...
...
Next Story

Peddi Movie Controversy: ఎద, నడుము షాట్స్ వద్దన్నా- రామ్ చరణ్ చెప్పినా అతను వినలేదు- జాన్వీ కపూర్ పేరిట ప్రైవేట్ చాట్స్

Peddi Movie Controversy: రామ్ చరణ్ 'పెద్ది' సినిమా చుట్టూ ఉన్న వివాదం మరింత ముదురుతోంది. హీరోయిన్ పాత్ర చిత్రీకరణపై నటి జాన్వీ కపూర్ పేరిట కొన్ని ప్రైవేట్ చాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం కలకలం రేపుతోంది.

Published on: Jun 7, 2026, 10:39:00 IST
Advertisement

Peddi Movie Controversy: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వచ్చిన 'పెద్ది' (Peddi) చిత్రం బాక్సాఫీస్ వసూళ్లతో పాటు సరికొత్త వివాదాలకు కూడా కేంద్రబిందువుగా మారింది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను చూపించిన విధానం, కెమెరా యాంగిల్స్‌పై సోషల్ మీడియాలో ఇప్పటికే నెగిటివ్ ట్రెండ్ నడుస్తోంది.

జాన్వీ కపూర్ చాట్స్

ఎద, నడుము షాట్స్ వద్దన్నా.. జాన్వీ కపూర్ పేరిట ప్రైవేట్ చాట్స్
ఎద, నడుము షాట్స్ వద్దన్నా.. జాన్వీ కపూర్ పేరిట ప్రైవేట్ చాట్స్

ఇప్పటికే పెద్దిలో హీరోయిన్ జాన్వీ కపూర్ ను చూపించిన తీరుపై డైరెక్టర్ బుచ్చిబాబు సాన సారీ చెప్పాడు. ఆ సీన్లను తొలగించారు కూడా. అయితే, ఈ గ్యాప్‌లోనే ఇండస్ట్రీని షేక్ చేస్తూ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పేరిట కొన్ని ప్రైవేట్ చాట్స్ స్క్రీన్ రికార్డింగ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వైరల్ చాట్స్‌లో ఏముంది?

ఒక పాపులర్ ఫ్యాన్ క్లబ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ అన్‌వెరిఫైడ్ (నిర్ధారణ కాని) స్క్రీన్ రికార్డింగ్స్ ప్రకారం.. 'అచ్చియమ్మ' పాత్ర చిత్రీకరణపై మేకింగ్ దశలోనే తీవ్రమైన అంతర్గత చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

కొన్ని సీన్లలో గ్లామర్ ప్రెజెంటేషన్ కోసం వాడిన కెమెరా యాంగిల్స్‌పై హీరోయిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఆ చాట్స్‌లో ఉంది. ఎద (బూ***), నడుము షాట్లు వద్దని డైరెక్టర్ కు జాన్వీ చెప్పినట్లు ఉంది. ఈ విషయంలో హీరో రామ్ చరణ్ తనకు పూర్తి మద్దతుగా నిలిచారని, నటి ఆత్మగౌరవానికి భంగం కలగకుండా డైరెక్టర్‌కు స్పష్టమైన హెచ్చరికలు చేశారని ఆ మెసేజ్‌ల ద్వారా ప్రచారం జరుగుతోంది.

ఇవి నిజమేనా?

సౌత్ వర్సెస్ బాలీవుడ్

ఈ వైరల్ సంభాషణల్లో గతంలో వచ్చిన 'గేమ్ ఛేంజర్' సినిమాలో కియారా అద్వానీ క్యారెక్టర్‌పై వచ్చిన విమర్శలను కూడా కొందరు ఫ్యాన్స్ గుర్తు చేశారు. కమర్షియల్ సినిమాల్లో మహిళా పాత్రలను కేవలం ‘గ్లామర్ బొమ్మలుగా’ మార్చే సంస్కృతి ఇంకా కొనసాగుతోందంటూ సదరు చాట్స్‌లో ఆవేదన వ్యక్తమవడం విశేషం. షూటింగ్ ఒకలా చేసి, ఎడిటింగ్ టేబుల్ మీద సీన్లను మార్చేస్తారనే భయం కూడా నటీమణులలో ఎలా ఉందో ఈ వైరల్ టాక్ ద్వారా బయటకు వచ్చింది.

మార్పు కోసం

చిత్ర పరిశ్రమలో మార్పు రావాలని, కేవలం ఒక్కరి నిర్ణయంతో కాకుండా సామూహిక బాధ్యతతో సినిమాలు తీయాలని ఇటీవల డింపుల్ హయాతీ వంటి నటీమణులు కూడా గళమెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'పెద్ది' వివాదం టాలీవుడ్ రైటింగ్ రూమ్స్‌లో ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి.

People Also Ask (FAQ)

ప్రశ్న: 'పెద్ది' సినిమా వివాదంపై జాన్వీ కపూర్ లీక్డ్ చాట్స్ నిజమైనవేనా?

జవాబు: సోషల్ మీడియాలో ఒక ఫ్యాన్ క్లబ్ ద్వారా ఈ వాట్సాప్ చాట్స్, స్క్రీన్ రికార్డింగ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మెసేజ్‌లు జాన్వీ కపూర్ స్వయంగా పంపినవే అనే దానిపై క్లారిటీ లేదు.

ప్రశ్న: ఈ వివాదంపై డైరెక్టర్ బుచ్చిబాబు సాన ప్రకటన ఏంటి?

జవాబు: సినిమాలోని కొన్ని సీన్లు ప్రేక్షకుల భావాలను, మహిళల ఆత్మగౌరవాన్ని ఇబ్బంది పెట్టాయనే విమర్శలను స్వీకరిస్తూ డైరెక్టర్ బుచ్చిబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. ఆ వివాదాస్పద విజువల్స్‌ను డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించాడు.

ప్రశ్న: 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఏంటి?

జవాబు: రామ్ చరణ్ ఈ సినిమాలో 'పెద్ది' అనే టైటిల్ రోల్ పోషించాడు. ఇందులో ఆయన ఫస్ట్ హాఫ్‌లో క్రికెటర్‌గా, సెకండ్ హాఫ్‌లో కుస్తీ (రెజ్లింగ్) యోధుడిగా విభిన్న షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ పాత్రలో నటించాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks