ఆస్కార్స్ రేసు నుంచి జాన్వీ కపూర్ మూవీ ఔట్.. ఫైనల్ నామినేషన్స్ లిస్టులో దక్కని చోటు
ఆస్కార్స్ నామినేషన్ల తుది జాబితా వచ్చేసింది. దురదృష్టవశాత్తు ఇండియా తరఫున అధికారికంగా వెళ్లిన జాన్వీ కపూర్ మూవీ 'హోమ్‌బౌండ్' సినిమాకు ఇందులో చోటు దక్కలేదు. తుది నామినేషన్ల లిస్టు గురువారం (జనవరి 22) రిలీజ్ చేశారు.
ఆస్కార్స్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ కోసం ఆశగా ఎదురు చూసిన ఇండియన్ మూవీ ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ గురువారం (జనవరి 22) అధికారిక నామినేషన్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఇండియా తరపున అధికారికంగా వెళ్లిన 'హోమ్‌బౌండ్' సినిమాకు చోటు దక్కలేదు.

ఆస్కార్ రేసులోని మూవీస్ ఇవే
ఇండియా నుంచి ఆస్కార్స్ వెళ్లిన హోమ్‌బౌండ్ మూవీ తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన సినిమాలు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి. అర్జెంటీనా నుంచి 'బెలెన్', బ్రెజిల్ నుంచి 'ది సీక్రెట్ ఏజెంట్', ఫ్రాన్స్ నుంచి 'ఇట్ వాజ్ జస్ట్ యాన్ యాక్సిడెంట్', జర్మనీ నుంచి 'సౌండ్ ఆఫ్ ఫాలింగ్', ఇరాక్ నుంచి 'ది ప్రెసిడెంట్స్ కేక్' సినిమాలు ఎంపికయ్యాయి.
అలాగే జపాన్ నుంచి 'కోకుహో', జోర్డాన్ నుంచి 'ఆల్ దట్స్ లెఫ్ట్ ఆఫ్ యూ', నార్వే నుంచి 'సెంటిమెంటల్ వాల్యూ', పాలస్తీనా నుంచి 'పాలస్తీనా 36', దక్షిణ కొరియా నుంచి 'నో అదర్ ఛాయిస్' మూవీస్ కూడా చోటు దక్కించుకున్నాయి. వీటితో పాటు స్పెయిన్ నుంచి 'సిరత్', స్విట్జర్లాండ్ నుంచి 'లేట్ షిఫ్ట్', తైవాన్ నుంచి 'లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్', ట్యూనీషియా నుంచి 'ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్' వంటి సినిమాలు నామినేషన్ల జాబితాలో ఉన్నాయి.
'హోమ్‌బౌండ్' సినిమా కథ ఏంటంటే?
నీరజ్ ఘైవాన్ డైరెక్ట్ చేసిన 'హోమ్‌బౌండ్' మూవీ గతేడాది సెప్టెంబర్ 26న ఇండియాలో విడుదలైంది. ఈ సినిమాలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జేత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో దేశంలోని సగటు జీవులు పడిన కష్టాలను ఈ మూవీలో చూపించారు. దీనికి అంతర్జాతీయంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండియాలో మాత్రం థియేటర్లలో పెద్దగా ఆడలేడు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆస్కార్ ప్రచారానికి చాలా ఖర్చు: కరణ్ జోహార్
ఈ హోమ్‌బౌండ్ మూవీని కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ఆస్కార్ ప్రచారానికి అయ్యే ఖర్చు గురించి తన వ్యాపార భాగస్వామి అదార్ పూనావాలా ఎప్పుడూ ఆందోళన చెందలేదని తెలిపాడు.
"మేము హోమ్‌బౌండ్ సినిమా చేస్తున్నప్పుడు, ఆస్కార్ ప్రచారానికి చాలా డబ్బు ఖర్చవుతుందని నేను అదార్‌తో చెప్పాను. కొన్నిసార్లు అది ఎంత ఖర్చు పెట్టినా తరగని అగాధంలా ఉంటుంది. ఎందుకంటే ఫలితం ఏంటో మనకు తెలియదు. మనం కనీసం షార్ట్‌లిస్ట్ చేసిన 15 సినిమాల్లోకి లేదా చివరి 5 సినిమాల్లోకి వెళ్తామో లేదో కూడా తెలియదు. ఇది చాలా కష్టమైన పని" అని వివరించాడు.

E-Paper












