...
...
Next Story

Janhvi Kapoor: స్కూల్‌లో ఉన్నప్పుడే పోర్న్ సైట్‌లో ఫోటోలు.. ఆ చేదు జ్ఞాపకాలపై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు

Janhvi Kapoor: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన చిన్నతనంలో ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన అనుభవాన్ని పంచుకుంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన ఫోటోలు మార్ఫింగ్‌కు గురై పోర్న్ సైట్లలో దర్శనమిచ్చాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Published on: Apr 6, 2026, 12:28:14 IST
Advertisement

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే దిశగా సాగుతోంది. అయితే, స్టార్ కిడ్ కావడమనేది కేవలం అదృష్టం మాత్రమే కాదు, దాని వెనుక ఎంతో ఒత్తిడి, చేదు అనుభవాలు కూడా ఉంటాయని ఆమె తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.

స్కూల్ రోజుల్లోనే

జాన్వీ కపూర్ (instagram-Janhvi Kapoor)
జాన్వీ కపూర్ (instagram-Janhvi Kapoor)

ప్రముఖ యూట్యూబర్ రాజ్ షామనీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జాన్వీ కపూర్ తన వ్యక్తిగత జీవితం, టెక్నాలజీ దుర్వినియోగం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. స్కూల్ రోజుల్లో ఎదుర్కొన్న ఒక వింతైన, భయానకమైన పరిస్థితిని ఈ సందర్భంగా వివరించింది.

15 ఏళ్ల వయసులోనే

"నాకు అప్పుడు కేవలం 15 ఏళ్లు. స్కూల్‌లో ఐటీ క్లాస్ జరుగుతున్న సమయంలో కొందరు అబ్బాయిలు సరదా కోసం పోర్న్ సైట్లు చూస్తుండగా, అందులో నా ఫోటోలు కనిపించాయి.

అప్పట్లో అవి డీప్‌ఫేక్ అవునో కాదో తెలియదు కానీ, నా ముఖాన్ని మార్ఫింగ్ చేసి ఆ సైట్లలో పెట్టారు. ఆ వయసులో అది నాకు చాలా వింతగా, ఇబ్బందికరంగా అనిపించింది" అని జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్లు చేసింది.

ఏఐ ఫొటోలు

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టిస్తున్న డీప్‌ఫేక్ చిత్రాల పట్ల జాన్వీ కపూర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం సోషల్ మీడియా వినియోగదారులే కాకుండా, కొన్ని అధికారిక వార్తా సంస్థలు కూడా ఏఐ సృష్టించిన తన చిత్రాలను అసలైనవిగా భావించి షేర్ చేస్తున్నాయని ఆమె మండిపడింది.

ఆ ప్రమాదం

గతంలో నటి రష్మిక మందన్న కూడా ఇలాంటి డీప్‌ఫేక్ వీడియో బారిన పడిన సంగతి తెలిసిందే. 2023 నవంబర్‌లో రష్మిక ముఖాన్ని మరో యువతి శరీరానికి మార్ఫింగ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ కాగా, ఆమె ధైర్యంగా స్పందించి తప్పును ఎత్తిచూపారు.

టెక్నాలజీ దుర్వినియోగం కావడం పట్ల రష్మిక అప్పట్లో తీవ్రంగా హెచ్చరించింది. ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా అదే బాటలో టెక్నాలజీ వల్ల మహిళలకు ఎదురవుతున్న ముప్పును ప్రపంచానికి చాటిచెప్పింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks