తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ వస్తోంది.
{{/usCountry}}గతంలోనే ఎన్టీఆర్ తో కలిసి దేవర మూవీతో ఆమె టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆడంబరాలకు దూరంగా, ఆధ్యాత్మిక చింతనతో పుట్టినరోజును జరుపుకున్న జాన్వీ కపూర్ తీరు ఆమె పట్ల అభిమానుల్లో గౌరవాన్ని మరింత పెంచింది. తన పుట్టిన రోజునే కాదు.. తన తల్లి శ్రీదేవి పుట్టిన రోజున కూడా ఆమె ఇలాగే తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ వస్తోంది.
{{/usCountry}}