Janhvi Kapoor Sreeleela: శ్రీలీల, జాన్వీ కపూర్ రొమాంటిక్ థ్రిల్లర్ షూటింగ్ షురూ-ఒకే అబ్బాయిపై పిచ్చి ప్రేమ-హీరో ఎవరంటే?
Janhvi Kapoor Sreeleela: గత కొంతకాలంగా వార్తల్లో వినిపించిన జాన్వీ కపూర్, శ్రీలీల రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఎట్టకేలకు స్టార్ట్ అయింది. ఒకే అబ్బాయిని పిచ్చిగా ప్రేమించే ఇద్దరు అమ్మాయిల స్టోరీతో ఈ మూవీ తెరకెక్కుతోంది. మరి జాన్వీ కపూర్, శ్రీలీలతో రొమాన్స్ చేసే ఆ హీరో ఎవరో ఇక్కడ చూసేయండి.
Janhvi Kapoor Sreeleela: హిందీ, తెలుగు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు స్టార్ హీరోయిన్లు జాన్వీ కపూర్, శ్రీలీల తొలిసారిగా ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. ఇంకా అధికారికంగా టైటిల్ నిర్ణయించని ఈ భారీ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌లో సిద్ధార్థ్ గుప్తా (Siddharth Gupta) హీరోగా నటిస్తున్నాడు. 'పగ్లైట్' వంటి ప్రశంసలు పొందిన కల్ట్ సినిమాను అందించిన ఉమేష్ బిష్త్ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

షూటింగ్ షురూ
జాన్వీ కపూర్, శ్రీలీల కలిసి నటిస్తున్న రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ షురూ అయింది. ప్రకృతి అందాలకు నిలయమైన ఉత్తరాఖండ్‌లోని నైనితాల్ (Nainital) కొండప్రాంతాలలో ఈ సినిమా తొలి షూటింగ్ షెడ్యూల్‌ను మేకర్స్ ప్రారంభించారు. ప్రస్తుతం లొకేషన్లలో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఆబ్సెసివ్ లవ్ డ్రామా!
ఈ సినిమా స్టోరీ సాధారణ రొమాంటిక్ సినిమాలకు భిన్నంగా అత్యంత డార్క్ అండ్ మైండ్-బెండింగ్ ఎలిమెంట్స్‌తో సాగనుందని తెలుస్తోంది. ఒకే పురుషుడితో ప్రేమలో పడి, అతనిపై విపరీతమైన పిచ్చి వ్యామోహాన్ని (Obsessive Love) పెంచుకునే ఇద్దరు స్త్రీల మానసిక సంఘర్షణ, వారి మధ్య జరిగే ఆధిపత్య పోరు ఈ కథకు ప్రధాన ఆధారం.
ప్రేమను కేవలం గ్లామరస్ డ్రామాగా కాకుండా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కోణంలో ఆవిష్కరించడంలో సిద్ధహస్తుడైన ఉమేష్ బిష్త్.. జాన్వీ కపూర్-శ్రీలీల ఇమేజ్‌కు తగినట్లుగా పవర్ఫుల్ అండ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్లను డిజైన్ చేశారని తెలిసింది.
టాప్ ప్రొడ్యూసర్స్
ఈ వినూత్న ప్రాజెక్ట్ కోసం ఏక్తా ఆర్ కపూర్ (Balaji Motion Pictures), ఆస్కార్ అవార్డు గ్రహీత గునీత్ మోంగా కపూర్ (Sikhya Entertainment) చేతులు కలపడం విశేషం. కమర్షియల్ వినోదాన్ని అందించడంలో ఏక్తా కపూర్, పవర్ఫుల్ కంటెంట్-డ్రివెన్ సినిమాలను రూపొందించడంలో గునీత్ మోంగాలకు ఉన్న అనుభవం ఈ సినిమా మేకింగ్ వాల్యూస్ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లనుంది.
బాలీవుడ్ లో పాగా
'ధమాకా', 'గుంటూరు కారం' చిత్రాలతో పాటు 'పుష్ప 2' లో ‘కిస్సిక్’ స్పెషల్ సాంగ్‌తో నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించిన శ్రీలీల.. ఈ ప్రాజెక్ట్‌తో హిందీ బెల్ట్‌లో నటిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. కేవలం రొటీన్ గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా సైకలాజికల్ థ్రిల్లర్ ఎంచుకోవడం ఆమె కెరీర్‌కు మైలేజ్ ఇస్తుంది. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ హీరోగా శ్రీలీల హిందీలో ఓ మూవీ చేస్తోంది.
దేవర, పెద్ది లాంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన జాన్వీ కపూర్ ఇప్పుడు శ్రీలీలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. జాన్వీ, శ్రీలీల ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తుండటంతో ఈ మూవీపై హైప్ భారీగా పెరిగింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


