...
...
Next Story

Jani Master: పోక్సో కేసు నుంచి.. బాయ్ కాట్ వరకూ.. జానీ మాస్టర్ కెరీర్ లో వివాదాలు.. ఇక సాంగ్స్ కొరియోగ్రఫీ చేయడా?

Jani Master: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కెరీర్‌లో వివాదాల పరంపర ముగిసేలా కనిపించడం లేదు. తీవ్రమైన పోక్సో కేసు నుంచి… ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జానీపై సంచలన నిర్ణయం తీసుకోవడం వరకు వివాదాలు కలకలం రేపుతున్నాయి. ఈ కాంట్రవర్సీలపై ఓ లుక్కేయండి.

Published on: Jul 18, 2026, 14:21:59 IST
Advertisement

Jani Master: టాప్ హీరోలతో సాంగ్స్.. కుర్రాళ్లను ఉర్రూతలూగించేలా స్టెప్పులు.. డ్యాన్స్ మూమెంట్స్ తో మైమరిపించే టాలెంట్.. ఇదీ టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్టోరీ. కానీ ఇది కాయిన్ కు ఒక వైపు మాత్రమే. మరోవైపు వరుస వివాదాలున్నాయి. తీవ్రమైన కేసులు ఉన్నాయి.

జానీ మాస్టర్‌కు కొత్త షాక్

పోక్సో కేసు నుంచి.. బాయ్ కాట్ వరకూ.. జానీ మాస్టర్ కెరీర్ లో వివాదాలు
పోక్సో కేసు నుంచి.. బాయ్ కాట్ వరకూ.. జానీ మాస్టర్ కెరీర్ లో వివాదాలు

తాజాగా డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో జానీ మాస్టర్ కు షాక్ తగిలింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (TFIEF) జానీ మాస్టర్, ఆయన భార్య సుమలతపై నాన్-కోఆపరేషన్ పిలుపునిచ్చింది. సుమలత ప్రస్తుత తెలుగు ఫిల్మ్ & టీవీ డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.

ఎవరూ కోపరేట్ చేయొద్దని

ఫెడరేషన్ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, యూనియన్ నియమ నిబంధనలను ఉల్లంఘించడం వల్లే జానీ మాస్టర్ పై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. దీనివల్ల రాబోయే రోజుల్లో జాని మాస్టర్ కంపోజ్ చేసే పాటలకు ఫెడరేషన్ పరిధిలోని కార్మికులు సహకరించే అవకాశం లేకపోవడంతో ఆయన కెరీర్ మరింత సంక్షోభంలో పడింది.

అసోసియేషన్‌లో చెలరేగిన చిచ్చు

ఈ తాజా వివాదానికి అసలు మూలం డ్యాన్సర్స్ అసోసియేషన్ ఆఫీస్‌లో జానీ మాస్టర్, టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మధ్య జరిగిన తీవ్రమైన ఘర్షణే అని తెలుస్తోంది.

అసోసియేషన్ ఎన్నికల నిర్వహణ తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జానీ మాస్టర్ వర్గం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు నిరసనగా పలువురు కీలక సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఈ వివాదం కాస్తా ఫెడరేషన్ వర్సెస్ జానీ మాస్టర్‌గా మారింది.

ఫిల్మ్ చాంబర్ జోక్యం

అయితే, ఈ వ్యవహారంలో ఫెడరేషన్ నాయకులు పక్కా రూల్ బుక్‌ను తెరపైకి తెచ్చారు. వివాదం అనేది నిర్మాతలు-కార్మికుల మధ్య ఉంటేనే చాంబర్ జోక్యం చేసుకోగలదని, ఇది రెండు అనుబంధ యూనియన్ల మధ్య నడుస్తున్న అంతర్గత గొడవ కాబట్టి ఇక్కడ చాంబర్ పాత్ర పరిమితమేనని స్పష్టం చేస్తున్నారు.

కొరియోగ్రఫీ చేస్తాడా?

పెద్ద పెద్ద స్టార్ హీరోలతో హుషారైన స్టెప్పులు వేయిస్తాడని జానీ మాస్టర్ కు మంచి పేరుంది. అయితే ఎంత టాలెంట్ ఉన్నా, డిసిప్లేన్ లేకపోతే మాత్రం పతనం తప్పదు. ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలోనూ అదే జరుగుతుందనే టాక్ ఉంది. ఇప్పుడు జానీ మాస్టర్ కానీ తగ్గకపోతే అతను ఇకపై సాంగ్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశం ఉండదని అంటున్నారు.

ఆ పోక్సో కేసు

జానీ మాస్టర్ కెరీర్ లో వివాదాలు కొత్తేం కాదు. సెప్టెంబర్ 2024 లో ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో జానీ మాస్టర్ పై పోక్సో (POCSO) కేసు నమోదైంది. ఆ సమయంలో గోవాలో అతణ్ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత అక్టోబర్ 2024 లో తెలంగాణ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe